Lava Agni 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 19 Oct 2022 13:53:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో రోలౌట్ అయిన Lava Agni 5G OTA అప్డేట్ https://www.91mobiles.com/telugu/lava-agni-5g-ota-update-rolled-out/ Wed, 19 Oct 2022 13:53:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=2976 హైలైట్స్ 5జీ నెట్వర్క్ సర్వీసెస్ కోసం ఓటీఏ అప్డేట్ పొందిన Lava Agni ఈ అప్డేట్ తో ఎనేబుల్ కానున్న ఎయిర్టెల్, జియో 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి క్వాడ్ కెమెరాస్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ స్వదేశీ కంపెనీ Lava, అగ్ని 5జీ డివైజ్ కి ఓటీఏ అప్డేట్ ద్వారా 5జీ నెట్వర్క్ సపోర్ట్ ని ఎనేబుల్ చేయనుంది. ఓటీఏ అప్డేట్ పంపిస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. 5జీ […]

The post భారత్ లో రోలౌట్ అయిన Lava Agni 5G OTA అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 5జీ నెట్వర్క్ సర్వీసెస్ కోసం ఓటీఏ అప్డేట్ పొందిన Lava Agni
  • ఈ అప్డేట్ తో ఎనేబుల్ కానున్న ఎయిర్టెల్, జియో 5జీ
  • మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి క్వాడ్ కెమెరాస్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

స్వదేశీ కంపెనీ Lava, అగ్ని 5జీ డివైజ్ కి ఓటీఏ అప్డేట్ ద్వారా 5జీ నెట్వర్క్ సపోర్ట్ ని ఎనేబుల్ చేయనుంది. ఓటీఏ అప్డేట్ పంపిస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. 5జీ సపోర్ట్ ని త్వరగా ఎనేబుల్ చేసిన కంపెనీల్లో లావా కూడా ఒకటని సదరు కంపెనీ తెలిపింది. ఈ ఓటీఏ అప్డేట్ ద్వారా ఎయిర్టెల్, జియో 5జీ సేవలు లావా అగ్ని ఫోన్లో ఎనేబుల్ కానున్నాయి. 5జీ స్మార్ట్ ఫోన్లు ఉంటే సరిపోదండోయ్, సదరు ఫోన్ తయారీదారు 5జీ సపోర్ట్ కి సంబంధించిన అప్డేట్ ని పంపాల్సి ఉంటుంది. ఆ అప్డేట్ వస్తే గాని మీరు మీ 5జీ డివైజెస్ లో 5జీ సేవలు ఉపయోగించుకోలేరు.

మీరు కనుక లావా అగ్ని 5జీ డివైజ్ వాడుతున్నట్లైతే, 5జీ సేవల కోసం కంపెనీ నుంచి వచ్చే 5జీ సపోర్ట్ ఓటీఏ అప్డేట్ ని గుర్తించి వెంటనే అప్డేట్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి. దీంతో మీ డివైజ్ లో 5జీ కనెక్టివిటీ సపోర్ట్ ఎనేబుల్ అవుతుంది.

ప్రస్తుతం దేశంలో ఎయిర్టెల్ మరియు జియో కంపెనీలు పలు నగరాల్లో 5జీ సేవలను అందిస్తున్నాయి. 2024 కల్లా దేశ వ్యాప్తంగా 5జీ సేవలను పూర్తి స్థాయిలో విస్తరింపజేయాలని ఆయా కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా తన 5జీ సేవల లాంచ్ కి సంబంధించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Lava Agni స్పెసిఫికేషన్స్

Lava Agni స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, న్యారో బెజెల్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ నిక్షిప్తమై ఉంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పని చేస్తుంది.

Lava Agni లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి కెమెరాను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. Lava Agni 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. భద్రత కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో రోలౌట్ అయిన Lava Agni 5G OTA అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>