Moto G32 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Aug 2022 11:29:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto G32 లాంచ్: తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ https://www.91mobiles.com/telugu/motorola-g32-launched-india-price-specs/ Tue, 09 Aug 2022 11:29:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=1574 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన మోటో జీ32 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ప్రధాన ఫీచర్లు భారత్ లో మోటో జీ32 ధర రూ.12,999 మోటో జీ32 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. భారత్ లో లాంచ్ అయిన లేటెస్ట్ జీ-సిరీస్ మోటోరోలా ఫోన్ ఇదే. గత నెలలో ఈ […]

The post Moto G32 లాంచ్: తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన మోటో జీ32 స్మార్ట్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ప్రధాన ఫీచర్లు
  • భారత్ లో మోటో జీ32 ధర రూ.12,999

మోటో జీ32 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. భారత్ లో లాంచ్ అయిన లేటెస్ట్ జీ-సిరీస్ మోటోరోలా ఫోన్ ఇదే. గత నెలలో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో విడుదలైంది. కాగా, ఈ ఫోన్ కేవలం 4జీ ఎల్టీఈ కనెక్టివిటీని కలిగి ఉంది. సెల్ఫీ స్నాపర్ కోసం ఇందులో సెంటర్ పొజిషన్డ్ పంచ్ హోల్ కటౌట్ ను అందించారు. ఫ్లాట్ ఎడ్జెస్, తక్కువ సైజులో బాటమ్ చిన్ తో స్క్రీన్ చక్కగా కనిపిస్తోంది. ఇక ట్రిపుల్ కెమెరా సెటప్ స్క్వేర్ మాడ్యూల్ లో ఉంది. భద్రత కోసం ఈ ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. స్ప్లాష్ రెసిస్టన్స్ కోసం ఇందులో ఐపీ52 రేటింగ్ ఉంది. అలాగే మంచి సౌండ్ కోసం డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది.

స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

భారత్ లో Moto G32 ధర, లభ్యమయ్యే తేదీ

భారత్ లో మోటో జీ32 ధర రూ.12,999 గా నిర్ణయించబడింది. ఈ ఫోన్ శాటిన్ సిల్వర్, మినరల్ గ్రే అనే రెండు రంగుల్లో లభ్యం కానుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆగస్టు 16 నుంచి ఈ హ్యాండ్సెట్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా మోటో జీ32 ని కొనుగోలు చేసేవారికి రూ.1250 డిస్కౌంట్ లభించనుంది.

Moto G32 స్పెసిఫికేషన్స్

6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మోటో జీ32 లో ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ని మోటో జీ32 లో అమర్చారు. అడ్రెనో 610 జీపీయూ, 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ, 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ (మెమొరీ కార్డ్ ద్వారా), ఆండ్రాయిడ్ ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ మోటో జీ32 లో ఉన్నాయి.

మోటో జీ32 స్మార్ట్ ఫోన్ లో వెనకాల మూడు కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ సెన్సర్, రెండోది 8ఎంపి అల్ట్రావైడ్ మరియు డెప్త్ సెన్సర్, మూడోది 2ఎంపి మ్యాక్రో కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు.

మోటో జీ32 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్, డ్యూయల్ మైక్రోఫోన్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్లో ఉన్నాయి.

The post Moto G32 లాంచ్: తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Moto G32 డిజైన్ https://www.91mobiles.com/telugu/motorola-g32-design-leaks-before-launch-specs-price/ Mon, 08 Aug 2022 13:55:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=1546 హైలైట్స్: ఓ వీడియో ద్వారా లీకైన మోటో జీ32 భారత వేరియంట్ డిజైన్ 6.5 అంగుళాల హెచ్డీ+ 90 హెర్ట్జ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు ఫ్లిప్ కార్ట్ ద్వారా మోటో జీ32 అమ్ముడుకానుంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.13,000 ఉండే అవకాశం ఆగస్టు 9 న భారత్ లో మోటో జీ32 స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది. గత నెలలో యూరప్ […]

The post లాంచ్ కి ముందు లీకైన Moto G32 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఓ వీడియో ద్వారా లీకైన మోటో జీ32 భారత వేరియంట్ డిజైన్
  • 6.5 అంగుళాల హెచ్డీ+ 90 హెర్ట్జ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • ఫ్లిప్ కార్ట్ ద్వారా మోటో జీ32 అమ్ముడుకానుంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.13,000 ఉండే అవకాశం

ఆగస్టు 9 న భారత్ లో మోటో జీ32 స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది. గత నెలలో యూరప్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. లాంచ్ కి ముందు, ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ మోటో జీ32 యొక్క ఫస్ట్ హ్యాండ్స్-ఆన్ లుక్ ని షేర్ చేశాడు. భారత్ లో ఈ మోటోరోలా హ్యాండ్సెట్ ఎంట్రీ లెవెల్ యూనిసాక్ చిప్సెట్ తో వస్తోందని వార్తలు వచ్చాయి. యూరోపియన్ వర్షన్ లో స్నాప్ డ్రాగన్ 680 చిప్ ను వాడారు. అయితే, భారత్ లో కూడా స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ తో కూడిన మోటో జీ32 వస్తుందని టిప్ స్టర్ ముకుల్ శర్మ అన్నాడు.

