New Phones - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 05 Jan 2024 17:33:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 8+ Gen 1 చిప్సెట్‌తో చైనా లాంచైన Honor X50 GT https://www.91mobiles.com/telugu/honor-x50-gt-launched-china-with-snapdragon-8-plus-gen-1-chipset/ Fri, 05 Jan 2024 05:44:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=9573 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor చైనాలో తాజాగా ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Honor X50 GT పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1200 నిట్స్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి Honor X50 GT యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. […]

The post Snapdragon 8+ Gen 1 చిప్సెట్‌తో చైనా లాంచైన Honor X50 GT first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో విడుదలైన Honor X50 GT
  • కర్వ్డ్ అమోలెడ్ 1.5కే డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Honor X50 GT ప్రారంభ ధర 2,199 యువాన్లు

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor చైనాలో తాజాగా ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Honor X50 GT పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1200 నిట్స్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి Honor X50 GT యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Honor X50 GT ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

  • Honor X50 GT స్మార్ట్‌ఫోన్ 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి, 16జిబి + 512జిబి మరియు 16జిబి + 1టిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • Honor X50 GT 12జిబి+256జిబి మోడల్ ధరను 2,199 యువాన్లు (సుమారు రూ.26,169) గా నిర్ణయించారు.
  • Honor X50 GT 16జిబి+256జిబి మోడల్ ధర 2,399 యువాన్లు (సుమారు రూ.28,560) గా ఉంది.
  • Honor X50 GT 16జిబి+512జిబి వేరియంట్ ధర 2,599 యువాన్లు (సుమారు రూ.30,940) గా ఉంది.
  • Honor X50 GT 16జిబి+1టిబి టాప్ వేరియంట్ ధరను 2,899 యువాన్లు (సుమారు రూ.33,910) గా నిర్ణయించారు.
  • Honor సంస్థ ఫస్ట్ సేల్ లో భాగంగా 200 యువాన్లు (సుమారు రూ.3,570) పరిమితకాల డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది.
  • Honor X50 GT డివైజ్ చైనాలో జనవరి 9 నుంచి రిటైల్ ప్లాట్ఫామ్స్ ద్వారా సేల్ కి వస్తోంది.

Honor X50 GT స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor X50 GT లో 6.78-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే (2562*1200 పిక్సెల్స్) రెజుల్యూషన్, 19:9:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 92.85 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 1920 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గేముత్, హెచ్డీఆర్ 10, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X50 GT లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 730 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X50 GT డివైజ్ 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X50 GT డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X50 GT లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 ప్రైమరీ సెన్సర్, 2ఎంపి డెప్త్ లెన్స్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor X50 GT లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Honor X50 GT లో 163.6 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 7.98 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.
  • సెక్యూరిటీ: Honor X50 GT లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Honor X50 GT లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్/గ్లొనాస్/బైడూ/గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post Snapdragon 8+ Gen 1 చిప్సెట్‌తో చైనా లాంచైన Honor X50 GT first appeared on 91Mobiles Telugu.

]]>