Moto Razr 50 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 20 Sep 2024 07:08:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola Razr 50 సేల్ ప్రారంభం, రూ.15,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/motorola-razr-50-first-sale-begins-with-rs-15000-discount-know-offer-details/ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-first-sale-begins-with-rs-15000-discount-know-offer-details/#respond Fri, 20 Sep 2024 07:08:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=13645 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె రేజర్ సిరీస్ లో కొత్త్ ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. Motorola Razr 50 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేడు Motorola Razr 50 సేల్ కి వచ్చింది. ఫస్ట్ సేల్ లో ఈ ఫోన్ పై రూ.15,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. దీంతో సరికొత్త మోటోరోలా ఫ్లిప్ ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు వచ్చింది. […]

The post Motorola Razr 50 సేల్ ప్రారంభం, రూ.15,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు Motorola Razr 50 ఫస్ట్ సేల్
  • చవకగా లభిస్తోన్న Motorola Razr 50
  • రూ.15,000 వరకు డిస్కౌంట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె రేజర్ సిరీస్ లో కొత్త్ ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. Motorola Razr 50 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేడు Motorola Razr 50 సేల్ కి వచ్చింది. ఫస్ట్ సేల్ లో ఈ ఫోన్ పై రూ.15,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. దీంతో సరికొత్త మోటోరోలా ఫ్లిప్ ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు వచ్చింది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Motorola Razr 50 సేల్, ఆఫర్లు మరియు ధర

Motorola Razr 50 పై రూ.10,000 స్పెషల్ బ్యాంక్ డిస్కౌంట్‌ను మోటోరోలా కంపెనీ ఫస్ట్ సేల్ సందర్భంగా అనౌన్స్‌ చేసింది.

బ్యాంక్ ఆఫర్ తో పాటు, రూ.5,000 కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అంటే Motorola Razr 50 పై మొత్తంగా రూ.15,000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట.

పైన పేర్కొన్న ఆఫర్లతో కలుపుకుంటే Motorola Razr 50 ని రూ.49,999 కే కొనుగోలు చేయవచ్చు.

బ్యాంక్ డిస్కౌంట్ వివరాలను చూస్తే, ఎస్బీఐ కార్డ్ పై రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది.

నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. దీని సాయంతో 3 నుంచి 18 నెలల కాలపరిమితితో ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్లు లేకుండా, Motorola Razr 50 ఫ్లిప్ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.64,999 గా ఉంది.

Motorola Razr 50 ని ఎక్కడ కొనాలి?

Motorola Razr 50 ఫ్లిప్ ఫోన్ కొనేందుకు మీరు ఈ-కామర్స్ వేదిక అమెజాన్ ను విజిట్ చేయాలి. ఇంకా ఈ ఫోన్ మోటోరోలా వెబ్‌సైట్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ లింక్

Motorola Razr 50 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Razr 50 లో 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 3000 నిట్స్ పీబక్ బ్రైట్నెస్, 3.63-ఇంచ్ ఓఎల్ఈడీ ఫుల్‌హెచ్డీ+ ఓఎల్ఈడీ కవర్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10, 1700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Razr 50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Motorola Razr 50 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ర్యామ్ బూస్ట్ 3.0 ఫీచర్ తో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ లేదు.

కెమెరా: Motorola Razr 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Motorola Razr 50 లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Motorola Razr 50 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 డివైజ్ ఐపీఎక్స్8 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్, డాల్బీ అట్మాస్, బ్లూటూత్ 5.4, సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Motorola Razr 50 సేల్ ప్రారంభం, రూ.15,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-razr-50-first-sale-begins-with-rs-15000-discount-know-offer-details/feed/ 0
Motorola Razr 50 సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/motorola-razr-50-series-china-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-series-china-launch-date-confirmed/#respond Fri, 14 Jun 2024 08:04:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=12076 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Razr 50 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారైంది. చైనాలో ఈ రేజర్ 50 సిరీస్ జూన్ 25వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Motorola Razr 50 సిరీస్ […]

The post Motorola Razr 50 సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మోటో రేజర్ 50 లాంచ్ ఖరారు
  • లైనప్‌లో వస్తోన్న రేజర్ 50, 50 అల్ట్రా
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Razr 50 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారైంది. చైనాలో ఈ రేజర్ 50 సిరీస్ జూన్ 25వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Motorola Razr 50 సిరీస్ లాంచ్ తేదీ

Motorola Razr 50 సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 25వ తేదీన చైనాలో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ ఒక టీజర్ తో అధికారికంగా ప్రకటించింది.

టీజర్ ఇమేజ్ లో ఫోన్ల యొక్క పేర్లను వెల్లడించలేదు. కానీ అవి రేజర్ 50 మరియు రేజర్ 50 అల్ట్రా అని భావిస్తున్నారు.

చైనాలో జరిగే Motorola Razr 50 సిరీస్ లాంచ్ ఈవెంట్ చైనా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.

Motorola Razr 50 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Motorola Razr 50 ఫోల్డబుల్ ఫోన్ లో 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెస్ రేట్, 3.6-ఇంచ్ ఓఎల్ఈడీ సెకండరీ స్క్రీన్ ఉంటాయి.

Motorola Razr 50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలిసింది.

Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వచ్చే అవకాశం ఉంది.

Motorola Razr 50 డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్నట్లు సమాచారం.

కెమెరా విభాగం చూస్తే, ఈ ఫోల్డబుల్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ గల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.

మరోవైపు, Motorola Razr 50 Ultra లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.

స్టాండర్డ్ మోడల్ తో పోల్చితే, అల్ట్రా మోడల్ ఆకర్షణీయమైన డిజైన్ తో రానున్నట్లు తెలుస్తోంది.

అల్ట్రా మోడల్ లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

The post Motorola Razr 50 సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-razr-50-series-china-launch-date-confirmed/feed/ 0