Motorola G45 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 21 Aug 2024 15:16:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola G45 5G: 120Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన మోటోరోలా జీ45 5జీ https://www.91mobiles.com/telugu/motorola-g45-5g-launched-india-120hz-display/ https://www.91mobiles.com/telugu/motorola-g45-5g-launched-india-120hz-display/#respond Wed, 21 Aug 2024 15:16:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=13098 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో జీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola G45 5G పేరుతో లాంచైన ఈ డివైజ్ తక్కువ ధరతో లాంచ్ అవ్వడం విశేషం. మరో విషయం ఏంటంటే, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో అందించారు. మరి, ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా? Motorola G45 5G ధర, లభ్యత Motorola […]

The post Motorola G45 5G: 120Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన మోటోరోలా జీ45 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Motorola G45 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.10,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో జీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola G45 5G పేరుతో లాంచైన ఈ డివైజ్ తక్కువ ధరతో లాంచ్ అవ్వడం విశేషం. మరో విషయం ఏంటంటే, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో అందించారు. మరి, ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా?

Motorola G45 5G ధర, లభ్యత

Motorola G45 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.12,999 గా పెట్టారు.

లాంచ్ ఆఫర్‌లో భాగంగా, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

ఆఫర్ తర్వాత, బేస్ మోడల్‌ను రూ.9,999 కే సొంతం చేసుకోవచ్చు. టాప్ వేరియంట్‌ను రూ.11,999 కి కొనుగోలు చేయవచ్చు.

Motorola G45 5G యొక్క సేల్ ఆగస్టు 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్ మరియు వివా మజెంటా కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Motorola G45 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola G45 5G లో 6.5-ఇంచ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola G45 5G స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ అందించారు. ఈ చిప్సెట్ తో 5జీ, గేమింగ్ మరియు ఇతర పనులను వేగంగా చేయవచ్చు.

ర్యామ్, స్టోరేజీ: Motorola G45 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీ ద్వారా యూజర్‌కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Motorola G45 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Motorola G45 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

సాఫ్ట్‌వేర్: Motorola G45 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. ఒక సంవత్సరం ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Motorola G45 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Motorola G45 5G లో డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఐపీ52 రేటింగ్, 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉన్నాయి.

The post Motorola G45 5G: 120Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన మోటోరోలా జీ45 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-g45-5g-launched-india-120hz-display/feed/ 0