Motorola G34 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 26 Sep 2024 10:47:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola ఫోన్ నుంచి మంటలు, కాలిపోయిన ఫోన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/motorola-phone-catches-fire-know-full-details/ https://www.91mobiles.com/telugu/motorola-phone-catches-fire-know-full-details/#respond Thu, 26 Sep 2024 10:47:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=13761 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola స్మార్ట్‌ఫోన్లకు భారతీయ మార్కెట్ లో ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. సరసమైన ధరల్లో అధిక ఫీచర్లను అందిస్తూ, యూజర్లలో మంచి పేరును సంపాదించింది. జనాలు కూడా ఈమధ్య ఈ బ్రాండ్ ఫోన్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సమయంలో ఓ చేదు వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ఒక మోటోరోలా ఫోన్ లో నిప్పులు చెలరేగి దాదాపుగా కాలిపోయింది. ఈ ఫోన్ Motorola G34 అని ప్రాథమికంగా ఒక అంచనాకు […]

The post Motorola ఫోన్ నుంచి మంటలు, కాలిపోయిన ఫోన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మోటోరోలా ఫోన్ నుంచి మంటలు
  • కాలిపోయిన స్మార్ట్‌ఫోన్
  • Motorola G34 గా నిర్ధారణ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola స్మార్ట్‌ఫోన్లకు భారతీయ మార్కెట్ లో ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. సరసమైన ధరల్లో అధిక ఫీచర్లను అందిస్తూ, యూజర్లలో మంచి పేరును సంపాదించింది. జనాలు కూడా ఈమధ్య ఈ బ్రాండ్ ఫోన్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సమయంలో ఓ చేదు వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ఒక మోటోరోలా ఫోన్ లో నిప్పులు చెలరేగి దాదాపుగా కాలిపోయింది. ఈ ఫోన్ Motorola G34 అని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.

Motorola G34 నుంచి మంటలు

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తాజాగా తన X ఖాతాలో కాలిపోయిన ఫోన్ యొక్క ఫోటోలను షేర్ చేశారు. వాటిని చూస్తే, ఫోన్ చాలా వరకు కాలిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అయితే ఈ ఫోటోల్లో బ్రాండ్ పేరు కనిపించలేదు. కానీ, టిప్‌స్టర్ ఆ ఫోన్ మోటోరోలా జీ34 అని తెలిపారు.

సోషల్ మీడియాలో 4 ఇమేజెస్ షేర్ అయ్యాయి. వాటిని గమనిస్తే, డిస్ప్లే కూడా సెపరేట్ అయినట్లు తెలుస్తోంది.

నిప్పు అంటుకోవడం వల్లన ఫోన్ వెనుక, ముందు వైపున ప్యానెల్స్ డ్యామేజ్ అయ్యాయి. టిప్‌స్టర్ ఈ పోస్ట్‌ను షేర్ చేసిన తర్వాత, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హీటింగ్ ప్రాబ్లెమ్ వల్లన ఫోన్ లో మంటలు చెలరేగి ఉంటాయని అంచనా వేయవచ్చు.

ఈ ఘటన వల్లన ఎవరికైనా గాయాపడ్డారా? బాధితులు ఎవరు అనే విషయాలు ఇంకా తెలియదు.

మోటోరోలా కంపెనీ స్పందన ఏంటి?

మోటోరోలా ఫోన్ యొక్క ఫోటోలు వైరల్ అయ్యాక, బ్రాండ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. తన పోస్ట్ లో మోటోరోలా “మీ భద్రతే మాకు ప్రధానం. మీరు బాగున్నారని ఆశిస్తున్నాం. మీకు సరైన పరిష్కారం అందించేందుకై మీతో కలిసి పని చేస్తాం. మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మరియు ఈమెయిల్ ఐడీని ఇవ్వగలరు” అని పేర్కొంది.

గతంలో కూడా పేలిన Motorola G34

గతంలో కూడా మోటోరోలా జీ34 లో మంటలు చెలరేగి, పేలినట్లు వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 5వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. తన మోటో జీ34 పేలినట్లు రాంబాబు సోలంకి అనే యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో వివరాలను షేర్ చేశారు. అంతేకాదు, పేలుడుకి సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. తాను ఫోన్‌ని గత నెలలో కొనుగోలు చేసినట్లు పోస్ట్ లో యూజర్ పేర్కొన్నారు.

స్మార్ట్‌ఫోన్ పేలకుండా ఏం చేయాలి?

ఫోన్‌ని నేరుగా సూర్యకాంతిలో ఉంచవద్దు. అలాగే వేడిమి ఉన్న ప్రదేశంలో చార్జ్ చేయవద్దు.

రాత్రి వేళ చార్జింగ్ పెట్టి.. అలాగే గంటల తరబడి ఫోన్‌ని వదిలేయవద్దు. అలాగే ఎప్పుడైనా సరే, ఫోన్ 100 శాతం చార్జింగ్ పూర్తయ్యాక వెంటనే ఆఫ్ చేయండి. చార్జింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ వాడకండి.

కంపెనీ అందించిన చార్జర్ మరియు కేబుల్‌ను మాత్రమే వాడండి. థర్డ్ పార్టీ లేదా ఫేక్ బ్యాటరీలు వాడకండి. మీ ఫోన్ గనుక విపరీతంగా వేడెక్కినట్లు అనిపిస్తే, వెంటనే స్విచాఫ్ చేసేయండి.

The post Motorola ఫోన్ నుంచి మంటలు, కాలిపోయిన ఫోన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-phone-catches-fire-know-full-details/feed/ 0