Lava - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 30 May 2024 08:06:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Yuva 5G: UniSoc T750 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/lava-yuva-5g-launched-india-unisoc-t750-chipset/ Thu, 30 May 2024 08:06:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=11805 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారత్ లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. తక్కువ ధరలో 5జీ కనెక్టివిటీతో, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో లావా యువా 5జీ వచ్చింది. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Lava […]

The post Lava Yuva 5G: UniSoc T750 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Lava Yuva 5G లాంచ్
  • 6.52-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్
  • 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారత్ లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. తక్కువ ధరలో 5జీ కనెక్టివిటీతో, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో లావా యువా 5జీ వచ్చింది. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Lava Yuva 5G ధర, లభ్యత

Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ ధర భారత్ లో రూ.9,499 తో ప్రారంభమవుతుంది. జూన్ 5వ తేదీ నుంచి అమెజాన్, లావా ఈస్టోర్, లావా రిటైల్ నెట్వర్క్ ద్వారా ఈ డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు.

Lava Yuva 5G 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.9,499 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది.

కలర్ ఆప్షన్స్: Lava Yuva 5G డివైజ్ మిస్టిక్ గ్రీన్ మరియు మిస్టిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Lava Yuva 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ లో 6.52-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ (720*1600 పిక్సెల్స్) రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2.5డీ కర్వ్డ్ గ్లాస్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Yuva 5G లో యూనిఎస్ఓసీ టీ750 చిప్సెట్ ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడారు.

మెమొరీ: Lava Yuva 5G డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Yuva 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14 కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.

కెమెరా: Lava Yuva 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి ఆగ్జిలరీ లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Lava Yuva 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Lava Yuva 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Lava Yuva 5G 163.36 మి.మీ పొడవు, 76.16 మి.మీ వెడల్పు, 9.1 మి.మీ మందం, 208 గ్రాముల బరువు ఉంటుంది.

The post Lava Yuva 5G: UniSoc T750 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
డైమెన్సిటీ 1080 చిప్‌తో వస్తోన్న Lava Agni 2 5G; గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/lava-agni-2-5g-geekbench-listing-mediatek-1080-processor-other-key-specs/ Wed, 01 Mar 2023 12:17:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=5170 తరచూ ఫోన్లను విడుదల చేస్తూ, చైనీస్ బ్రాండ్స్ కి పోటీనిస్తూ.. క్రమంగా ఎదుగుతోంది స్వదేశీ బ్రాండ్ Lava. లావా సంస్థ వద్ద ఎంట్రీ లెవెల్ ఫోన్ల నుంచి మిడ్-రేంజ్ ఫోన్ల వరకు వివిధ రకాల హ్యాండ్సెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో లావా డివైజెస్ ని జనాలు బాగానే కొంటున్నారు. కంపెనీ విడుదల చేస్తోన్న ఫోన్లు నాణ్యత కలిగి ఉండటంతో వినియోగదారులు లావా ఫోన్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. Lava Agni 2 5G గురించి తాజాగా ఒక […]

The post డైమెన్సిటీ 1080 చిప్‌తో వస్తోన్న Lava Agni 2 5G; గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్
  • బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై కనిపించిన Lava Agni 2 5G డివైజ్
  • MediaTek Dimensity 1080 చిప్సెట్ తో వస్తోన్న Lava Agni 2 5G

తరచూ ఫోన్లను విడుదల చేస్తూ, చైనీస్ బ్రాండ్స్ కి పోటీనిస్తూ.. క్రమంగా ఎదుగుతోంది స్వదేశీ బ్రాండ్ Lava. లావా సంస్థ వద్ద ఎంట్రీ లెవెల్ ఫోన్ల నుంచి మిడ్-రేంజ్ ఫోన్ల వరకు వివిధ రకాల హ్యాండ్సెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో లావా డివైజెస్ ని జనాలు బాగానే కొంటున్నారు. కంపెనీ విడుదల చేస్తోన్న ఫోన్లు నాణ్యత కలిగి ఉండటంతో వినియోగదారులు లావా ఫోన్ల పట్ల ఆకర్షితులవుతున్నారు.

Lava Agni 2 5G గురించి తాజాగా ఒక సమాచారం బయటకు వచ్చింది. బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై Lava Agni 2 5G దర్శనమిచ్చింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలిసింది. సరే, పదండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

గీక్‌బెంచ్ పై కనిపించిన Lava Agni 2 5G

ప్రముఖ భారతీయ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, LXX504 అనే మోడల్ నంబర్ కలిగిన Lava ఫోన్ ఒకటి గీక్‌బెంచ్ పై కనిపించింది. ఆ డివైజ్ Lava Agni 2 5G అయ్యుండే అవకాశాలు అధికంగా ఉన్నాయని సదరు టిప్‌స్టర్ గుగ్లాని అభిప్రాయపడుతున్నారు.

Lava Agni 2 5G స్పెసిఫికేషన్స్ (రూమర్స్)

ఇక, గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, Lava Agni 2 5G గా భావింపబడుతోన్న ఆ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ని కలిగి ఉంది. అలాగే 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ ఆ ఫోన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన లీక్ అందించిన చిప్సెట్ సమాచారాన్ని తాజా లీక్ కూడా ధృవీకరిస్తోంది. అయితే సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 13 ఓఎస్ గురించి లేటెస్ట్ లీక్ ద్వారానే స్పష్టమైంది. ఇదే ఓఎస్ త్వరలో లాంచ్ కాబోయే Lava Agni 2 5G ఉంటుందని ఆశిద్దాం.

Lava Agni 2 5G కి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది.

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానున్నట్లు సమాచారం. అలాగే పవర్ బ్యాకప్ కోసం 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇంకా ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Lava Agni 2 5G ధర విషయానికి వస్తే, రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ లో ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

రూ.20,000 నుంచి రూ.25,000 ధర పెడితే కనుక హెచ్డీ+ డిస్ప్లే ఇవ్వడం సరైంది కాదు. యూజర్ కూడా వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఈ ధర శ్రేణిలో ఇప్పుడు అన్నీ ఫోన్లు దాదాపుగా ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేని అందిస్తున్నాయి. మార్కెట్ లో Lava మరింతగా సక్సెస్ కావాలంటే, ఇటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డైమెన్సిటీ 1080 చిప్‌తో వస్తోన్న Lava Agni 2 5G; గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>