Motorola G45 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Aug 2024 09:39:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola G45 ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/motorola-g45-india-launch-date-cofirmed/ https://www.91mobiles.com/telugu/motorola-g45-india-launch-date-cofirmed/#respond Fri, 16 Aug 2024 09:39:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=13022 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో జీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Motorola G45 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా రివీల్ అయ్యింది. లాంచ్ తేదీతో పాటు, డిజైన్, కలర్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా తెలిసాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Motorola G45 లాంచ్ తేదీ మరియు సేల్ వివరాలు Motorola […]

The post Motorola G45 ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Motorola G45 లాంచ్ తేదీ ఖరారు
  • ఆగస్టు 21న భారత్ లో లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో జీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Motorola G45 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా రివీల్ అయ్యింది. లాంచ్ తేదీతో పాటు, డిజైన్, కలర్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా తెలిసాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Motorola G45 లాంచ్ తేదీ మరియు సేల్ వివరాలు

Motorola G45 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది. మోటోరోలా.ఇన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Motorola G45 డిజైన్ మరియు కలర్స్

Motorola G45 స్మార్ట్‌ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: బ్రిలియంట్ గ్రీన్, వివా మజెంటా, బ్రిలియంట్ బ్లూ. రీసెంట్ గా Motorola G45 రెండర్స్‌ను Smartprix లీక్ చేసింది.

ఈ ఫోన్ వీగన్ లెదర్ ఫినిష్డ్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. ఇంకా ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందువైపు, ఎడ్జెస్ సన్నగా, సైడ్స్ ఫ్లాట్ గా ఉంటాయి. ఫోన్‌కి ఎడమవైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటాయి. కుడివైపున కేవలం సిమ్ కార్డ్ ట్రే మాత్రమే ఉంది. బాటమ్ లో యూఎస్బీ-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్ హోల్ ఉన్నాయి.

Motorola G45 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola G45 లో 6.5-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Motorola G45 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

మెమొరీ: Motorola G45 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుందని సమాచారం.

కెమెరా: Motorola G45 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి క్వాడ్ పిక్సెల్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.

బ్యాటరీ: Motorola G45 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ విషయాన్ని లీక్‌స్టర్ మిస్టరీ లూపిన్ ఆన్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు.

ఇతర ఫీచర్లు: Motorola G45 లో డాల్బీ అట్మాస్, హై-రెజ్ ఆడియో, స్మార్ట్ కనెక్ట్ ఉంటాయి.

Motorola G45 ధర (రూమర్లు)

Motorola G45 స్మార్ట్‌ఫోన్ ధర భారత్ లో రూ.15,000 వద్ద ఉంటుందని తన కథనంలో Smartprix పేర్కొంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికార ప్రకటన రావొచ్చు.

The post Motorola G45 ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-g45-india-launch-date-cofirmed/feed/ 0