Moto G72 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 03 Oct 2022 10:18:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Helio G99 చిప్, 120Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Moto G72 https://www.91mobiles.com/telugu/moto-g72-launched-india-specs-price-availability/ Mon, 03 Oct 2022 10:18:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=2707 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన Moto G72 6.6-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 128జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ భారత్ లో Moto G72 ధర రూ.18,999 Moto G72 భారత్ లో లాంచ్ అయ్యింది. Moto G71 కి ఈ ఫోన్ సక్సెసర్ గా వచ్చింది. అయితే Moto G72 కేవలం 4జీ కనెక్టివిటీని కలిగి ఉంది. అదే Moto […]

The post MediaTek Helio G99 చిప్, 120Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Moto G72 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Moto G72
  • 6.6-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 128జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • భారత్ లో Moto G72 ధర రూ.18,999

Moto G72 భారత్ లో లాంచ్ అయ్యింది. Moto G71 కి ఈ ఫోన్ సక్సెసర్ గా వచ్చింది. అయితే Moto G72 కేవలం 4జీ కనెక్టివిటీని కలిగి ఉంది. అదే Moto G71 లో అయితే 5జీ కనెక్టివిటీ ఉంది. ఈ ఫోన్ రెండు రోజుల క్రితం లాంచ్ అయ్యింది. ఈ హ్యాండ్సెట్ పంచ్-హోల్ కటౌట్, సెల్ఫీ షూటర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది.

6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 128జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ప్రధాన ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. మరి Moto G72 యొక్క ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూద్దాం పదండి.

భారత్ లో Moto G72 ధర

Moto G72 6జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర భారత్ లో రూ.18,999 గా ఉంది. ఇది మీటియోరైట్ గ్రే, పోలార్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అక్టోబర్ 12, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది. అయితే లాంచ్ ఆఫర్ లో భాగంగా ఫోన్ ని రూ.14,999 కే సొంతం చేసుకోవచ్చు. రూ.3,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్, రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కలిపి రూ.14,999 కి ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

కస్టమర్లకు ఈ ఫోన్ కొనుగోలు పై రూ.5,049 విలువ గల జియో బెనిఫిట్స్, ప్రీపెయిడ్ రీచార్జ్ లపై రూ.4,000 క్యాష్ బ్యాక్, జీ5 యాన్యువల్ మెంబర్షిప్ పై రూ.549 డిస్కౌంట్, మింత్రా సైట్ లో రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తాయి.

Moto G72 స్పెసిఫికేషన్స్

Moto G72 లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 576 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 10-బిట్ బిలియన్ కలర్స్, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, పంచ్-హోల్ కటౌట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, ఏఆర్ఎం మాలి జీ57 ఎంసీ2, 6జిబి ఎల్పీడీడీఆర్4 ర్యామ్, 128జిబి యూఎంసీపీ స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. 1 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్, 3 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని మోటోరోలా హామీ ఇస్తోంది.

Moto G72 స్మార్ట్ ఫోన్ 160.5 మిల్లీ మీటర్ల పొడవు, 74.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.1, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ52 రేటింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బి అట్మాస్ సపోర్ట్, డ్యూయల్ మైక్రోఫోన్స్, 3.5ఎంఎం ఆడియో జ్యాక్ వంటి ఫీచర్లు Moto G72 లో ఉన్నాయి.

కెమెరా విభాగం విషయానికి వస్తే, Moto G72 లో 108ఎంపి ప్రైమరీ సెన్సర్, శాంసంగ్ హెచ్ఎం6 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా (డెప్త్ ఆప్షన్ తో), 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post MediaTek Helio G99 చిప్, 120Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Moto G72 first appeared on 91Mobiles Telugu.

