Moto G13 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 29 Mar 2023 08:40:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 90 హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో భారత్ లో లాంచైన Moto G13 4G https://www.91mobiles.com/telugu/moto-g13-4g-launched-india-price-specs-availability/ Wed, 29 Mar 2023 08:40:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=5632 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా భారత్ లో ఒక కొత్త 4జీ ఫోన్ ని లాంచ్ చేసింది. Moto G13 4G పేరుతో మార్కెట్ లోకి ఈ ఫోన్ అడుగు పెట్టింది. 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచైంది. భారత్ లో ఈ ఫోన్ ధరను అందుబాటులో ఉంచారు. 4జీ కనెక్టివిటీతో వస్తోన్న ఈ ఫోన్ కి సంబంధించిన ఇతర […]

The post 90 హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో భారత్ లో లాంచైన Moto G13 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ల్యావెండర్ బ్లూ, మ్యాట్ చార్కోల్ కలర్ ఆప్షన్స్ లో లాంచైన Moto G13 4G
  • ఏప్రిల్ 5 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొదలుకానున్న సేల్
  • భారత్ లో Moto G13 4G ప్రారంభ ధర రూ.9,499

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా భారత్ లో ఒక కొత్త 4జీ ఫోన్ ని లాంచ్ చేసింది. Moto G13 4G పేరుతో మార్కెట్ లోకి ఈ ఫోన్ అడుగు పెట్టింది. 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచైంది. భారత్ లో ఈ ఫోన్ ధరను అందుబాటులో ఉంచారు. 4జీ కనెక్టివిటీతో వస్తోన్న ఈ ఫోన్ కి సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G13 4G ధర, లభ్యత

Moto G13 4G రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. 64జిబి వేరియంట్ ధర రూ.9,499 గా ఉంది. 128జిబి వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. ల్యావెండర్ బ్లూ, మ్యాట్ చార్కోల్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ మరియు మేజర్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఏప్రిల్ 5 నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Moto G13 4G స్పెసిఫికేషన్స్

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ 90 హెర్ట్జ్ డిస్ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Moto G13 4G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా అందించారు.

Moto G13 4G లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. Moto G13 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. Moto G13 4G కి ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో పాటు మూడేళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామినిస్తోంది.

పవర్ బ్యాకప్ కోసం Moto G13 4G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇంకా ఈ ఫోన్ ఐపీ52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ తో వచ్చింది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ డివైజ్ లో డాల్బి అట్మాస్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. మోటో జీ13 4జీ ఫోన్ గురించి తెలుసుకున్నారు కదా? మీరు గనుక 4జీ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఓసారి ప్రయత్నించండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 90 హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో భారత్ లో లాంచైన Moto G13 4G first appeared on 91Mobiles Telugu.

]]>