Moto E22 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Sep 2022 14:16:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయిన Moto E22, Moto E22i https://www.91mobiles.com/telugu/moto-e22-e22i-devices-launched-globally-price-specs/ Fri, 16 Sep 2022 14:16:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=2396 హైలైట్స్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయిన లో-బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ Moto E22, Moto E22i ధర తక్కువైనా స్టైలిష్ గా కనిపిస్తోన్న డివైజెస్ త్వరలోనే భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Moto E22, Moto E22i ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా నేడు ఈ-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసింది. Moto E22, Moto E22i డివైజెస్ గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. తక్కువ ధర శ్రేణికి చెందిన ఈ […]

The post గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయిన Moto E22, Moto E22i first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయిన లో-బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ Moto E22, Moto E22i
  • ధర తక్కువైనా స్టైలిష్ గా కనిపిస్తోన్న డివైజెస్
  • త్వరలోనే భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Moto E22, Moto E22i

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా నేడు ఈ-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసింది. Moto E22, Moto E22i డివైజెస్ గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. తక్కువ ధర శ్రేణికి చెందిన ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మంచి డిజైన్ ని కలిగి ఉన్నాయి. త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Moto E22, Moto E22i డివైజెస్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto E22, Moto E22i ఫోన్ల ధరలు

Moto E22, Moto E22i ఫోన్లు సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యాయి. Moto E22 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 139.99 యూరోలు (దాదాపు రూ.11,200) గా ఉంది. Moto E22i ధర 129.99 యూరోలు (దాదాపు రూ.10,300) గా నిర్ణయించారు. భారత్ లో లాంచ్ అయ్యాక వీటి ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉంది.

Moto E22, Moto E22i స్పెసిఫికేషన్స్

Moto E22, Moto E22i డివైజెస్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే కలిగి ఉన్నాయి. రెండు ఫోన్లు 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తున్నాయి. వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్ ని ఈ ఫోన్స్ కలిగి ఉన్నాయి. రెండు ఫోన్స్ కూడా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తాయి. Moto E22, Moto E22i ఫోన్లు 163.95 మిల్లీ మీటర్ల పొడవు, 74.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.99 మిల్లీ మీటర్ల మందం, 172 గ్రాముల బరువు ఉన్నాయి.

Moto E22 ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Moto E22i ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై పని చేస్తుంది. రెండు స్మార్ట్ ఫోన్స్ మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ కలిగి ఉన్నాయి.

Moto E22, Moto E22i డివైజెస్ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. వీటిలో 16ఎంపి ప్రైమరీ సెన్సర్, ఫ్లాష్ లైట్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వీటిలో ముందు వైపున 5ఎంపి కెమెరా అందించారు.

Moto E22, Moto E22i ఫోన్స్ డ్యూయల్ సిమ్ 4జీ సపోర్ట్ కలిగి ఉన్నాయి. వీటిలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఉన్నాయి. మోటో ఈ22 క్రిస్టల్ బ్లూ, ఆస్ట్రో బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. మోటో ఈ22ఐ వింటర్ వైట్, గ్రాఫైట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో దొరుకుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయిన Moto E22, Moto E22i first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 16 న లాంచ్ కానున్న Moto E22: ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/moto-e22-launch-timeline-price-specs-renders/ Wed, 14 Sep 2022 13:04:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=2336 హైలైట్స్: మోటోరోలా నుంచి వస్తోన్న మరో బడ్జెట్ ఫోన్ Moto E22 ఈ వారంలో గ్లోబల్ గా లాంచ్ కానున్న Moto E22 Moto E22 మల్టీపుల్ కలర్ ఆప్షన్స్ తో వస్తుందని తెలియజేస్తున్న రెండర్స్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Motorola నిన్నే Moto Edge 30 Ultra, Moto Edge 30 Fusion ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ Moto E22, Moto E22i అనే రెండు బడ్జెట్ […]

The post సెప్టెంబర్ 16 న లాంచ్ కానున్న Moto E22: ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • మోటోరోలా నుంచి వస్తోన్న మరో బడ్జెట్ ఫోన్ Moto E22
  • ఈ వారంలో గ్లోబల్ గా లాంచ్ కానున్న Moto E22
  • Moto E22 మల్టీపుల్ కలర్ ఆప్షన్స్ తో వస్తుందని తెలియజేస్తున్న రెండర్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Motorola నిన్నే Moto Edge 30 Ultra, Moto Edge 30 Fusion ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ Moto E22, Moto E22i అనే రెండు బడ్జెట్ ఫోన్లను తీసుకొస్తున్నట్లు సమాచారం.

ప్రైస్ బాబా ప్రచురించిన కథనంలో, Moto E22 సెప్టెంబర్ 16 న లాంచ్ కానుందని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని చెప్పినట్లు పేర్కొనబడింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉండే అవకాశముంది. ఇదే కాకుండా, గుగ్లాని Moto E22 యొక్క రెండర్ ఇమేజెస్ ని కూడా షేర్ చేశాడు. Moto E22 మూడు రంగుల్లో లభ్యం కానుందని ఈ ఇమేజెస్ ద్వారా స్పష్టమైంది. ఆ రంగులు: షేడ్ ఆఫ్ లైట్ బ్లూ, షేడ్ ఆఫ్ నేవీ. ఇంతకు ముందు 91మొబైల్స్ హిందీ షేర్ చేసిన Moto E22 ఇమేజెస్ ఫోన్ ని గ్రే కలర్ లో చూపించాయి.

రెండర్స్ ని బట్టి ఫోన్ గ్లాస్ (Gloss) బ్యాక్ ప్యానెల్, డ్యూయల్ రియర్ కెమెరా ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ప్యానెల్ బాటమ్ లో మోటోరోలా బ్రాండింగ్, మధ్యలో లోగో కనిపిస్తున్నాయి. రెండర్స్ ద్వారా ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్, వాటర్ డ్రాప్ నాచ్, మందపాటి చిన్ కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది.

Moto E22 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Moto E22 బడ్జెట్ ధరలో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఫోన్ గురించి ఎక్కువ సమాచారం తెలియలేదు. అయితే ఈ ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండనుందని తెలుస్తోంది. Moto E22 లో మీడియాటెక్ హీలియో చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశముందని గతంలో వచ్చిన రూమర్ల ద్వారా తెలుస్తోంది. Moto E22 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వచ్చే చాన్సెస్ ఉన్నాయి. Moto E22 లో 3.5ఎంఎం ఆడియో జ్యాక్ ఉండనుంది. అలాగే డాల్బి అట్మాస్ కూడా ఉంటుందని సమాచారం.

మంగళవారం నాడు మోటోరోలా తన ఫ్లాగ్షిప్ ఫోన్స్ Moto Edge 30 Ultra, Moto Edge 30 Fusion లను భారత్ లో లాంచ్ చేసింది. Moto Edge 30 Ultra ప్రపంచపు తొలి 200ఎంపి ఫోన్ గా పరిగణించబడుతోంది. ఇక Moto Edge 30 Fusion క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి యూజర్లను ఆకర్షిస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ రెండు ఫోన్లను డిస్కౌంట్ ధరలో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మోటోరోలా ఈ డివైజెస్ పై ఇంట్రడక్టరీ ప్రైస్ ని ఆఫర్ చేస్తోంది. కాబట్టి, ఆసక్తి గల వారు త్వరగా ఈ ఫోన్లను కొనుక్కుంటే మంచిది. లేదంటే, మళ్ళీ ధరలు పెరిగే అవకాశముంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post సెప్టెంబర్ 16 న లాంచ్ కానున్న Moto E22: ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>