Motorola E14 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 17 Jun 2024 08:37:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto E14: ఐపీ52 రేటింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన మోటో ఈ14 https://www.91mobiles.com/telugu/moto-e14-launched-globally-with-ip-52-rating/ https://www.91mobiles.com/telugu/moto-e14-launched-globally-with-ip-52-rating/#respond Mon, 17 Jun 2024 08:37:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=12101 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తాజాగా గ్లోబల్ మార్కెట్ లో ఒక ఈ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Moto E14 పేరుతో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం యూరప్ లో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవెల్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యామ్ బూస్ట్ టెక్నాలజీ, ఐపీ52 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు […]

The post Moto E14: ఐపీ52 రేటింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన మోటో ఈ14 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Moto E14 లాంచ్
  • యూనిఎస్ఓసీ టీ606 చిప్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తాజాగా గ్లోబల్ మార్కెట్ లో ఒక ఈ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Moto E14 పేరుతో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం యూరప్ లో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవెల్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యామ్ బూస్ట్ టెక్నాలజీ, ఐపీ52 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Moto E14 ధర

Moto E14 స్మార్ట్‌ఫోన్ గ్లోబల్‌గా సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతుందో తెలుసుకుందాం.

Moto E14 2జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను 69.99 యూరోలుగా పెట్టారు. భారతీయ కరెన్సీలో దీన్ని రూ.7,400 గా చెప్పవచ్చు.

Moto E14 స్మార్ట్‌ఫోన్ గ్రాఫైట్ గ్రే, పేస్టల్ గ్రీన్ మరియు పేస్టల్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. ధర రూ.7,000 లోపు ఉండే అవకాశం ఉంది.

Moto E14 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Moto E14 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: Moto E14 లో యూనిఎస్ఓసీ టీ606 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.6 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంపీ1 జీపీయూ వినియోగించారు.

ఓఎస్: Moto E14 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 గో ఓఎస్ తో లాంచ్ అయ్యింది. తక్కువ ర్యామ్ వాడుకుని మెరుగైన పెర్ఫామెన్స్ ఈ ఫోన్ అందిస్తుంది. ఇంకా గూగుల్ గో యాప్స్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఇంటర్నెట్ మరియు బ్యాటరీ వాడకం తక్కువవుతుంది.

మెమొరీ: Moto E14 స్మార్ట్‌ఫోన్ 2జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో వచ్చింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్ ని 4జిబి వరకు పెంచుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.

కెమెరా: Moto E14 లో సింగిల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి కెమెరాను అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Moto E14 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Moto E14 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post Moto E14: ఐపీ52 రేటింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన మోటో ఈ14 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-e14-launched-globally-with-ip-52-rating/feed/ 0