Moto Edge 50 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 29 Mar 2024 16:05:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola: లాంచ్‌కి ముందు లీకైన Moto Edge 50 Ultra డిజైన్, రెండర్స్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/moto-edge-50-ultra-design-renders-specs-leaked/ Fri, 29 Mar 2024 16:05:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=10893 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఏప్రిల్ 3వ తేదీన Edge 50 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. లైనప్ లో Edge 50 Pro లాంచ్ కానుంది. అయితే మరో రెండు మోడల్స్ కూడా లాంచ్ అవుతాయని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. Edge Fusion, Edge 50 Ultra ఫోన్లు కూడా ఈ సిరీస్ లో లాంచ్ అవుతాయని సమాచారం. అయితే ఈ ఫోన్లకు సంబంధించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. […]

The post Motorola: లాంచ్‌కి ముందు లీకైన Moto Edge 50 Ultra డిజైన్, రెండర్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 3న Moto Edge 50 Pro లాంచ్
  • లీక్ ద్వారా రివీలైన Edge 50 Ultra
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఏప్రిల్ 3వ తేదీన Edge 50 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. లైనప్ లో Edge 50 Pro లాంచ్ కానుంది. అయితే మరో రెండు మోడల్స్ కూడా లాంచ్ అవుతాయని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. Edge Fusion, Edge 50 Ultra ఫోన్లు కూడా ఈ సిరీస్ లో లాంచ్ అవుతాయని సమాచారం. అయితే ఈ ఫోన్లకు సంబంధించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ, Moto Edge 50 Ultra యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto Edge 50 Ultra డిజైన్ (లీక్)

Android Headlines ద్వారా Moto Edge 50 Ultra యొక్క డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. చైనాకు చెందిన మరో టిప్‌స్టర్ ద్వారా డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది.

లీకైన ఇమేజ్‌ని గమనిస్తే Moto Edge 50 Ultra డివైజ్‌లో కర్వ్డ్-ఎడ్జ్ డిస్ప్లే ఉంది.

బ్యాక్ ప్యానెల్ పై మూడు కెమెరాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు లేజర్ ఆటోఫోకస్ యూనిట్, మైక్రోఫోన్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Moto Edge 50 Ultra డివైజ్ లో కుడివైపున వాల్యూమ్ మరియు పవర్ బటన్ ఉన్నాయి. బాటమ్ లో స్పీకర్ గ్రిల్, యూఎస్బీ-సీ పోర్ట్, మైక్రోఫోన్, సిమ్ స్లాట్ ఉన్నాయి.

Moto Edge 50 Ultra డివైజ్ పీచ్ ఫజ్, బ్లాక్ మరియు లైట్ బీజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto Edge 50 Ultra స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: లీక్ ప్రకారం, Moto Edge 50 Ultra లో 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే, మెటల్ మిడ్ ఫ్రేమ్ ఉంటాయి. స్క్రీన్ సైజ్ ఇంకా తెలియలేదు.
  • ప్రాసెసర్: Moto Edge 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Moto Edge 50 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Moto Edge 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 125 వాట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.
  • ఓఎస్: Moto Edge 50 Ultra ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Motorola: లాంచ్‌కి ముందు లీకైన Moto Edge 50 Ultra డిజైన్, రెండర్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>