Nokia 105 Classic - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 26 Oct 2023 16:51:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 UPI సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Nokia 105 Classic; ధర రూ.999 మాత్రమే! https://www.91mobiles.com/telugu/nokia-105-classic-launched-india-price-specs-availability/ Thu, 26 Oct 2023 16:51:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=8541 మొబైల్ ఫోన్ తయారీదారు Nokia భారత్ లో నేడు Nokia 105 Classic అనే ఫీచర్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.999 మాత్రమే. మరో విషయం ఏంటంటే, Nokia 105 Classic డివైజ్ యూపీఐ సపోర్ట్ తో వస్తోంది. అంటే ఈ ఫోన్ ద్వారా నగదు చెల్లింపులు జరపవచ్చు. ఈ ఫీచర్ Nokia 105 Classic లో హైలైట్ గా నిలుస్తోంది. సరే, ఈ కీప్యాడ్ ఫోన్ ధర మరియు ఫీచర్లు […]

The post UPI సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Nokia 105 Classic; ధర రూ.999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Nokia 105 Classic
  • Nokia 105 Classic ప్రారంభ ధర రూ.999
  • యూపీఐ సపోర్ట్, ఎఫ్ఎమ్ రేడియోతో వచ్చిన డివైజ్

మొబైల్ ఫోన్ తయారీదారు Nokia భారత్ లో నేడు Nokia 105 Classic అనే ఫీచర్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.999 మాత్రమే. మరో విషయం ఏంటంటే, Nokia 105 Classic డివైజ్ యూపీఐ సపోర్ట్ తో వస్తోంది. అంటే ఈ ఫోన్ ద్వారా నగదు చెల్లింపులు జరపవచ్చు. ఈ ఫీచర్ Nokia 105 Classic లో హైలైట్ గా నిలుస్తోంది. సరే, ఈ కీప్యాడ్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Nokia 105 Classic ధర, లభ్యత

భారత్ లో Nokia 105 Classic ఫీచర్ ఫోన్ రూ.999 కే లభించనుంది. ఇది ప్రారంభ ధర మాత్రమే. అంటే ఈ ధరలో సింగిల్ సిమ్ మోడల్ ని కొనుగోలు చేయవచ్చు. డ్యూయల్ సిమ్ మోడల్, చార్జర్ తో మరియు చార్జర్ లేకుండా.. ఇలా విభిన్న వేరియంట్స్ లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అయితే వీటి ధరలను ఇంకా కంపెనీ ప్రకటించలేదు.

Nokia 105 Classic ఫీచర్ ఫోన్ ని చార్కోల్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. హెచ్ఎండి గ్లోబల్ సంస్థ ఈ ఫోన్ పై ఒక ఏడాది రీప్లేస్మెంట్ గ్యారంటీని ఆఫర్ చేస్తోంది. ఇకపోతే ఈ డివైజ్ ని నోకియా ఈ-సైట్, నోకియా.కామ్, ఆఫ్‌లైన్ స్టోర్స్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Nokia 105 Classic ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • యూపీఐ123 పే: Nokia 105 Classic ఫోన్ లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లేకుండా డబ్బును పంపడం లేదా పొందడం ఈ ఫోన్ ద్వారా సాధ్యమవుతుంది.
  • బ్యాటరీ: Nokia 105 Classic లో పవర్ బ్యాకప్ కోసం 800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి చార్జ్ చేస్తే కొన్ని రోజుల పాటు ఫోన్ నడుస్తుందని కంపెనీ చెబుతోంది.
  • వేరియంట్స్: Nokia 105 Classic డివైజ్ సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్ మోడల్స్ లో లభిస్తుంది.
  • కనెక్టివిటీ: Nokia 105 Classic లో ఎఫ్ఎమ్ రేడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. వైర్లెస్ గా ఎఫ్ఎమ్ రేడియోని వాడుకునే వీలుంది.
  • గ్యారంటీ: Nokia 105 Classic ఫీచర్ ఫోన్ పై ఒక ఏడాది రీప్లేస్మెంట్ గ్యారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఫోన్ లో ఏదైనా లోపం ఉంటే, కంపెనీ కస్టమర్లకు కొత్త ఫోన్ ని అందిస్తుంది.

Nokia 105 Classic కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ని కంపెనీ ఇంకా షేర్ చేయలేదు.

The post UPI సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Nokia 105 Classic; ధర రూ.999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>