Matter Energy - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 22 Nov 2022 13:30:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 గేర్ బాక్స్ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చిన Matter Energy సంస్థ https://www.91mobiles.com/telugu/matter-energy-introduces-first-e-bike-with-gearbox-india/ Tue, 22 Nov 2022 13:30:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=3590 హైలైట్స్ లిక్విడ్ కూల్ బ్యాటరీ, గేర్ బాక్స్, ఏబీఎస్ తో వస్తోన్న Matter Energy ఎలక్ట్రిక్ బైక్ కీ-లెస్ ఆపరేషన్, 7.0-ఇంచ్ టచ్ ఎల్సీడీ డిస్ప్లే ఫీచర్స్ ని కలిగి ఉన్న Matter Energy ఈ-బైక్ మూడు వేరియంట్లలో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ బైక్. 2023 ఏప్రిల్ నుంచి మొదలుకానున్న అమ్మకాలు Matter Energy సంస్థ భారత్ లో తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేసింది. గేర్ బాక్స్ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్ […]

The post గేర్ బాక్స్ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చిన Matter Energy సంస్థ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • లిక్విడ్ కూల్ బ్యాటరీ, గేర్ బాక్స్, ఏబీఎస్ తో వస్తోన్న Matter Energy ఎలక్ట్రిక్ బైక్
  • కీ-లెస్ ఆపరేషన్, 7.0-ఇంచ్ టచ్ ఎల్సీడీ డిస్ప్లే ఫీచర్స్ ని కలిగి ఉన్న Matter Energy ఈ-బైక్
  • మూడు వేరియంట్లలో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ బైక్. 2023 ఏప్రిల్ నుంచి మొదలుకానున్న అమ్మకాలు

Matter Energy సంస్థ భారత్ లో తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేసింది. గేర్ బాక్స్ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కావడం విశేషం. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో కంపెనీ 4 స్పీడ్ గేర్ బాక్స్ ని ప్రొవైడ్ చేసింది. అంతేకాదు, ఏబీఎస్ కూడా ఇచ్చారు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 5.0 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఈ బండి సింగిల్ చార్జ్ పై 125 కి.మీ నుంచి 150 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. ఇక్కడ మీకోసం Matter Energy ఎలక్ట్రిక్ బైక్ కి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తున్నాం. ఓ కన్నేయండి మరి.

Matter Energy బైక్ యొక్క బ్యాటరీ, మోటర్, పవర్‌ట్రెయిన్ వివరాలు

Matter Energy లో ఐపీ67 రేటింగ్ తో కూడిన లిక్విల్ కూల్డ్, 5.0 కిలోవాట్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని 5ఏ హౌజ్‌హెల్డ్ సాకెట్ ద్వారా చార్జింగ్ చేయవచ్చు. 5 గంటల్లో ఈ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయవచ్చు. ఈ బండిలో 10.5 కిలోవాట్ మోటర్ ని అమర్చారు. ఇది వెనుక వీల్ లో 520ఎన్ఎం టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లో 3 డ్రైవింగ్ మోడ్స్ ఇవ్వడం జరిగింది. సంప్రదాయ 4-స్పీడ్ గేర్ బాక్స్ కలిగిన తొలి భారతీయ ఎలక్ట్రిక్ బైక్ ఇదే. అలాగే ఈ బైక్ లో డ్యూయల్ చానల్ ఏబీఎస్ కూడా అందించడం విశేషం.

Matter Energy ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్స్

Matter Energy బైక్ ఫీచర్లు నిండిన బండి. ఈ బైక్ లో 7-ఇంచ్ ఎల్సీడీ టచ్ డిస్ప్లే అందించారు. ఇందులో నేవిగేషన్ కూడా ఉంటుంది. నోటిఫికేషన్ అలర్ట్స్, మ్యూజిక్ ప్లే బ్యాక్, కంట్రోల్ బటన్స్, హ్యాండిల్ బార్ మౌంటెడ్ స్విచ్‌గేర్ వంటి ఫీచర్లను ఈ బైక్ లో అందించారు. వీటితో పాటు, ఈ ఎలక్ట్రిక్ బైక్ కి కంపెనీ నుంచి టైమ్ టు టైమ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ కూడా వస్తాయి.

Matter Energy ఈ-బైక్ లో కీ-లెస్ (తాళం అవసరంలేని) ఆపరేషన్ ఫీచర్ ఉంది. ఈ బైక్ లో ఆన్‌బోర్డ్ చార్జర్ మరియు 5-లీటర్ గ్లవ్‌బాక్స్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ ని యాప్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వొచ్చు. యూజర్స్ థెఫ్ట్ డిటెక్షన్, చార్జింగ్ పర్సెంటేజీ, రైడ్ స్టాట్స్ ని యాప్ లో అందించారు. బైక్ లో పార్కింగ్ అసిస్ట్ కూడా ఇవ్వబడింది.

Matter Energy ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ మరియు వేరియంట్స్

డిజైన్ గురించి మాట్లాడుకుంటే, Matter Energy ఎలక్ట్రిక్ బండి నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ లుక్ తో వచ్చింది. ఎల్ఈడీ లైట్స్, ఆటో క్యాన్సెలింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి. స్ప్లిట్ సీట్ ఇవ్వబడింది. గ్రే-నియాన్, బ్లూ-గోల్డ్, బ్లాక్-గోల్డ్ మరియు రెడ్/బ్లాక్/వైట్ కలర్ ఆప్షన్స్ లో ఈ బైక్ లభిస్తుంది.

Matter Energy ఎలక్ట్రిక్ బైక్ ఇండియా లాంచ్ మరియు ధర

Matter Energy ఎలక్ట్రిక్ బైక్ యొక్క బుకింగ్స్ 2023 తొలి త్రైమాసికంలో మొదలవుతాయని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతమైతే కంపెనీ ఈ బండి ధరను ప్రకటించలేదు. 2023 ఏప్రిల్ నుంచి మ్యాటర్ ఈ-బైక్ డెలివరీస్ మొదలవ్వనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క మూడు వేరియంట్లు ఆటో ఎక్స్‌పో లో లాంచ్ కానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గేర్ బాక్స్ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చిన Matter Energy సంస్థ first appeared on 91Mobiles Telugu.

]]>