MG 4 EV - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 13 Dec 2022 13:36:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 452km రేంజ్ తో వస్తోన్న MG 4 EV; Auto Expo 2023 ఈవెంట్ లో ప్రదర్శనకు రెడీ! https://www.91mobiles.com/telugu/mg-4-ev-india-launch-auto-expo-2023/ Tue, 13 Dec 2022 13:36:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=3969 హైలైట్స్ త్వరలో భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ MG 4 EV ఇప్పటికే ఐరోపా మార్కెట్స్ లో ప్రభంజనం సృష్టించిన MG 4 EV ఎలక్ట్రిక్ వెహికిల్ సింగిల్ చార్జ్ పై 452 కిలోమీటర్లు దూసుకెళ్ళే MG 4 EV MG Motor India త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అందుతోన్న సమాచారం కనుక నిజమైతే, MG 4 EV బ్యాటరీ హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే భారతగడ్డపై లాంచ్ కానుంది. […]

The post 452km రేంజ్ తో వస్తోన్న MG 4 EV; Auto Expo 2023 ఈవెంట్ లో ప్రదర్శనకు రెడీ! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ MG 4 EV
  • ఇప్పటికే ఐరోపా మార్కెట్స్ లో ప్రభంజనం సృష్టించిన MG 4 EV ఎలక్ట్రిక్ వెహికిల్
  • సింగిల్ చార్జ్ పై 452 కిలోమీటర్లు దూసుకెళ్ళే MG 4 EV

MG Motor India త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అందుతోన్న సమాచారం కనుక నిజమైతే, MG 4 EV బ్యాటరీ హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే భారతగడ్డపై లాంచ్ కానుంది. జనవరి 13 నుంచి జరిగే ఆటో ఎక్స్‌పో లో MG 4 EV ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఈ ఆటో ఈవెంట్ లో ఎంజీ నుంచి రాబోవు MG Air City EV కి గ్లిమ్స్ కూడా మనం చూసే అవకాశం ఉంది. ఈ ప్రదర్శన అనంతరం ఈ రెండు బ్యాటరీ కార్లు భారత్ లో లాంచ్ అవుతాయి.

MG 4 EV తో పాటు ప్రదర్శింపబడనున్న కార్లు

ఆటోకార్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం MG 4 EV తో పాటు ఆటో ఎక్స్‌పో 2023 లో MG Air City EV మరియు MG Hector SUV (రిఫ్రెష్డ్ వర్షన్) కూడా ప్రదర్శితం కానున్నాయి. ఎంజీ కార్ల ఔత్సాహికులు ఈ Auto Expo 2023 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చైనాకు చెందిన MG Motors భారత్ లో ఇప్పటికే పలు సంప్రదాయ కార్లను అమ్ముతోంది. తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లోకి అడుగు పెట్టాలని భావిస్తోంది.

MG 4 EV ఫీచర్స్

MG 4 EV ఇప్పటికే యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ అవ్వడమే గాక, అక్కడ Vokswagen ID.3, Kia Niro వాహనాలకు గట్టి పోటీనిస్తోంది. ఇక MG 4 EV విషయానికి వస్తే, ఈ కారు 4,284 మీటర్ల పొడవు ఉంటుంది. MG 4 EV వాహనం ఎస్ఏఐసీ యొక్క మాడ్యులర్ స్కేలబుల్ ప్లాట్ఫామ్ పై వచ్చింది.

MG 4 EV ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 51 కిలోవాట్ అవర్ మరియు 64 కిలోవాట్ అవర్ యూనిట్స్. 51 కిలోవాట్ అవర్ బ్యాటరీ 170 బీహెచ్పీ పవర్, 64 కిలోవాట్ అవర్ బ్యాటరీ 203 బీహెచ్పీ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు సింగిల్ మోటర్ రియర్ వీల్ డ్రైవ్ సెటప్ తో వస్తోంది. 150 కిలోవాట్ ఫాస్ట్ చార్జింగ్, 7కిలోవాట్ చార్జర్ తో ఈ కారు వస్తోంది. 64 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో MG 4 EV కారు సింగిల్ చార్జ్ పై 452 కిలోమీటర్ల దూరం వెళ్తుంది.

MG 4 EV కారు 10.25-ఇంచ్ సెంట్రల్ ఇన్ఫోటెయిన్మెంట్ డిస్ప్లే, 7-ఇంచ్ ఎంఐడీ, రొటరీ గేర్ సెలెక్టర్, వైర్లెస్ చార్జింగ్ ప్యాడ్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు ఏడీఏఎస్ సూట్ తో వస్తోంది. కారు బయట విషయానికి వస్తే, MG 4 EV లో ఎల్ఈడీ లైటింగ్, భారీ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, స్పోర్టీ రూఫ్‌లైన్ మరియు బాడీ క్లాడింగ్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 452km రేంజ్ తో వస్తోన్న MG 4 EV; Auto Expo 2023 ఈవెంట్ లో ప్రదర్శనకు రెడీ! first appeared on 91Mobiles Telugu.

]]>