Mobile Phone News - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 01 Feb 2024 10:01:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ https://www.91mobiles.com/telugu/vivo-y200-5g-256gb-variant-launched-india/ Thu, 01 Feb 2024 10:00:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=10026 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది Vivo Y200 5G ని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ చేసింది. నేడు Vivo Y200 5G 256GB వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో రావడం వల్లన యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. సరే, ఓసారి Vivo Y200 5G 256GB వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం […]

The post Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Vivo Y200 5G 256GB
  • Vivo Y200 5G 256GB ధర రూ.23,999
  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది Vivo Y200 5G ని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ చేసింది. నేడు Vivo Y200 5G 256GB వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో రావడం వల్లన యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. సరే, ఓసారి Vivo Y200 5G 256GB వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y200 5G 256GB ధర

  • Vivo Y200 5G 256GB స్టోరేజీ వేరియంట్ భారత్ లో రూ.23,999 ధరతో లాంచ్ చేశారు.
  • Vivo Y200 5G 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది.
  • Vivo Y200 5G కొనుగోలుపై ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్‌ఇండ్, డీబీఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ యూజర్లకు రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • Vivo Y200 5G డివైజ్ డెజర్ట్ గోల్డ్ మరియు జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>