Moto G53 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 09:02:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 120హెర్ట్జ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G53 https://www.91mobiles.com/telugu/moto-g53-launched-china-price-specs/ Fri, 16 Dec 2022 06:03:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=4018 హైలైట్స్ చైనాలో లాంచైన Moto G53 స్మార్ట్ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G53 5జీ కనెక్టివిటీ, క్వాల్కమ్ ప్రాసెసర్ తో వచ్చిన Moto G53 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా తాజాగా Moto G53, Moto X40 డివైజెస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇందులో మోటో ఎక్స్40 ఫ్లాగ్షిప్ ఫోన్ కాగా, Moto G53 మిడ్ రేంజ్ డివైజ్. Moto G53 యావరేజీ […]

The post 120హెర్ట్జ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G53 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన Moto G53 స్మార్ట్ ఫోన్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G53
  • 5జీ కనెక్టివిటీ, క్వాల్కమ్ ప్రాసెసర్ తో వచ్చిన Moto G53

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా తాజాగా Moto G53, Moto X40 డివైజెస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇందులో మోటో ఎక్స్40 ఫ్లాగ్షిప్ ఫోన్ కాగా, Moto G53 మిడ్ రేంజ్ డివైజ్. Moto G53 యావరేజీ స్పెసిఫికేషన్స్ తో లాంచైంది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీని కలిగి ఉంది. ఇకపోతే ఈ డివైజెస్ యొక్క భారత లాంచ్ తేదీ ఇంకా రివీల్ కాలేదు. త్వరలోనే మోటోరోలా లాంచ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్స్ లభిస్తున్నాయి.

Moto G53 స్మార్ట్ ఫోన్ మిడ్-రేంజ్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. ఈ డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ రియర్ కెమెరాతో లాంచైంది. ఓసారి Moto G53 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G53 స్పెసిఫికేషన్స్

Moto G53 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి. ఈ డివైజ్ లో ఆక్టాకోర్ క్వాల్కమ్ చిప్సెట్ వాడారు. అయితే చిప్సెట్ పేరు కంపెనీ వెల్లడించలేదు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

Moto G53 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto G53 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

Moto G53 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3.5 ఎంఎం జాక్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Moto G53 హ్యాండ్సెట్ 162.7 మిల్లీ మీటర్ల పొడవు, 74.6 మిల్లీ మీటర్ల వెడ్లపు, 8.1 మిల్లీ మీటర్ల మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది.

Moto G53 ధర, లభ్యత

Moto G53 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఆర్ఎంబి 899 (సుమారు రూ.10,700), 8జిబి + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఆర్ఎంబి 1099 (సుమారు రూ.13,100). భారత్ లో లాంచ్ అయ్యాక ఈ ఫోన్ ధర మారే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 120హెర్ట్జ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G53 first appeared on 91Mobiles Telugu.

]]>