Nithiin - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 16 Aug 2022 16:00:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 మాచర్ల నియోజకవర్గం OTT అప్డేట్ https://www.91mobiles.com/telugu/nithiin-macherla-niyojakavargam-movie-ott-update/ Tue, 16 Aug 2022 16:00:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=1712 హైలైట్స్: ఆగస్టు 12 న విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రధాన పాత్రలు పోషించిన నితిన్, కృతీశెట్టి, కేథరిన్ ట్రెసా. విలన్ గా చేసిన ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకుడిగా పరిచయమైన ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ అయిన రోజు నుంచి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడం బాధాకరం. నితిన్ తన ఆశలన్నీ ఈ […]

The post మాచర్ల నియోజకవర్గం OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 12 న విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమా
  • ప్రధాన పాత్రలు పోషించిన నితిన్, కృతీశెట్టి, కేథరిన్ ట్రెసా. విలన్ గా చేసిన ప్రముఖ నటుడు సముద్రఖని
  • దర్శకుడిగా పరిచయమైన ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి

నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ అయిన రోజు నుంచి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడం బాధాకరం. నితిన్ తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలని తపించిన నితిన్ కు చివరకు నిరాశే ఎదురైంది. ఇదివరకే ఫ్లాపులతో విసిగిపోయిన నితిన్, ఈ డిజాస్టర్ తో పూర్తిగా ఢీలా పడిపోయాడు. అయితే మొదటిరోజు వసూళ్ళు పర్వాలేదనిపించినా, తర్వాత నెగటివ్ టాక్ విపరీతంగా వ్యాపించడంతో, రెండో రోజు నుంచి సినిమా చాలా నెమ్మదించింది. పక్కా రొటీన్ మాస్ మసాలా చిత్రమని, కొత్తదనం లేదని పలువురు సినిమాపై పెదవి విరిచారు.

బింబిసార, సీతారామం సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమై దిగ్విజయంగా ప్రదర్శింపబడుతున్నాయి. ఈ సందర్భంలో విడుదలైన నితిన్ సినిమా మాచర్ల నియోజకవర్గం పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఈ సినిమా అతి త్వరలో ఓటీటీ లో ప్రసారమవుతుందని మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ హక్కులను కైవసం చేసుకున్నట్లు సమాచారం. మాచర్ల నియోజకవర్గం చిత్రాన్ని సెప్టెంబర్ 9 న ప్రసారం చేయాలని సదరు ఓటీటీ సంస్థ భావిస్తోందట.

చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ట్వీట్స్ వివాదం

ఎడిటర్ నుంచి దర్శకుడిగా మారిన రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన ట్వీట్స్ మూలంగా సినిమా చిక్కుల్లో ఇరుక్కుంది. రెండు కులాలని కించపరుస్తూ రాజశేఖర్ రెడ్డి ట్వీట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదంతా అసత్యపు ప్రచారమని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజశేఖర్ రెడ్డి సైబర్ కేసు కూడా పెట్టాడు. ఇక నితిన్ కూడా ఈ విషయమై వివరణ ఇస్తూ ట్వీట్ చేసినా ఫలితం లేకుండా పోయింది.

తారాగణం, సాంకేతిక బృందం:

మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్, కృతిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. కేథరిన్ ట్రెసా రెండో కథానాయికగా చేసింది. వెన్నెల కిశోర్, మురళీశర్మ, రాజేంద్రప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నటి అంజలి ఐటమ్ సాంగ్ లో మెరిసింది. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మాచర్ల నియోజకవర్గం సినిమా వసూళ్ళు

హీరో నితిన్ నటించిన యాక్షన్ డ్రామా, మాచర్ల నియోజకవర్గం చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఆగస్టు 12న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజునే పేలవమైన టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నాయి. కానీ తర్వాత ఘోరంగా పడిపోయాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, నాలుగు రోజుల ఎక్స్‌టెండెడ్ వీకెండ్ ముగిసేనాటికి రూ.9.05 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేకీవెన్ సాధించాలంటే ఈ చిత్రం ఇంకా రూ.9.95 కోట్లను రాబట్టాల్సి ఉంది.

The post మాచర్ల నియోజకవర్గం OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>