Lava India - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 30 May 2024 08:06:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Yuva 5G: UniSoc T750 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/lava-yuva-5g-launched-india-unisoc-t750-chipset/ Thu, 30 May 2024 08:06:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=11805 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారత్ లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. తక్కువ ధరలో 5జీ కనెక్టివిటీతో, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో లావా యువా 5జీ వచ్చింది. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Lava […]

The post Lava Yuva 5G: UniSoc T750 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Lava Yuva 5G లాంచ్
  • 6.52-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్
  • 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారత్ లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. తక్కువ ధరలో 5జీ కనెక్టివిటీతో, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో లావా యువా 5జీ వచ్చింది. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Lava Yuva 5G ధర, లభ్యత

Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ ధర భారత్ లో రూ.9,499 తో ప్రారంభమవుతుంది. జూన్ 5వ తేదీ నుంచి అమెజాన్, లావా ఈస్టోర్, లావా రిటైల్ నెట్వర్క్ ద్వారా ఈ డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు.

Lava Yuva 5G 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.9,499 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది.

కలర్ ఆప్షన్స్: Lava Yuva 5G డివైజ్ మిస్టిక్ గ్రీన్ మరియు మిస్టిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Lava Yuva 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ లో 6.52-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ (720*1600 పిక్సెల్స్) రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2.5డీ కర్వ్డ్ గ్లాస్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Yuva 5G లో యూనిఎస్ఓసీ టీ750 చిప్సెట్ ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడారు.

మెమొరీ: Lava Yuva 5G డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Yuva 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14 కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.

కెమెరా: Lava Yuva 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి ఆగ్జిలరీ లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Lava Yuva 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Lava Yuva 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Lava Yuva 5G 163.36 మి.మీ పొడవు, 76.16 మి.మీ వెడల్పు, 9.1 మి.మీ మందం, 208 గ్రాముల బరువు ఉంటుంది.

The post Lava Yuva 5G: UniSoc T750 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>