Moto Edge 40 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Oct 2022 10:54:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో రానున్న Moto X40 https://www.91mobiles.com/telugu/moto-x40-snapdragon-8-gen-2-chip-launch-soon/ Thu, 27 Oct 2022 10:54:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=3097 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Moto X40, టీజ్ చేసిన కంపెనీ ఎగ్జిక్యూటివ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్న Moto X40 స్మార్ట్ ఫోన్ Moto X30 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోన్న Moto X40 సిరీస్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా, ఎడ్జ్ 30 సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేసింది. భారత్ లో మోటో ఎడ్జ్ 30, ఎడ్జ్ 30 ఫ్యూజన్, ఎడ్జ్ 30 […]

The post Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో రానున్న Moto X40 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Moto X40, టీజ్ చేసిన కంపెనీ ఎగ్జిక్యూటివ్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్న Moto X40 స్మార్ట్ ఫోన్
  • Moto X30 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోన్న Moto X40 సిరీస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా, ఎడ్జ్ 30 సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేసింది. భారత్ లో మోటో ఎడ్జ్ 30, ఎడ్జ్ 30 ఫ్యూజన్, ఎడ్జ్ 30 ప్రో, ఎడ్జ్ 30 అల్ట్రా మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఇక తక్కువ ధరలో ఎడ్జ్ 30 నియో అనే ఫోన్ కూడా లాంచ్ అయ్యింది. అయితే ఈ ఫోన్ ప్రస్తుతం భారత్ లో అందుబాటులో లేదు. మోటోరోలా తన యొక్క ఎడ్జ్ సిరీస్ ఫోన్లను చైనాలో ఎక్స్-సిరీస్ గా లాంచ్ చేస్తుంది. ఇక మోటోరోలా నుంచి రాబోవు ఎక్స్-సిరీస్ ఫోన్ Moto X40 త్వరలోనే ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఈ ఏడాది చైనాలో మోటోరోలా తన ప్రీమియమ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ని లాంచ్ చేయాలని ఫిక్స్ అయ్యింది. లెనోవో చైనా మొబైల్ జనరల్ మేనేజర్ చెన్ జిన్ తాజాగా Moto X40 యొక్క లాంచ్ ని టీజ్ చేశారు. దీంతో అతి త్వరలో Moto X40 ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమైంది.

Moto X40 లాంచ్ ని టీజ్ చేసిన చెన్ జిన్

త్వరలోనే చైనా మార్కెట్ లో Moto X40 లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో Moto Edge 40 Pro అనే పేరుతో లాంచ్ అవ్వనుంది. Lenovo కి చెందిన చెన్ జిన్ Moto X40 లాంచ్ గురించి టీజ్ చేస్తూ,ఫోన్ పై యూజర్ల అంచనాలు ఏంటని అడిగారు. దీంతో త్వరలో Moto X40 లాంచ్ ఉంటుందని స్పష్టమైంది.

మోటోరోలా నుంచి రాబోవు ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ తేదీని చెన్ జిన్ వెల్లడించలేదు. అయితే Moto X40 నవంబర్ నెలలో ఎంట్రీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. క్వాల్కమ్ తన ఫ్లాగ్షిప్ చిప్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ని నవంబర్ నెలలోనే లాంచ్ చేయనుంది. ఈ చిప్ లాంచ్ తర్వాత Moto X40 లాంచ్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 3.36 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. ఈసారి ఈ ప్రాసెసర్ విభిన్నమైన క్లస్టర్ సెటప్ తో వస్తోంది. నవంబర్ 15 వ తేదీన 8 జెన్ 2 చిప్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Moto X40 ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ మాదిరిగా Moto X40 లో కెమెరా డిజైన్ ఉండనుంది. 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఇందులో ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 68వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని సమాచారం. అయితే ఎడ్జ్ 30 అల్ట్రా మాత్రం 125వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉండటం గమనార్హం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో రానున్న Moto X40 first appeared on 91Mobiles Telugu.

]]>