గతంలో, మోటో జీ32 ఎన్‌సీ‌సీ సర్టిఫికేషన్ ద్వారా మోటో జీ32 యొక్క లైవ్ ఇమేజెస్, బాక్స్ కంటెంట్ గుడీస్ రివీల్ అయ్యాయి. తర్వాత లీక్డ్ రెండర్స్ ద్వారా ఫోన్ ఫస్ట్ లుక్ ని కూడా మనం చూశాం. ఇక ఇప్పుడు మోటో జీ32 యొక్క పూర్తి రూపం మన ముందుకు వచ్చింది.

Moto G32 భారత వేరియంట్ డిజైన్ లీక్

పైన వీడియోలో, టిప్ స్టర్ బ్లాక్ కలర్ మోటో జీ32 ని రివీల్ చేశాడు. మోటో జీ32 ఎరుపు రంగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. బాటమ్ లో డిస్ప్లే స్లిమ్ చిన్ ని కలిగి ఉంది. మోటో జీ32 ఫోన్లో కుడివైపు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. ఇక 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, స్పీకర్ గ్రిల్, సిమ్ కార్డ్ ట్రే, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ బాటమ్ లో ఉన్నాయి.

Moto G32 స్పెసిఫికేషన్స్, ధర (అంచనా)

మోటో జీ32 స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 1టీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని పెంచుకునే అవకాశముంది.

ఇప్పుడు మోటో జీ32 స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. మోటో జీ32 స్మార్ట్ ఫోన్లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కొరకు ముందువైపున 16ఎంపి కెమెరాను అమర్చారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఫోన్ పని చేస్తుంది. మోటో జీ32 స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారత్ లో మోటో జీ32 ధర రూ.13,000.

The post లాంచ్ కి ముందు లీకైన Moto G32 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
50ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో లాంచ్ అయిన Moto G32 https://www.91mobiles.com/telugu/moto-g32-launched-in-europe-price-specs/ Mon, 01 Aug 2022 05:34:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=1381 హైలైట్స్: యూరోప్ లో మోటో జీ32 ఫోన్ ని లాంచ్ చేసిన మోటోరోలా 90 హెర్ట్జ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జిబి ర్యామ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు త్వరలోనే భారత్ తో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో లాంచ్ కానున్న మోటో జీ32 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా యూరప్ లో మోటో జీ32 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. మోటో జీ42 తో […]

The post 50ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో లాంచ్ అయిన Moto G32 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • యూరోప్ లో మోటో జీ32 ఫోన్ ని లాంచ్ చేసిన మోటోరోలా
  • 90 హెర్ట్జ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జిబి ర్యామ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • త్వరలోనే భారత్ తో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో లాంచ్ కానున్న మోటో జీ32

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా యూరప్ లో మోటో జీ32 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. మోటో జీ42 తో పోల్చితే ఈ ఫోన్ కాస్త అప్‌గ్రేడెడ్ వర్షన్ అనిపిస్తోంది. జులై మొదటివారంలో మోటో జీ42 ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే భారత్ కి వచ్చేసరికి ఫోన్ యొక్క ఫీచర్లు మారిపోయే అవకాశముంది. ఈ ఫోన్ ఎంట్రీ లెవెల్ యూనిసాక్ చిప్సెట్ తో వచ్చే అవకాశముంది. ఇక యురోపియన్ వర్షన్ మోటో జీ32 విశేషాలు చూద్దాం. స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 90 హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక గమనించగ్గ విషయం ఏంటంటే, ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లేకి బదులు, ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోంది.

Moto G32 ధర

యూరోప్ లో మోటో జీ32 4జిబి ర్యామ్, 128జిబి వేరియంట్ ధర 230 యూరోలుగా ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.19,000. సేటిన్ సిల్వర్, మినరల్ గ్రే అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.

Moto G32 స్పెసిఫికేషన్స్

ఇప్పుడు స్పెసిఫికేషన్స్ వివరాలను చూద్దాం. మోటో జీ32 స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 405 పిక్సెల్స్ పర్ ఇంచ్ (పీపీఐ), డీసీఐ-పీ3 కలర్ గేముత్ సపోర్ట్, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రోనో 610 జీపీయూ, 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ, మెమొరీ కార్డు ద్వారా 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ వెనకాల మూడు కెమెరాలను అమర్చారు. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ కెమెరా, రెండోది 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, మూడోది 2ఎంపి మ్యాక్రో కెమెరా. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఇక బ్యాటరీ విభాగానికి వస్తే, ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

