Lava Blaze NXT - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 25 Nov 2022 03:53:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 7GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన Lava Blaze NXT: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/lava-blaze-nxt-launched-india-price-specs-availability/ Fri, 25 Nov 2022 03:53:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=3659 హైలైట్స్ నేడు లాంచ్ అయిన Lava Blaze NXT బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ37, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వచ్చిన Lava Blaze NXT Lava Blaze NXT ధర రూ.9,299, అమెజాన్ ద్వారా సేల్ సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఫోన్లను తీసుకొస్తున్న లావా కంపెనీ ఇప్పుడిప్పుడే మార్కెట్ లో నిలదొక్కుకుంటోంది. జనాల ఆదరణ కూడా ఉండటం కంపెనీకి కలిసి వచ్చే అంశం. అతి త్వరలో లావా కంపెనీ మార్కెట్ లో […]

The post 7GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన Lava Blaze NXT: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నేడు లాంచ్ అయిన Lava Blaze NXT బడ్జెట్ స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ37, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వచ్చిన Lava Blaze NXT
  • Lava Blaze NXT ధర రూ.9,299, అమెజాన్ ద్వారా సేల్

సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఫోన్లను తీసుకొస్తున్న లావా కంపెనీ ఇప్పుడిప్పుడే మార్కెట్ లో నిలదొక్కుకుంటోంది. జనాల ఆదరణ కూడా ఉండటం కంపెనీకి కలిసి వచ్చే అంశం. అతి త్వరలో లావా కంపెనీ మార్కెట్ లో పాతుకుపోయిన చైనా ఫోన్ కంపెనీలకు మరింత గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వెళ్ళాలని ఆశిద్దాం.

స్వదేశీ కంపెనీ అయిన Lava ఇటీవలె Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దేశంలోనే అత్యంత తక్కువ ధర కలిగిన 5జీ ఫోన్ గా Lava Blaze 5G పేరు సంపాదించింది. దానికి తోడు జనాల నుంచి కూడా ఫోన్ కి డిమాండ్ బాగానే ఉంది. దీంతో లావా బ్లేజ్ 5జీ అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. ఇదే జోష్ లో లావా కంపెనీ నేడు Lava Blaze NXT ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని ధర కూడా రూ.10,000 లోపే ఉండటం విశేషం. అలాగే ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి + 3జిబి వర్చువల్ ర్యామ్ తో లాంచ్ అయ్యింది. Lava Blaze NXT యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava Blaze NXT స్పెసిఫికేషన్స్

Lava Blaze NXT లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అందించారు. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ ని వాడారు. గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GE8320 GPU ఉపయోగించారు. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ అందించారు. అలాగే Lava Blaze NXT లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్ ని 3జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 7జిబి ర్యామ్ లభిస్తుందన్న మాట. ఒకేసారి ఎక్కువ యాప్స్ వాడేందుకు ఈ ర్యామ్ సరిపోతుంది.

ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంది.

Lava Blaze NXT కెమెరా

Lava Blaze NXT లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. మిగతా రెండు కెమెరాల వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

Lava Blaze NXT డిజైన్, ధర

ఇక ఫోన్ డిజైన్ విషయానికి వస్తే ఇందులో ప్రీమియమ్ గ్లాస్ బ్యాక్ ని అందించారు. చూసేందుకు డివైజ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పైన ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఫోన్ ముందువైపు చూస్తే వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంది. Lava Blaze NXT ధరను రూ.9,299 గా నిర్ణయించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 7GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన Lava Blaze NXT: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>