Lava Yuva Star - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 03 Jul 2024 18:11:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Yuva Star: త్వరలో లాంచ్ కానున్న లావా యువా స్టార్, రివీలైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/lava-yuva-star-to-launch-soon-specs-revealed/ https://www.91mobiles.com/telugu/lava-yuva-star-to-launch-soon-specs-revealed/#respond Wed, 03 Jul 2024 18:11:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=12363 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava త్వరలో Lava Blaze X ను లాంచ్ చేయనుంది. ఈలోపు మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు లావా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Lava Yuva Star పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Lava Yuva Star లాంచ్ టైమ్‌లైన్, ధర (లీక్) […]

The post Lava Yuva Star: త్వరలో లాంచ్ కానున్న లావా యువా స్టార్, రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 4జీ కనెక్టివిటీతో వస్తోన్న Lava Yuva Star
  • ధర రూ.8,000 లోపు ఉండే అవకాశం
  • UniSoc T612 ప్రాసెసర్, 6జిబి ర్యామ్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava త్వరలో Lava Blaze X ను లాంచ్ చేయనుంది. ఈలోపు మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు లావా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Lava Yuva Star పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Lava Yuva Star లాంచ్ టైమ్‌లైన్, ధర (లీక్)

Lava Yuva Star స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన వివరాలను PassionateGeeks వెబ్‌సైట్ తన కథనం ద్వారా రివీల్ చేసింది. Lava Yuva Star డివైజ్ బ్లేజ్ ఎక్స్ సేల్ మొదలైన తర్వాత లాంచ్ అవుతుందని సమాచారం. ఆగస్టు నెలలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ.8,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Lava Yuva Star స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రాసెసర్: Lava Yuva Star డివైజ్ యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ తో లాంచ్ కానుంది.

ర్యామ్, స్టోరేజీ: Lava Yuva Star ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ: Lava Yuva Star లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Lava Yuva Star లో 13ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

కలర్ ఆప్షన్స్: Lava Yuva Star స్మార్ట్‌ఫోన్ పర్పుల్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సెక్యూరిటీ: భద్రత కోసం Lava Yuva Star లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది.

The post Lava Yuva Star: త్వరలో లాంచ్ కానున్న లావా యువా స్టార్, రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-yuva-star-to-launch-soon-specs-revealed/feed/ 0