Micromax - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 22 Sep 2023 08:08:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.15,000 ధరతో మిడ్-రేంజ్ ఫోన్ లాంచ్ చేయనున్న Micromax https://www.91mobiles.com/telugu/micromax-mid-range-phone-15-thousand-budget-might-launch-soon/ Fri, 22 Sep 2023 05:29:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=8117 భారతీయ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్‌కు సంబంధించిన బిగ్ న్యూస్ వచ్చేసింది. ఈ స్వదేశీ బ్రాండ్ త్వరలో భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. మైక్రోమ్యాక్స్ చాలా కాలంగా ఎలాంటి మొబైల్ ఫోన్‌ను విడుదల చేయకపోవడం గమనార్హం. కొత్తగా లీకైన నివేదికలో, కంపెనీ తన కొత్త మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో భారతీయ మార్కెట్‌లో విడుదల చేయవచ్చని పేర్కొంది. టెక్ వెబ్‌సైట్ ది మొబైల్ ఇండియన్ తన నివేదికలో.. చాలా కాలంగా […]

The post రూ.15,000 ధరతో మిడ్-రేంజ్ ఫోన్ లాంచ్ చేయనున్న Micromax first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త ఫోన్ లాంచ్ చేయనున్న మైక్రోమ్యాక్స్
  • చాలా రోజులుగా ఫోన్ లాంచ్ చేయని కంపెనీ
  • అక్టోబర్ లేదా నవంబర్ లో ఫోన్ విడుదలయ్యే అవకాశం

భారతీయ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్‌కు సంబంధించిన బిగ్ న్యూస్ వచ్చేసింది. ఈ స్వదేశీ బ్రాండ్ త్వరలో భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. మైక్రోమ్యాక్స్ చాలా కాలంగా ఎలాంటి మొబైల్ ఫోన్‌ను విడుదల చేయకపోవడం గమనార్హం. కొత్తగా లీకైన నివేదికలో, కంపెనీ తన కొత్త మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో భారతీయ మార్కెట్‌లో విడుదల చేయవచ్చని పేర్కొంది.

టెక్ వెబ్‌సైట్ ది మొబైల్ ఇండియన్ తన నివేదికలో.. చాలా కాలంగా మౌనంగా ఉన్న తరువాత, స్థానిక మొబైల్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ మరోసారి పునరాగమనం చేయబోతున్నట్లు పేర్కొంది. నివేదికలో కంపెనీ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ పేరు లేదా బ్రాండ్ యొక్క ఏదైనా ప్రత్యేక ప్లాన్ గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే రాబోయే మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ రూ. 15,000 బడ్జెట్‌లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Micromax స్మార్ట్‌ఫోన్ వివరాలు

లీకైన నివేదిక ప్రకారం, కంపెనీ తన కొత్త ఫోన్‌ను మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు రూ. 15,000 గా ఉంటుందట. అందిన సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek ప్రాసెసర్‌ తో వస్తోంది. అయితే కచ్చితమైన చిప్ పేరు ఇంకా తెలియదు. రాబోయే డివైజ్ మైక్రోమ్యాక్స్ IN సిరీస్‌కి జతచేరుతుందని అంచనా వేస్తున్నారు.

చైనీస్ బ్రాండ్స్ కి పెరగనున్న పోటీ

కరోనా కాలంలో చైనీస్ బ్రాండ్‌ల బహిష్కరణ సమయంలో తిరిగి మార్కెట్ లోకి రావాలని మైక్రోమ్యాక్స్ నిర్ణయించుకుంది. ఆ క్రమంలో కంపెనీ కొన్ని మొబైల్‌లను కూడా విడుదల చేసింది, వాటికి మిశ్రమ స్పందన లభించింది. అయితే గత సంవత్సరం 2022 జూలైలో Micromax In 2C లాంచ్ అయిన తర్వాత, ఈ కంపెనీ మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఒక సంవత్సరం పాటు భారతదేశంలో కొత్త మైక్రోమ్యాక్స్ ఫోన్ ఏదీ విడుదల కాలేదు. ఈసారి మళ్లీ విదేశీ బ్రాండ్లకు పోటీగా కంపెనీ తన కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. మైక్రోమ్యాక్స్ కి ఈసారి సక్సెస్ రావాలలని ఆశిద్దాం.

The post రూ.15,000 ధరతో మిడ్-రేంజ్ ఫోన్ లాంచ్ చేయనున్న Micromax first appeared on 91Mobiles Telugu.

]]>