]]>
Flipkart పేజీ ద్వారా కన్ఫర్మ్ అయిన Moto G72 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/moto-g72-specs-launch-date-revealed-officially/ Thu, 29 Sep 2022 16:20:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=2659 హైలైట్స్: అక్టోబర్ 3 న లాంచ్ అవుతోన్న Moto G72 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ల్యాండింగ్ పేజీ ద్వారా అనౌన్స్ అయిన Moto G72 మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తున్న Moto G72 మోటో జీ-సిరీస్ లో Moto G72 అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు మోటోరోలా కంపెనీ సిద్ధమవుతోంది. Moto G72 ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఫ్లిప్ కార్ట్ పేజీ ద్వారా రివీల్ అయ్యింది. అలాగే […]

The post Flipkart పేజీ ద్వారా కన్ఫర్మ్ అయిన Moto G72 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అక్టోబర్ 3 న లాంచ్ అవుతోన్న Moto G72 స్మార్ట్ ఫోన్
  • ఫ్లిప్ కార్ట్ ల్యాండింగ్ పేజీ ద్వారా అనౌన్స్ అయిన Moto G72
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తున్న Moto G72

మోటో జీ-సిరీస్ లో Moto G72 అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు మోటోరోలా కంపెనీ సిద్ధమవుతోంది. Moto G72 ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఫ్లిప్ కార్ట్ పేజీ ద్వారా రివీల్ అయ్యింది. అలాగే Moto G72 యొక్క కీలకమైన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి.

అక్టోబర్ 3 న భారత్ లో Moto G72 ఫోన్ లాంచ్ అవుతుందని ఫ్లిప్ కార్ట్ ల్యాండింగ్ పేజీ ద్వారా తెలుస్తోంది. Moto G72 మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. Moto G72 యొక్క డిజైన్ కూడా రివీల్ అయ్యింది. Moto G72 రెండు కలర్ ఆప్షన్స్ లో వస్తోంది. ఇకపోతే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

Moto G72 10-బిట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 576హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10 సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Moto G72 స్పెసిఫికేషన్స్

ఫ్లిప్ కార్ట్ పేజీలో కనిపించిన Moto G72 యొక్క స్పెసిఫికేషన్స్ దాదాపుగా గతంలో వచ్చిన రూమర్లతో సరిపోలుతున్నాయి. Moto G72 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని గతంలో ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఇప్పుడు అది కన్ఫర్మ్ అయ్యింది. Moto G72 6.5-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తోంది.

ఇటీవల లీకైన Moto G72 రెండర్స్ ని గమనిస్తే, తాజాగా ఫ్లిప్ కార్ట్ పేజీలో కనిపించిన డిజైన్ లో ఒకటి వాటితో మ్యాచ్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ లో రెండు కలర్ ఆప్షన్ గురించి ఉండగా, రెండర్స్ లో మాత్రం 3 కలర్ ఆప్షన్స్ కనిపించాయి. ఇదొక్కటి మ్యాచ్ కాలేదు. మిగతా డిజైన్ మొత్తం గత వారంలో లీకైన రెండర్స్ ని పోలి ఉన్నాయి.

Moto G72 గతంలో ఎన్నో సర్టిఫికేషన్ లిస్టింగ్స్ లో కనిపించింది. XT2255-1, XT2255-2 అనే మోడల్ నంబర్స్ తో ఈ ఫోన్ లిస్టింగ్స్ లో దర్శనమిచ్చింది. XT2255-1 మోడల్ నంబర్ తో TDRA, IMEI డేటాబేస్ లపై Moto G72 కనిపించింది. ఇక XT2255-2 మోడల్ నంబర్ తో BIS వెబ్‌సైట్ లో కనిపించింది.

10-Bit డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 108ఎంపి మెయిన్ కెమెరా, అమోలెడ్ ప్యానెల్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తున్న Moto G72 స్మార్ట్ ఫోన్ ఒక సరైన మిడ్-రేంజ్ ఎంపిక అని చెప్పవచ్చు. దీని ధర దాదాపు రూ.15,000 ఉండవచ్చు. ఈ ధరల శ్రేణిలో మీరు కనుక ఒక ఫోన్ కోసం వెతుకుతున్నట్లైతే Moto G72 ని ప్రయత్నించండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Flipkart పేజీ ద్వారా కన్ఫర్మ్ అయిన Moto G72 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
FCC, BIS సర్టిఫికేషన్స్ పై కనిపించిన Moto G72 https://www.91mobiles.com/telugu/moto-g72-spotted-on-fcc-bis-tuv-certifications-specs/ Thu, 25 Aug 2022 05:47:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=1888 హైలైట్స్: ఎఫ్‌సీసీ, బీఐఎస్, ఐఎంఈఐ, టీడీఆర్ఏ, డీఈఎంకేవో, టీయూవీ డేటాబేస్ లపై కనిపించిన మోటో జీ72 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న హ్యాండ్సెట్ మోటో జీ72 బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ కలిగి ఉందని రివీల్ చేసిన ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ మోటో జీ సిరీస్ స్మార్ట్ ఫోన్ మోటో జీ72 పై మోటోరోలా వర్క్ చేస్తోందని సమాచారం. FCC, BIS, IMEI, TDRA సర్టిఫికేషన్స్ పై మోటో జీ72 ఉండటాన్ని తొలుత […]

