MediaTek Dimensity 920 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 28 Nov 2022 09:37:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Dimensity 920 చిప్సెట్ తో వస్తోన్న Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/realme-10-pro-plus-global-variant-mediatek-dimensity-920-processor-unboxing-video/ Mon, 28 Nov 2022 09:37:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=3703 హైలైట్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో వస్తోన్న Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్స్ తో వస్తోన్న ఇండియా వేరియంట్స్, ఈ విషయాన్ని ఇదివరకే కన్ఫర్మ్ చేసిన రియల్మీ ఇండియా డిసెంబర్ 8 న భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతోన్న Realme 10 Pro+ Realme 10 Pro 5G ఈ నెల ఆరంభంలో చైనాలో లాంచ్ అయ్యింది. Realme 10 Pro సిరీస్ […]

The post MediaTek Dimensity 920 చిప్సెట్ తో వస్తోన్న Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో వస్తోన్న Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్స్ తో వస్తోన్న ఇండియా వేరియంట్స్, ఈ విషయాన్ని ఇదివరకే కన్ఫర్మ్ చేసిన రియల్మీ ఇండియా
  • డిసెంబర్ 8 న భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతోన్న Realme 10 Pro+

Realme 10 Pro 5G ఈ నెల ఆరంభంలో చైనాలో లాంచ్ అయ్యింది. Realme 10 Pro సిరీస్ లో రెండు డివైజెస్ ఉన్నాయి. అవి: Realme 10 Pro, Realme 10 Pro+. డిసెంబర్ 8 న Realme 10 Pro+ భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి ముందు Realme 10 Pro+ యొక్క గ్లోబల్ వేరియంట్ యూనిట్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. అన్‌బాక్సింగ్ ఇమేజెస్ ద్వారా Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

చైనాలో లాంచ్ అయిన Realme 10 Pro+ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఇక్కడ Realme 10 Pro+ యొక్క గ్లోబల్ వేరియంట్ అన్‌బాక్సింగ్ వీడియోని అందిస్తున్నాం ఓసారి చూసేయండి.

Realme 10 Pro+ లో హైలైట్ పాయింట్ ఏంటంటే అది కర్వ్డ్ డిస్ప్లే. రియల్మీ కంపెనీ తన నంబర్ సిరీస్ లో తొలిసారిగా కర్వ్డ్ డిస్ప్లేని వాడుతోంది. గ్లోబల్ వేరియంట్స్ లో కూడా కర్వ్డ్ డిస్ప్లే ని అందిస్తోంది. అయితే Realme 10 Pro+ యొక్క గ్లోబల్ వేరియంట్స్ లో డైమెన్సిటీ 1080 కి బదులుగా, డైమెన్సిటీ 920 చిప్సెట్ ఉపయోగించారు.

అయితే Realme 10 Pro+ ఇండియా వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తోనే వస్తుంది. ఈ విషయాన్ని రియల్మీ కంపెనీ ఇదివరకే స్పష్టం చేసింది. డైమెన్సిటీ 920 తో పోల్చితే డైమెన్సిటీ 1080 కాస్త మెరుగ్గా పెర్ఫామ్ చేస్తుంది. అంతేగానీ మరీ పెద్దగా తేడా ఏమీ ఉండదు.

Realme 10 Pro+ స్పెసిఫికేషన్స్

Realme 10 Pro+ 6.7-ఇంచ్ 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే తో వస్తోంది. ఇది ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. డిస్ప్లే ప్యానెల్ 800 నిట్స్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. పంచ్ హోల్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో పాటు 2.3 ఎంఎం చిన్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Realme 10 Pro+ చైనీస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ68 జీపీయూ వాడారు. డైమెన్సిటీ 1080 చిప్సెట్ టీఎస్ఎంసీ యొక్క 6ఎన్ఎం ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ పై తయారైంది. Realme 10 Pro+ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 10 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 సెన్సర్, 8ఎంపి సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అమర్చారు.

Realme 10 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ ని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 7.95 ఎంఎం మందం ఉంటుంది. అయితే ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉండదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Dimensity 920 చిప్సెట్ తో వస్తోన్న Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>