Lenovo ThinkPhone - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 07:45:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో లాంచైన ‘లెనొవొ థింక్‌ఫోన్’ https://www.91mobiles.com/telugu/lenovo-thinkphone-launched-price-specs-availability/ Fri, 06 Jan 2023 09:33:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=4367 హైలైట్స్ ఐపీ68, MIL-STD 810H రేటింగ్ తో లాంచ్ అయిన Lenovo ThinkPhone స్టీల్ కన్నా దృఢమైన అరామిడ్ ఫైబర్ తో తయారైన Lenovo ThinkPhone యొక్క బ్యాక్ ప్యానెల్ Lenovo ThinkPhone తో Think2Think కనెక్టివిటీని తీసుకొచ్చిన లెనొవొ Think బ్రాండింగ్ తో తొలి స్మార్ట్ ఫోన్ ని Lenovo పరిచయం చేసింది. ఈ ఫోన్ పేరు: Lenovo ThinkPhone. ఈ ఫోన్ బిజినెస్-గ్రేడ్ స్మార్ట్ ఫోన్. ఇది మోటో కీసేఫ్ తో వస్తోంది. ఇది […]

The post స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో లాంచైన ‘లెనొవొ థింక్‌ఫోన్’ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఐపీ68, MIL-STD 810H రేటింగ్ తో లాంచ్ అయిన Lenovo ThinkPhone
  • స్టీల్ కన్నా దృఢమైన అరామిడ్ ఫైబర్ తో తయారైన Lenovo ThinkPhone యొక్క బ్యాక్ ప్యానెల్
  • Lenovo ThinkPhone తో Think2Think కనెక్టివిటీని తీసుకొచ్చిన లెనొవొ

Think బ్రాండింగ్ తో తొలి స్మార్ట్ ఫోన్ ని Lenovo పరిచయం చేసింది. ఈ ఫోన్ పేరు: Lenovo ThinkPhone. ఈ ఫోన్ బిజినెస్-గ్రేడ్ స్మార్ట్ ఫోన్. ఇది మోటో కీసేఫ్ తో వస్తోంది. ఇది సెన్సిటివ్ డేటాకు అదనపు భద్రతను కల్పిస్తుంది. Lenovo ThinkPhone క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వచ్చింది. 12జిబి వరకు ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 50 ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.

Lenovo ThinkPhone యూఎస్, యురోప్, ల్యాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా మరియు ఆసియాలోని పలు దేశాల్లో రానున్న రోజుల్లో కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.

Lenovo ThinkPhone లో 144 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 512 జిబి స్టోరేజీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఉన్నాయి. లెనొవొ ఈ ఫోన్ ద్వారా థింక్2థింక్ కనెక్టివిటీని పరిచయం చేస్తోంది. దీని ద్వారా థింక్ ఫోన్ కి మరియు థింక్ ప్యాడ్ ల్యాప్‌టాప్స్ కి మధ్య సీమ్లెస్ ఇంటెగ్రేషన్ సాధ్యపడుతుంది. ఈ కనెక్టివిటీ ద్వారా యూజర్లు నోటిఫికేషన్స్, ఫోటోస్, డాక్యుమెంట్స్, కాపీ టెక్స్ట్ ని థింక్ ప్యామ్ మరియు థింక్ ఫోన్ కి నడుమ సింక్ చేసుకోవచ్చు.

థింక్ ప్యాడ్ యూజర్లు తమ ల్యాప్ టాప్ ద్వారా మాట్లాడే వీడియో కాల్స్ కోసం వెబ్ క్యామ్ లాగా Lenovo ThinkPhone ని వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ యాప్ ని తమ Lenovo ThinkPhone మరియు థింక్ ప్యాడ్ స్క్రీన్స్ పై రన్ చేసుకునే సౌకర్యం ఉంది. సరే ఓసారి Lenovo ThinkPhone యొక్క స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత గురించి తెలుసుకుందాం. పదండి.

Lenovo ThinkPhone యూఎస్, యురోప్, ల్యాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా మరియు ఆసియాలోని పలు దేశాల్లో రానున్న రోజుల్లో కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

లెనొవొ థింక్‌ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Lenovo ThinkPhone లో 6.6-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ వాడారు. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. గ్రాఫిక్స్ కోసం ఇందులో అడ్రెనో 730 జీపీయూ వాడారు. 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై Lenovo ThinkPhone పని చేస్తుంది.

Lenovo ThinkPhone లో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Lenovo ThinkPhone లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో లాంచైన ‘లెనొవొ థింక్‌ఫోన్’ first appeared on 91Mobiles Telugu.

]]>