The post FCC, BIS సర్టిఫికేషన్స్ పై కనిపించిన Moto G72 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఎఫ్‌సీసీ, బీఐఎస్, ఐఎంఈఐ, టీడీఆర్ఏ, డీఈఎంకేవో, టీయూవీ డేటాబేస్ లపై కనిపించిన మోటో జీ72
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న హ్యాండ్సెట్
  • మోటో జీ72 బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ కలిగి ఉందని రివీల్ చేసిన ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్

మోటో జీ సిరీస్ స్మార్ట్ ఫోన్ మోటో జీ72 పై మోటోరోలా వర్క్ చేస్తోందని సమాచారం. FCC, BIS, IMEI, TDRA సర్టిఫికేషన్స్ పై మోటో జీ72 ఉండటాన్ని తొలుత మై‌స్మార్ట్‌ప్రైస్ గమనించి వివరాలను వెలికితీసింది. రీసెంట్ గా మోటో జీ32, మోటో జీ42 మరియు మోటో జీ62 5జీ ఫోన్లను లాంచ్ చేసిన మోటోరోలా త్వరలో మోటో జీ సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. మోటీ జీ72 ఎక్స్‌టీ2255 అనే మోడల్ నంబర్ తో దర్శనమిచ్చింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్యాటరీ కెపాసిటీ, చార్జింగ్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి.

మోటో జీ72 FCC, TDRA, IMEI డేటాబేస్ లపై XT2255-1 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. మోటీ జీ72 కి సంబంధించిన అన్ని లిస్టింగ్స్ కూడా హ్యాండ్సెట్ త్వరలోనే లాంచ్ కానుందని తెలియజేస్తున్నాయి. మరి త్వరలో లాంచ్ కానున్న ఈ మోటో జీ72 స్మార్ట్ ఫోన్ నుంచి మనం ఏం ఆశించవచ్చో ఇక్కడ చూద్దాం. పదండి.

Moto G72 సర్టిఫికేషన్స్

 

FCC లిస్టింగ్ ని బట్టి, మోటో జీ72 బ్యాటరీ ఎన్ఈ50 మోడల్ నంబర్ ని కలిగి ఉండనుంది. ఇక మోటరోలా ఎన్ఈ50 టీయూవీ సర్టిఫికేషన్ ద్వారా మోటో జీ72 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని వాడనున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ యొక్క రేటెడ్ కెపాసిటీ వచ్చి 4700 ఎంఏహెచ్ గా ఉండనుందని సమాచారం.

ఇక చార్జింగ్ అడాప్టర్ వచ్చి, ఎంసీ-331, ఎంసీ-332, ఎంసీ-333, ఎంసీ-334, ఎంసీ-336 అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉంది. DEMKO సర్టిఫికేషన్ ప్రకారం ఈ చార్జర్స్, మోటో జీ72 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుందని తెలియజేస్తున్నాయి. డాక్యుమెంట్స్ ద్వారా 15W (5V/3A), 27W (9V/3A), 30W (12V/2.5A) మరియు 33W (11V/3A) పవర్ ఔట్‌పుట్ సపోర్ట్ ని తెలుపుతున్నాయి.

మోటో జీ72 FCC సర్టిఫికేషన్ ని బట్టి, ఈ ఫోన్లో బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఉంటాయని తెలుస్తోంది. బ్యాటరీ, చార్జింగ్, కనెక్టివిటీ వివరాలు కాకుండా మోటో జీ72 కి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ ఏంటన్నది ఇప్పటికి తెలియలేదు. రానున్న రోజుల్లో మోటో జీ72 కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

Moto G72 స్పెసిఫికేషన్స్

అంచనాలను బట్టి, మోటో జీ72 స్మార్ట్ ఫోన్లో 6.62 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉండే అవకాశముంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post FCC, BIS సర్టిఫికేషన్స్ పై కనిపించిన Moto G72 first appeared on 91Mobiles Telugu.

]]>