money earning apps - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 23 May 2023 17:57:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బు సంపాదించండి; అందుకోసం ఏయే యాప్స్ ఉన్నాయో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/money-earning-online-games-apps/ Tue, 23 May 2023 17:57:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=6456 మనం తరచూ మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాం. అయితే మీ మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ డబ్బు కూడా సంపాదించవచ్చని తెలుసా? మీరు గనుక ఫోన్ లో గేమ్స్ ఆడుతూ డబ్బు సంపాదించాలని ఆలోచిస్తుంటే, ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ ఆర్టికల్ లో, మీకోసం డబ్బు ఆర్జించేందుకు ఉపయోగపడే యాప్స్ వివరాలను అందిస్తున్నాం. వీటి ద్వారా మీరు ఆన్‌లైన్ లో గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చు. డబ్బు సంపాదించేందుకు పనికొచ్చే యాప్స్ […]

The post ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బు సంపాదించండి; అందుకోసం ఏయే యాప్స్ ఉన్నాయో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

మనం తరచూ మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాం. అయితే మీ మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ డబ్బు కూడా సంపాదించవచ్చని తెలుసా? మీరు గనుక ఫోన్ లో గేమ్స్ ఆడుతూ డబ్బు సంపాదించాలని ఆలోచిస్తుంటే, ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ ఆర్టికల్ లో, మీకోసం డబ్బు ఆర్జించేందుకు ఉపయోగపడే యాప్స్ వివరాలను అందిస్తున్నాం. వీటి ద్వారా మీరు ఆన్‌లైన్ లో గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చు.

డబ్బు సంపాదించేందుకు పనికొచ్చే యాప్స్

  • మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)
  • పేటీఎమ్ ఫస్ట్ గేమ్స్
  • వింజో
  • ఏఐఓ గేమ్స్
  • డ్రీమ్ 11

MPL (మొబైల్ ప్రీమియర్ లీగ్)

  • ఎమ్‌పీఎల్ గురించి మీరు వినే ఉంటారు. దీన్ని మొబైల్ ప్రీమియమ్ లీగ్ అని అంటారు.
  • 100 మిలియన్ కి పైగా యూజర్లు ఈ యాప్ ని వాడుతున్నారు.
  • ఈ యాప్ పై యూజర్లు గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చు.
  • ఫాంటసీ క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ తో పాటు ఇంకా రమ్మీ, పోకర్, కాల్ బ్రేక్ అండ్ లుడో, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, క్యారమ్ అండ్ చెస్ వంటి గేమ్స్ ఆడవచ్చు.
  • యాప్ లోకి సైన్ ఇన్ అయ్యాక, యూజర్లకు రూ.100 బోనస్ లభిస్తుంది.
  • ఎంపీఎల్ యాప్ పై సమయానుగుణంగా ఎన్నో టోర్నమెంట్లు కూడా నిర్వహించబడతాయి. వీటి ద్వారా యూజర్లు డబ్బును సంపాదించవచ్చు.

Paytm First Games

  • పేటీఎమ్ గురించి మీరు వినే ఉంటారు.
  • పేటీఎమ్ యొక్క పేటీఎమ్ ఫస్ట్ గేమ్స్ యాప్ కూడా ఎంపీఎల్ యాప్ లాంటిదే.
  • ఈ యాప్ లో కూడా యూజర్లు లూడో, రమ్మీ, పోకర్, కాల్ బ్రేక్ వంటి ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చు.
  • అలాగే పేటీఎమ్ ఫస్ట్ గేమ్స్ నిర్వహించే టోర్నమెంట్లలో పాల్గొని ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
  • మీరు గెలుచుకున్న డబ్బు మీ పేటీఎమ్ అకౌంట్ కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

Winzo

  • ఎంపీఎల్, పేటీఎమ్ ఫస్ట్ గేమ్స్ మాదిరే వింజో కూడా ఒక ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్.
  • ఈ యాప్ లో యూజర్లు సమురయ్, లూడో, క్యారమ్, మెట్రో సర్ఫర్ మరియు ఇతర ఫ్యాంటసీ గేమ్స్ ని ఆన్‌లైన్ లో ఆడవచ్చు.
  • ఈ గేమింగ్ ప్లాట్ఫామ్ కి సైన్ అప్ అయ్యినందుకు యూజర్లకు ఇన్‌స్టంట్ పేటీఎమ్ క్యాష్ లభిస్తుంది.
  • వింజో వెబ్ సైట్ ద్వారా గేమ్స్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ పై ఎన్నో గేమ్స్ ని ఆడి డబ్బుని గెలుచుకోవచ్చు.

AIO Games

  • ఏఐఓ గేమ్స్ యాప్ ద్వారా యూజర్లు ఆన్‌లైన్ లో లూడో, క్యారమ్, ఫ్యాంటసీ గేమ్స్, బాటిల్ షూట్, రమ్మీ మరియు పోకర్ వంటి గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చు.
  • ఏఐఓ గేమ్స్ ని ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ప్రతీరోజు ఈ యాప్ ద్వారా రూ.500 వరకు గెలుచుకోవచ్చు.
  • ఈ గేమింగ్ ప్లాట్ఫామ్ పై యూజర్లు కార్డ్ గేమ్స్, ఫ్యాంటసీ గేమ్స్ మరియు మరెన్నో ఆన్‌లైన్ గేమ్స్ ఆడవచ్చు.

Dream 11

  • డ్రీమ్ 11 కూడా ఎంతో ప్రజాదరణ పొందిన ఫ్యాంటసీ గేమింగ్ యాప్.
  • ఈ యాప్ 2008 లో లాంచ్ అయ్యింది.
  • ఈ యాప్ ద్వారా యూజర్లు ఫ్యాంటసీ క్రికెట్, ఫుట్ బాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్ వంటి గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చు.
  • ఈ గేమ్స్ ఆడి యూజర్లు కోట్లలో సంపాదించినట్లు తరచూ మీరు వార్తలు చదివే ఉంటారు.

The post ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బు సంపాదించండి; అందుకోసం ఏయే యాప్స్ ఉన్నాయో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>