మోటో జీ32 స్మార్ట్ ఫోన్లో 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జ్యాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఇక ఆడియో కోసం, జీ32 లో డాల్బీ అట్మాస్ తో కూడిన రెండు స్పీకర్లను అమర్చారు. భద్రత కొరకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. ఈ డివైజ్ 184 గ్రాములు బరువుంటుందని అంచనా. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, మోటో జీ32 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

The post 50ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో లాంచ్ అయిన Moto G32 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Moto G32 డిజైన్ రెండర్స్ https://www.91mobiles.com/telugu/motorola-g32-design-renders-surfaced-online-before-its-launch/ Mon, 25 Jul 2022 15:39:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=1230 హైలైట్స్: మోటో జీ31 సక్సెసర్ ఐన మోటో జీ32 ని త్వరలోనే లాంచ్ చేయనున్న మోటోరోలా లాంచ్ కి ముందు లీకైన అఫిషీయల్ డిజైన్ రెండర్స్ రెడ్, బ్లాక్, సిల్వర్, గ్రే కలర్స్ లో లభ్యం కానున్న మోటో జీ32 స్మార్ట్ ఫోన్ మోటో జీ31 సక్సెసర్ పై మోటోరోలా పని చేస్తున్నట్లు సమాచారం. ఈలోపు నెట్టింట్లో మోటో జీ32 కి సంబంధించిన పిక్స్ ప్రత్యక్షమయ్యాయి. లీక్స్ తదుపరి మరెన్నో ఊహాగానాల తర్వాత, తాజాగా మోటో జీ32 […]

The post లాంచ్ కి ముందు లీకైన Moto G32 డిజైన్ రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • మోటో జీ31 సక్సెసర్ ఐన మోటో జీ32 ని త్వరలోనే లాంచ్ చేయనున్న మోటోరోలా
  • లాంచ్ కి ముందు లీకైన అఫిషీయల్ డిజైన్ రెండర్స్
  • రెడ్, బ్లాక్, సిల్వర్, గ్రే కలర్స్ లో లభ్యం కానున్న మోటో జీ32 స్మార్ట్ ఫోన్

మోటో జీ31 సక్సెసర్ పై మోటోరోలా పని చేస్తున్నట్లు సమాచారం. ఈలోపు నెట్టింట్లో మోటో జీ32 కి సంబంధించిన పిక్స్ ప్రత్యక్షమయ్యాయి. లీక్స్ తదుపరి మరెన్నో ఊహాగానాల తర్వాత, తాజాగా మోటో జీ32 ఎన్సీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ లో దర్శనమిచ్చింది. ఈ తరుణంలో లైవ్ పిక్స్, ఇన్-బాక్స్ యాక్ససరీలు కనిపించాయి. ఇంకా లాంచ్ టైమ్ లైన్ ఖరారు కాలేదు కానీ, మోటో జీ32 యొక్క లాంచ్ పక్కా అనే మాటలు వినిపిస్తున్నాయి.

మోటో జీ31 కి సక్సెసర్ గా భావిస్తోన్న మోటోరోలా జీ32 స్మార్ట్ ఫోన్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ తో పాటు బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. మోటో జీ32 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉండనుందని సమాచారం.

Moto G32 అఫీషియల్ ఇమేజెస్

కొన్ని రోజుల క్రితం మోటో జీ32 యొక్క అఫీషియల్ డిజైన్ రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే గతంలో బయటకు వచ్చిన సిల్వర్ మరియు గ్రే వేరియంట్స్ తో పాటు మోటో జీ32 రెడ్ మరియు బ్లాక్ షేడ్స్ లో కూడా లభించనుందని తాజాగా లీకైన డిజైన్ రెండర్స్ ని బట్టి అర్థమవుతోంది.

ఇక గతంలో లీకైన డిజైన్ మాదిరే తాజా ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఇకపోతే హార్డ్ వేర్ కంపోనెంట్స్ అమరిక తీరులో కూడా ఎటువంటి మార్పు లేదు. ఇక ఫ్రంట్ కెమెరా కోసం డిస్ప్లే ప్యానెల్ లో సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఫోన్ క్రింది భాగంలో చిన్ కనిపిస్తోంది. ఇక వెనుకాల, ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. అయితే ఈ సెటప్ ని కాస్త పైకి మూలగా జరిపినట్లు తెలుస్తోంది.

మోటో జీ32 లో 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అలాగే యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఒక స్పీకర్ గ్రిల్, సిమ్ కార్డ్ ట్రే, వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్, వెనుకవైపు మోటోరోలా లోగో, ఇందులోనే ఇమిడి ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Moto G32 ధర, స్పెసిఫికేషన్స్ (అంచనా)

మోటో జీ32 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే , 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, యూనిసాక్ టీ606 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

మోటో జీ32 ఫోన్ రూ.10,000 ధరతో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్ వివిధ రంగుల్లో లభ్యం కానుంది. త్వరలోనే మోటో జీ32 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ, ఇతర వివరాలు వెల్లడవ్వనున్నాయి.

The post లాంచ్ కి ముందు లీకైన Moto G32 డిజైన్ రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>