Moto G23 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 25 Jan 2023 10:28:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో లాంచైన Moto G13, Moto G23 https://www.91mobiles.com/telugu/moto-g13-moto-g23-launched-globally-price-specs/ Wed, 25 Jan 2023 10:28:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=4642 మోటోరోలా సంస్థ రెండు కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. Moto G13, Moto G23 ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్లకు సంబంధించిన లీక్స్ నెట్టింట్లో హడావుడి చేశాయి. Moto G13, Moto G23 ఫోన్లు డిస్ప్లే, పెర్ఫామెన్స్, కెమెరాల విషయంలో దాదాపు ఒకేలా ఉన్నాయి. Moto G23 రెండు స్టోరేజీ ఆప్షన్స్ తో రాగా, Moto G13 సింగిల్ స్టోరేజీ ఆప్షన్ తో […]

The post MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో లాంచైన Moto G13, Moto G23 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చిన Moto G13, Moto G23 స్మార్ట్ ఫోన్స్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ డిస్ప్లే ఈ ఫోన్ల ప్రత్యేకత
  • Moto G13 ధర 179 యూరోలు (సుమారు రూ.15,900), Moto G23 ధర 199 యూరోలు (సుమారు రూ.17,600)

మోటోరోలా సంస్థ రెండు కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. Moto G13, Moto G23 ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్లకు సంబంధించిన లీక్స్ నెట్టింట్లో హడావుడి చేశాయి. Moto G13, Moto G23 ఫోన్లు డిస్ప్లే, పెర్ఫామెన్స్, కెమెరాల విషయంలో దాదాపు ఒకేలా ఉన్నాయి. Moto G23 రెండు స్టోరేజీ ఆప్షన్స్ తో రాగా, Moto G13 సింగిల్ స్టోరేజీ ఆప్షన్ తో వచ్చింది.

Moto G13, Moto G23 స్మార్ట్ ఫోన్లు ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వచ్చాయి. రియర్ ప్యానెల్స్ ప్లాస్టిక్ బాడీతో వచ్చాయి. రెండు ఫోన్లు కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చాయి. సరే, ఓసారి Moto G13, Moto G23 ఫోన్ల ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto G13, Moto G23 ధర, స్పెసిఫికేషన్స్

Moto G13 సింగిల్ స్టోరేజీలో మాత్రమే లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర 179 యూరోలు (సుమారు రూ.15,900). Moto G13 ఫోన్ మ్యాట్ చార్‌కోల్, బ్లూ లావెండర్, రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G23 స్మార్ట్ ఫోన్ 4జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 199 యూరోలు (సుమారు రూ.17,600). 8జిబి ర్యామ్ వేరియంట్ ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. మ్యాట్ చార్‌కోల్, పెర్ల్ వైట్, స్టీల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

హార్డ్‌వేర్ విషయానికి వస్తే, రెండు ఫోన్లు కూడా ఒకేరకమైన డిస్ప్లే, బ్యాటరీ కెపాసిటీ, రియర్ కెమెరా సెటప్, ప్రాసెసర్ తో వచ్చాయి. Moto G13, Moto G23 ఫోన్లు 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హోల్-పంచ్ కటౌట్ తో వచ్చాయి. వీటిలో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ డిస్ప్లే, మందపాటి బాటమ్ బెజెల్ ఉన్నాయి.

Moto G13, Moto G23 ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. ఇంకా పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. Moto G13 ఫోన్ 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రాగా, Moto G23 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

ఈ రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. Moto G13, Moto G23 ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమీరీ కెమెరా, 5ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.

Moto G23 స్మార్ట్ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వగా, Moto G13 లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. త్వరలోనే ఈ డివైజెస్ యూరోప్ లో లాంచ్ కానున్నాయి. తర్వాత లాటిన్ అమెరికా, ఆసియా లో లాంచ్ కానున్నాయి. ఇండియా లాంచ్ తేదీకి సంబంధించి ఇంతవరకు ఎటువంటి ప్రకటన రాలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో లాంచైన Moto G13, Moto G23 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Moto G23 ఇమేజెస్ https://www.91mobiles.com/telugu/moto-g23-renders-leaked-before-launch/ Sun, 22 Jan 2023 16:23:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=4596 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలో Moto-G సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Moto G13, Moto G23 ఫోన్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు త్వరలోనే భారత్ తో పాటు, గ్లోబల్ గా లాంచ్ కానున్నాయి. ఇక రీసెంట్ గా Moto G13, Moto G23 ఫోన్ల కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు Moto G23 […]

The post లాంచ్‌కి ముందు లీకైన Moto G23 ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Moto G23 స్మార్ట్ ఫోన్
  • 3 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Moto G23 డివైజ్
  • Moto G23 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్ తో రానుందని అంచనా

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలో Moto-G సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Moto G13, Moto G23 ఫోన్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు త్వరలోనే భారత్ తో పాటు, గ్లోబల్ గా లాంచ్ కానున్నాయి. ఇక రీసెంట్ గా Moto G13, Moto G23 ఫోన్ల కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు Moto G23 కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసాయి.

Dealntech కంపెనీ నుంచి వచ్చిన తాజా వార్త ద్వారా Moto G23 ఫోన్ యొక్క హై-క్వాలిటీ రెండర్స్ బయటకు వచ్చాయి. ఈ డివైజ్ 3 కలర్ ఆప్షన్స్ తో లాంచ్ కానుందని సమాచారం. సరే, Moto G23 యొక్క ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

లీకైన Moto G23 రెండర్స్

త్వరలో రాబోవు Moto G23 ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. అవి: బ్లూ, గ్రే మరియు వైట్. రెండర్ ఇమేజెస్ ని బట్టి, ఈ ఫోన్ పంచ్-హోల్ ఫ్రంట్ కెమెరా, గుర్తించదగిన బెజెల్స్ తో వస్తోంది. ఫోన్ వెనకాల ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ రౌండెడ్ కార్నర్స్ తో ఉంది. ఐకానిక్ మోటో లోగో ప్యానెల్ కి మధ్యలో ఉంటుంది.

తాజా లీక్ ప్రకారం, Moto G23 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఫోన్ లో 50ఎంపి క్వాడ్ పిక్సెల్ మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా ఇచ్చారు.

Moto G23 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. Moto G23 ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్ 2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Moto G23 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తున్నట్లు సమాచారం. యూరోపియన్ మార్కెట్ లో ఈ వేరియంట్ ధర 199 యూరోలు (సుమారు రూ.17,500) గా ఉండే అవకాశం ఉంది. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యాక మార్కెట్ ధరలో మార్పు ఉంటుంది. త్వరలోనే ఈ ఫోన్ ఇండియా లాంచ్ కి సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు లీకైన Moto G23 ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>