Noise Pop Buds - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 03 May 2024 18:32:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో భారత్‌లో లాంచైన Noise Pop Buds https://www.91mobiles.com/telugu/noise-pop-buds-launched-in-india-with-50-hours-battery-life/ Fri, 03 May 2024 18:29:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=11352 Noise Pop Buds వైర్లెస్ ఇయర్‌బడ్స్ భారత్‌లో లాంచ్ అయ్యాయి. ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ నాయిస్ క్యాన్సలేషన్ (ఈఎన్‌సీ) ఫీచర్ తో వచ్చాయి. అంతేకాదు, ఈ బడ్స్ 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ని కలిగి ఉంటాయి. ఇంకా క్వాడ్ మైక్ సెటప్ ఈ బడ్స్ లో ఉంది. ఈ టీడబ్ల్యూఎస్ ధరను భారత్ లో రూ.1,000 లోపే పెట్టారు. అంటే తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు ఉన్న ఇయర్ బడ్స్ కొనాలని చూసే […]

The post 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో భారత్‌లో లాంచైన Noise Pop Buds first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Noise Pop Buds లాంచ్
  • 50 గంటల బ్యాటరీ లైఫ్, ఈఎన్‌సీ
  • ఐపీఎక్స్4 రేటింగ్‌తో వచ్చిన బడ్స్

Noise Pop Buds వైర్లెస్ ఇయర్‌బడ్స్ భారత్‌లో లాంచ్ అయ్యాయి. ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ నాయిస్ క్యాన్సలేషన్ (ఈఎన్‌సీ) ఫీచర్ తో వచ్చాయి. అంతేకాదు, ఈ బడ్స్ 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ని కలిగి ఉంటాయి. ఇంకా క్వాడ్ మైక్ సెటప్ ఈ బడ్స్ లో ఉంది. ఈ టీడబ్ల్యూఎస్ ధరను భారత్ లో రూ.1,000 లోపే పెట్టారు. అంటే తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు ఉన్న ఇయర్ బడ్స్ కొనాలని చూసే వారికి Noise Pop Buds సరైన ఆప్షన్ అవ్వవచ్చు. సరే, ఓసారి Noise Pop Buds యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ధర వివరాలను తెలుసుకుందాం.

భారత్ లో Noise Pop Buds ధర, లభ్యత

భారత్ లో Noise Pop Buds ధరను రూ.999 గా నిర్ణయించారు. ఈ బడ్స్ ని ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మరియు Noise India వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Noise Pop Buds ఇయర్‌బడ్స్‌ని ఫారెస్ట్ పాప్, లైలాక్ పాప్, మూన్ పాప్ మరియు స్టీల్ పాప్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Noise Pop Buds స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Noise Pop Buds ఇయర్‌బడ్స్ 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ని అందిస్తాయని కంపెనీ చెబుతోంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 90 నిమిషాల సమయం పడుతుంది. ఇన్‌స్టాఛార్జ్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే బడ్స్‌ని 150 నిమిషాల వరకు వాడుకోవచ్చు.

Noise Pop Buds ఇయర్‌బడ్స్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ (ENC) ఫీచర్ తో వచ్చాయి. దీని ద్వారా బ్యాగ్రౌండ్ నాయిస్ ని తగ్గడంతో కాల్స్ నాణ్యత పెరుగుతుంది.

Noise Pop Buds 10ఎంఎం డ్రైవర్స్, నాలుగు మైకులు, 65 మిల్లీ సెకన్స్ లో-లేటెన్సీని కలిగి ఉన్నాయి.

ఇంకా Noise Pop Buds బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, హైపర్ సింక్ ఫీచర్ తో వచ్చాయి. బ్లూటూత్ రేంజ్ 10 మీటర్లు.

The post 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో భారత్‌లో లాంచైన Noise Pop Buds first appeared on 91Mobiles Telugu.

]]>