Mahindra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 27 Jul 2022 16:52:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MAHINDRA నుంచి రానున్న 5 కొత్త ఎలక్ట్రిక్ కార్లు, ఆగస్టు 15 న లాంచ్ ఈవెంట్ https://www.91mobiles.com/telugu/mahindra-teased-5-evs-before-launch-event/ Wed, 27 Jul 2022 16:52:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=1308 హైలైట్స్: లాంచ్ కి ముందు రాబోవు ఈవీ లైనప్ ని టీజ్ చేసిన మహింద్ర కంపెనీ హై గ్రౌండ్ క్లియరన్స్, ఎస్యూవీ మాదిరి కనిపిస్తోన్న డిజైన్ వీటిలో ఒకటి XUV700 ఎలక్ట్రిక్ వర్షన్ అని అంచనా మహింద్ర యొక్క బార్న్ ఎలక్ట్రిక్ వెంచర్ క్రింద రాబోవు 5 ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని మహింద్ర కంపెనీ టీజ్ చేసింది. 2022, ఆగస్టు 15 న వీటి లాంచ్ ఈవెంట్ జరగనుంది. టీజర్ వీడియో లో చూపించిన ఈ కొత్త […]

The post MAHINDRA నుంచి రానున్న 5 కొత్త ఎలక్ట్రిక్ కార్లు, ఆగస్టు 15 న లాంచ్ ఈవెంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ కి ముందు రాబోవు ఈవీ లైనప్ ని టీజ్ చేసిన మహింద్ర కంపెనీ
  • హై గ్రౌండ్ క్లియరన్స్, ఎస్యూవీ మాదిరి కనిపిస్తోన్న డిజైన్
  • వీటిలో ఒకటి XUV700 ఎలక్ట్రిక్ వర్షన్ అని అంచనా

మహింద్ర యొక్క బార్న్ ఎలక్ట్రిక్ వెంచర్ క్రింద రాబోవు 5 ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని మహింద్ర కంపెనీ టీజ్ చేసింది. 2022, ఆగస్టు 15 న వీటి లాంచ్ ఈవెంట్ జరగనుంది. టీజర్ వీడియో లో చూపించిన ఈ కొత్త వెహికిల్స్ ఉత్పాదన తర్వాత మహింద్ర యొక్క SUV ల జాబితా లోకి చేరిపోనున్నాయి. అంతకు ముందు మహింద్ర, రాబోవు మూడు ఈవీ ల యొక్క సిగ్నేచర్ డీఆర్ఎల్ స్టైల్ ను టీజ్ చేసింది. ఈసారి, మహింద్ర 5 ఎలక్ట్రిక్ వాహనాల ప్రొఫైల్ ను టీజ్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇక లుక్స్ ని బట్టి చూస్తే, వీటిలో ఒకటి మహింద్ర XUV700 అని అర్థమవుతోంది.

లాంచ్ కి ముందు 5 ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని టీజ్ చేసిన Mahindra

తన నుంచి రాబోవు ఎలక్ట్రిక్ వాహనాల వరుసపై మహింద్ర కంపెనీ శరవేగంగా పని చేస్తోంది. ఇందులో భాగంగా, తాజాగా 5 కొత్త ఎలక్ట్రిక్ కార్లను టీజ్ చేసింది. ఈ ఐదు ఎలక్ట్రిక్ కార్లను మహింద్ర ఆగస్టు 15 న భారత్ లో జరిగే లాంచ్ ఈవెంట్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. మహింద్ర అడ్వాన్స్డ్ డిజైన్ యూరోప్, ఆక్స్ ఫర్డ్ షైర్, యూకే నుంచి మహింద్ర చీఫ్ డిజైనర్ ప్రతాప్ బోస్ ఈ ఈవెంట్ కు నాయకత్వం వహించనున్నాడు.

ఇక రాబోవు SUV లు కూప్-లైక్ డిజైన్ లాంగ్వేజ్ తో కనిపించబోతున్నాయి. బీఎండబ్ల్యూ ఎక్స్4ఎస్, ఎక్స్6ఎస్ ల మాదిరిగా, మహింద్ర ఈవీ లు కూడా వాలుగా ఉండే రూఫ్ లైన్, హైలీ రేక్డ్ రియర్ విండ్ స్క్రీన్, హై గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉండనున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఐదు కార్లలో, ఒక కారు చూడటానికి మహింద్ర ఫ్లాగ్ షిప్ ఎస్యూవీ అయిన మహింద్ర XUV700 మాదిరిగా కనిపిస్తోంది.

ప్రస్తుతం టీజ్ కాబడిన కార్ల యొక్క కాన్సెప్ట్ వివరాలు ఇంకా స్పష్టంగా తెలియదు. మనకు తెలుస్తోన్న, కనిపించే ఒకే ఒక్కటి ఏంటంటే, అది కార్ల యొక్క ప్రొఫైల్ (ఔట్ లైన్) మాత్రమే. గతంలో లీకైన వివరాలు నిజమైతే కనుక, ఈ కార్ల యొక్క ముందు భాగం సీ ఆకృతిలో ఉండే ర్యాప్ అరౌండ్ డీఆర్ఎల్స్ బానెట్ మరియు ఫ్రంట్ బంపర్స్ కి ఇరువైపులా కనిపించనున్నాయి. మరో విషయం ఏంటంటే, ఆగస్టు 15 న విడుదల అయ్యే ఈవీ లు కేవలం కాన్సెప్ట్ ప్రోటో టైప్స్ అయ్యే అవకాశం కూడా ఉందని అంచనా.

రెవా ఎలక్ట్రిక్ కార్, ఈ20, ఈ20 ప్లస్, ఈవెరిటో వంటి కార్లతో భారత ఈవీ మార్కెట్లో అడుగు పెట్టిన తొట్టతొలి బ్రాండ్ మహింద్ర కావడం విశేషం. అయితే గత కొన్నేళ్ళుగా మహింద్ర ఒక్క ఎలక్ట్రిక్ వెహికిల్ ను కూడా లాంచ్ చేయలేదు. మహింద్ర XUV300 యొక్క ఎలక్ట్రిక్ వర్షన్ ని కూడా మహింద్ర లాంచ్ చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. దాని పేరు మహింద్ర XUV400 అని పెట్టనున్నారని వినికిడి. ఏదేమైనా లాంచ్ రోజునే అన్ని విషయాలపై స్పష్టత రానుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

The post MAHINDRA నుంచి రానున్న 5 కొత్త ఎలక్ట్రిక్ కార్లు, ఆగస్టు 15 న లాంచ్ ఈవెంట్ first appeared on 91Mobiles Telugu.

]]>