Motorola Edge 2023 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 11 Oct 2023 09:38:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Dimensity 7030 చిప్‌తో యూఎస్‌లో లాంచైన Motorola Edge 2023 https://www.91mobiles.com/telugu/motorola-edge-2023-launched-us-price-specs-availability/ Wed, 11 Oct 2023 09:38:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=8342 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ఎడ్జ్ సిరీస్ ని మరింత విస్తృతం చేస్తోంది. తాజాగా Motorola Edge 2023 డివైజ్ ని యూఎస్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అసలు విషయం ఏంటంటే, మే నెలలో Motorola Edge+ (2023) డివైజ్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు దీనికి స్టాండర్డ్ వర్షన్ Motorola Edge 2023 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్, 6.6-ఇంచ్ కర్వ్డ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 68 […]

The post MediaTek Dimensity 7030 చిప్‌తో యూఎస్‌లో లాంచైన Motorola Edge 2023 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూఎస్ లో లాంచైన Motorola Edge 2023
  • ఐపీ68 రేటింగ్ తో వచ్చిన డివైజ్
  • Edge 2023 యూఎస్ ధర 599 డాలర్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ఎడ్జ్ సిరీస్ ని మరింత విస్తృతం చేస్తోంది. తాజాగా Motorola Edge 2023 డివైజ్ ని యూఎస్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అసలు విషయం ఏంటంటే, మే నెలలో Motorola Edge+ (2023) డివైజ్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు దీనికి స్టాండర్డ్ వర్షన్ Motorola Edge 2023 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్, 6.6-ఇంచ్ కర్వ్డ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Motorola Edge 2023 డివైజ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Motorola Edge 2023 డిజైన్

  • Motorola Edge 2023 డిజైన్ విషయానికి వస్తే, వీగన్ లెదర్ టెక్షర్ బ్యాక్ ప్యానెల్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.
  • అల్యూమినియమ్ మిడ్ ఫ్రేమ్ ని Motorola Edge 2023 లో అందించారు.
  • బ్యాక్ ప్యానెట్ పై కర్వ్డ్ షేప్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • ఫ్రంట్ లుక్ చూస్తే, ఈ డివైజ్ లో పంచ్ హోల్ స్క్రీన్ కనిపిస్తుంది.

Motorola Edge 2023 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Motorola Edge 2023 లో 6.6-ఇంచ్ కర్వ్డ్ పీఓఎల్ఈడీ 10-బిట్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • చిప్సెట్: Motorola Edge 2023 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7030 చిప్ వాడారు. ఈ చిప్ గేమింగ్ ని బాగానే హ్యాండిల్ చేస్తుంది.
  • మెమొరీ: Motorola Edge 2023 లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు.
  • కెమెరా: Motorola Edge 2023 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Motorola Edge 2023 లో పవర్ బ్యాకప్ కోసం 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా 15 వాట్ వైర్లెస్, 5 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సౌకర్యాలు ఈ ఫోన్ లో ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Motorola Edge 2023 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు: Motorola Edge 2023 లో ఐపీ68 రేటింగ్ ఉంది. దీంతో వాటర్ మరియు డస్ట్ నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇంకా ఈ డివైజ్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఫీచర్స్ ఉన్నాయి.

Motorola Edge 2023 ధర, లభ్యత

  • Motorola Edge 2023 డివైజ్ ధరను యూఎస్ మార్కెట్ లో 599 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.49,000 అని అనుకోవచ్చు.
  • Motorola Edge 2023 డివైజ్ ఎక్లిప్స్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.
  • మోటోరోలా.కామ్, అమెజాన్ మరియు ఇతర ఆన్‌లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా Motorola Edge 2023 ని కొనుగోలు చేయవచ్చు.

The post MediaTek Dimensity 7030 చిప్‌తో యూఎస్‌లో లాంచైన Motorola Edge 2023 first appeared on 91Mobiles Telugu.

]]>