Motorola Moto G13 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 25 Jan 2023 10:28:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో లాంచైన Moto G13, Moto G23 https://www.91mobiles.com/telugu/moto-g13-moto-g23-launched-globally-price-specs/ Wed, 25 Jan 2023 10:28:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=4642 మోటోరోలా సంస్థ రెండు కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. Moto G13, Moto G23 ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్లకు సంబంధించిన లీక్స్ నెట్టింట్లో హడావుడి చేశాయి. Moto G13, Moto G23 ఫోన్లు డిస్ప్లే, పెర్ఫామెన్స్, కెమెరాల విషయంలో దాదాపు ఒకేలా ఉన్నాయి. Moto G23 రెండు స్టోరేజీ ఆప్షన్స్ తో రాగా, Moto G13 సింగిల్ స్టోరేజీ ఆప్షన్ తో […]

The post MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో లాంచైన Moto G13, Moto G23 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చిన Moto G13, Moto G23 స్మార్ట్ ఫోన్స్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ డిస్ప్లే ఈ ఫోన్ల ప్రత్యేకత
  • Moto G13 ధర 179 యూరోలు (సుమారు రూ.15,900), Moto G23 ధర 199 యూరోలు (సుమారు రూ.17,600)

మోటోరోలా సంస్థ రెండు కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. Moto G13, Moto G23 ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్లకు సంబంధించిన లీక్స్ నెట్టింట్లో హడావుడి చేశాయి. Moto G13, Moto G23 ఫోన్లు డిస్ప్లే, పెర్ఫామెన్స్, కెమెరాల విషయంలో దాదాపు ఒకేలా ఉన్నాయి. Moto G23 రెండు స్టోరేజీ ఆప్షన్స్ తో రాగా, Moto G13 సింగిల్ స్టోరేజీ ఆప్షన్ తో వచ్చింది.

Moto G13, Moto G23 స్మార్ట్ ఫోన్లు ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వచ్చాయి. రియర్ ప్యానెల్స్ ప్లాస్టిక్ బాడీతో వచ్చాయి. రెండు ఫోన్లు కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చాయి. సరే, ఓసారి Moto G13, Moto G23 ఫోన్ల ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto G13, Moto G23 ధర, స్పెసిఫికేషన్స్

Moto G13 సింగిల్ స్టోరేజీలో మాత్రమే లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర 179 యూరోలు (సుమారు రూ.15,900). Moto G13 ఫోన్ మ్యాట్ చార్‌కోల్, బ్లూ లావెండర్, రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G23 స్మార్ట్ ఫోన్ 4జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 199 యూరోలు (సుమారు రూ.17,600). 8జిబి ర్యామ్ వేరియంట్ ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. మ్యాట్ చార్‌కోల్, పెర్ల్ వైట్, స్టీల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

హార్డ్‌వేర్ విషయానికి వస్తే, రెండు ఫోన్లు కూడా ఒకేరకమైన డిస్ప్లే, బ్యాటరీ కెపాసిటీ, రియర్ కెమెరా సెటప్, ప్రాసెసర్ తో వచ్చాయి. Moto G13, Moto G23 ఫోన్లు 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హోల్-పంచ్ కటౌట్ తో వచ్చాయి. వీటిలో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ డిస్ప్లే, మందపాటి బాటమ్ బెజెల్ ఉన్నాయి.

Moto G13, Moto G23 ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. ఇంకా పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. Moto G13 ఫోన్ 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రాగా, Moto G23 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

ఈ రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. Moto G13, Moto G23 ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమీరీ కెమెరా, 5ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.

Moto G23 స్మార్ట్ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వగా, Moto G13 లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. త్వరలోనే ఈ డివైజెస్ యూరోప్ లో లాంచ్ కానున్నాయి. తర్వాత లాటిన్ అమెరికా, ఆసియా లో లాంచ్ కానున్నాయి. ఇండియా లాంచ్ తేదీకి సంబంధించి ఇంతవరకు ఎటువంటి ప్రకటన రాలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో లాంచైన Moto G13, Moto G23 first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Moto G13 స్మార్ట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/motorola-moto-g13-india-launch-timeline/ Tue, 06 Dec 2022 13:58:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=3843 హైలైట్స్ త్వరలో కొత్త మిడ్‌రేంజ్ జీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న మోటోరోలా Moto G13 పేరుతో లాంచ్ కానున్న కొత్త డివైజ్ లాంచ్ కి ముందు NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ తో పాటు, భారతీయ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Moto G13 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G13 అనే మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ని […]

The post త్వరలో లాంచ్ కానున్న Moto G13 స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో కొత్త మిడ్‌రేంజ్ జీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న మోటోరోలా
  • Moto G13 పేరుతో లాంచ్ కానున్న కొత్త డివైజ్
  • లాంచ్ కి ముందు NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ తో పాటు, భారతీయ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Moto G13

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G13 అనే మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ని మోటోరోలా ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. అయితే బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ తో పాటు పలు సర్టిఫికేషన్స్ వెబ్ సైట్స్ లో ఈ డివైజ్ దర్శనమిచ్చింది. దీంతో ఈ డివైజ్ లాంచ్ పై క్లారిటీ వచ్చినట్లైంది. Moto G13 ఒక 4జీ డివైజ్ అని సర్టిఫికేషన్ లిస్టింగ్స్ ద్వారా ఖరారైంది.

BIS సర్టిఫికేషన్ పొందిన Moto G13

Motorola Moto G13 స్మార్ట్ ఫోన్ ని బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై తొలుత టిప్‌స్టర్ ముకుల్ శర్మ గుర్తించారు. ఇకపోతే రీసెంట్ గా ఈ డివైజ్ థాయ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్ పేరేంటో తెలిసింది. బీఐఎస్ లిస్టింగ్ ద్వారా త్వరలో Moto G13 భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది. భారత్ లో ఈ 4జీ ఫోన్ ధర రూ.15,000 గా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ లో చక్కటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Moto G13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Motorola Moto G13 స్మార్ట్ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. 5జీ లేదు కానీ ఈ డివైజ్ లో 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉండనుంది. 5జీ లేనందుకు ఇదొక ఊరటనిచ్చే విషయం. ఇక ఈ డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ లేదా స్నాప్ డ్రాగన్ 732జి చిప్సెట్ తో లాంచ్ కానుంది. రెడ్మీ కంపెనీ త్వరలో లాంచ్ చేయబోవు Redmi Note 12 Pro 4G ఫోన్ కూడా స్నాప్ డ్రాగన్ 732జి ప్రాసెసర్ ని కలిగి ఉంటుందని సమాచారం.

ఇక బ్యాటరీ విభాగానికి వస్తే, Motorola Moto G13 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. Moto G13 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Moto G13 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

Moto G13 డివైజ్ 2023 మొదటి త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత్ లో 2023 జనవరిలో Motorola Moto G13 మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో లాంచ్ కానున్న Moto G13 స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>