Moto S50 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 05 Sep 2024 05:50:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto S50: 12జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/moto-s50-launched-in-china-with-12gb-ram/ https://www.91mobiles.com/telugu/moto-s50-launched-in-china-with-12gb-ram/#respond Thu, 05 Sep 2024 05:50:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=13354 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ లో Moto S50 డివైజ్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్‌గా Moto Edge 50 Neo పేరుతో ఇప్పటికే లాంచ్ అయ్యింది. కాగా, తాజాగా ఎస్50 కాంపాక్ట్ డిజైన్ తో చైనాలో అడుగు పెట్టడం విశేషం. 12జిబి ర్యామ్, 6.36-ఇంచ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. మరి, Moto S50 యొక్క ధర మరియు పూర్తి […]

The post Moto S50: 12జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Moto S50 విడుదల
  • 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 6.36-ఇంచ్ 1.5కే డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ లో Moto S50 డివైజ్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్‌గా Moto Edge 50 Neo పేరుతో ఇప్పటికే లాంచ్ అయ్యింది. కాగా, తాజాగా ఎస్50 కాంపాక్ట్ డిజైన్ తో చైనాలో అడుగు పెట్టడం విశేషం. 12జిబి ర్యామ్, 6.36-ఇంచ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. మరి, Moto S50 యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా?

Moto S50 ధర

Moto S50 డివైజ్ చైనాలో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలను తెలుసుకుందాం.

Moto S50 యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2,199 యువాన్లు (సుమారు రూ.26,000) గా నిర్ణయించారు.

12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధరను 2,499 యువాన్లు (సుమారు రూ.29,500) గా పెట్టారు.

Moto S50 డివైజ్ పెర్సిమన్ ఆరెంజ్, ఫ్లోరా బ్లూ మరియు లాటే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto S50 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto S50 లో 6.36-ఇంచ్ స్క్రీన్, ఎల్టీపీవో టెక్నాలజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: Moto S50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Moto S50 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Moto S50 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఐఎంఎక్స్896 మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో కెమెరా, 10ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Moto S50 లో 4,310 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 13 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ 15 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Moto S50 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Moto S50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Moto S50 లో ఐపీ68 నీరు మరియు దుమ్ము నుంచి రక్షణ, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Moto S50: 12జిబి ర్యామ్‌తో చైనాలో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-s50-launched-in-china-with-12gb-ram/feed/ 0