Nokia 2660 Flip - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 31 Jul 2024 16:09:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HMD Barbie flip ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-launch-date-confirmed-teaser-released/ https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-launch-date-confirmed-teaser-released/#respond Wed, 31 Jul 2024 16:09:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=12764 HMD బ్రాండ్ తన డివైజెస్‌ను గ్లోబల్ మార్కెట్ తో పాటు భారత్ లో కూడా విస్తరించే పనిలో నిమగ్నమైంది. ఇటీవలె హెచ్ఎండి సంస్థ భారత్ లో HMD Crest, Crest Max అనే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తన గ్లోబల్ సోషల్ మీడియా హ్యాండిల్ పై కొత్త ఫోన్ HMD Barbie flip యొక్క లాంచ్ వివరాలను షేర్ చేసింది. అలాగే డివైజ్ గ్లిమ్స్ ను కూడా టీజర్ లో రివీల్ చేసింది. ఓసారి ఆ […]

The post HMD Barbie flip ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో HMD Barbie flip లాంచ్
  • ఆగస్టు 28న లాంచ్
  • Nokia 2660 flip లాగా కనిపిస్తోన్న ఫోన్

HMD బ్రాండ్ తన డివైజెస్‌ను గ్లోబల్ మార్కెట్ తో పాటు భారత్ లో కూడా విస్తరించే పనిలో నిమగ్నమైంది. ఇటీవలె హెచ్ఎండి సంస్థ భారత్ లో HMD Crest, Crest Max అనే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తన గ్లోబల్ సోషల్ మీడియా హ్యాండిల్ పై కొత్త ఫోన్ HMD Barbie flip యొక్క లాంచ్ వివరాలను షేర్ చేసింది. అలాగే డివైజ్ గ్లిమ్స్ ను కూడా టీజర్ లో రివీల్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

HMD Barbie flip ఫోన్ లాంచ్ తేదీ

HMD Barbie flip ఫోన్ వివరాలను సోషల్ మీడియా వేదిక X పై సదరు సంస్థ షేర్ చేసింది. ఆగస్టు 28న ఫోన్ లాంచ్ కానుందని తన పోస్ట్ లో హెచ్ఎండి కంపెనీ తెలిపింది. ఇమేజ్ లో డివైజ్ కూడా కనిపిస్తోంది.

HMD Barbie flip ఫోన్ బ్రైట్ పింక్ బోర్డర్ తో కనిపిస్తోంది. దాంతో పాటు, హెచ్ఎండి బ్రాండింగ్ కూడా ఉంది.

HMD Barbie flip కి సంబంధించి ఇప్పటివరకు పెద్దగా వివరాలేమీ తెలియలేదు. అయితే ఇది ఫీచర్ ఫోన్ అని అంచనా వేస్తున్నారు. చూడటానికి, Nokia 2660 flip మాదిరి కనిపిస్తోంది.

Nokia 2660 flip డీటెయిల్స్

Nokia 2660 flip ఫోన్ లో 2.8-ఇంచ్ క్యూవీజీఏ డిస్ప్లే, 1.77-ఇంచ్ క్యూవీజీఏ సెకండరీ డిస్ప్లే ఉన్నాయి.

Nokia 2660 flip డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ107 చిప్సెట్ వాడారు.

Nokia 2660 flip లో 0.3ఎంపి కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 4.2, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రోయూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.

Nokia 2660 flip ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 48ఎంబి ర్యామ్, 128ఎంబి ఇంటర్నల్ స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 32జిబి వరకు పెంచుకునే వీలుంది. Nokia 2660 flip ధర రూ.4,299 గా ఉంది.

The post HMD Barbie flip ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-launch-date-confirmed-teaser-released/feed/ 0
డ్యూయల్ స్క్రీన్స్ తో లాంచ్ అయిన Nokia ఫోన్ https://www.91mobiles.com/telugu/nokia-2660-flip-launched-india-price-specs-availability/ Mon, 05 Sep 2022 05:38:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=2085 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన నోకియా 2660 ఫ్లిప్ ఫీచర్ ఫోన్ బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభ్యం కానున్న ఫోన్: నోకియా వెబ్‌సైట్ ద్వారా లభ్యం 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, 1.77 అంగుళాల కవర్ ప్యానెల్ కలిగి ఉన్న నోకియా 2660 ఫ్లిప్ హెచ్ఎండీ గ్లోబల్ బ్రాండ్ అయిన నోకియా భారత్ లో కొత్త ఫీచర్ ఫోన్ నోకియా 2660 ఫ్లిప్ ని లాంచ్ చేసింది. ఫీచర్ ఫోన్ మార్కెట్ […]

The post డ్యూయల్ స్క్రీన్స్ తో లాంచ్ అయిన Nokia ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన నోకియా 2660 ఫ్లిప్ ఫీచర్ ఫోన్
  • బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభ్యం కానున్న ఫోన్: నోకియా వెబ్‌సైట్ ద్వారా లభ్యం
  • 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, 1.77 అంగుళాల కవర్ ప్యానెల్ కలిగి ఉన్న నోకియా 2660 ఫ్లిప్

హెచ్ఎండీ గ్లోబల్ బ్రాండ్ అయిన నోకియా భారత్ లో కొత్త ఫీచర్ ఫోన్ నోకియా 2660 ఫ్లిప్ ని లాంచ్ చేసింది. ఫీచర్ ఫోన్ మార్కెట్ లో ఈ ఫోన్ సదరు కంపెనీ స్థానాన్ని మరింత బలపరచనుంది. 2022 రెండో త్రైమాసికం వరకు ఫీచర్ ఫోన్ అమ్మకాల్లో నోకియా రెండో స్థానంలో ఉంది. నోకియా 2660 ఫ్లిప్, పేరులో ఉన్నట్లుగానే, నిలువుగా మడతబెట్టే ఫోన్. ఓ చిన్న కవర్ డిస్ప్లే ఈ ఫోన్ పైన ఉంటుంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని చూసుకోవచ్చు. అలాగే 2.8 అంగుళాల క్యూవీజీఏ మెయిన్ డిస్ప్లే లోపల ఉంటుంది. కాగా, యూనిసాక్ టీ107 4జీ చిప్సెట్ ని ఇందులో అమర్చారు. 1450 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

భారత్ లో Nokia 2660 Flip ధర, లభ్యత వివరాలు

నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ ధర భారత్ లో రూ.4699 గా ఉంది. కొనాలనే ఆసక్తి ఉన్నవారు రిటైల్ స్టోర్స్, నోకియా అధికార వెబ్ సైట్, ఈ-కామర్స్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.

Nokia 2660 Flip స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

నోకియా 2660 ఫ్లిప్ ఫోన్లో 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, 1.77 అంగుళాల కవర్ ప్యానెల్ ఉన్నాయి. ఈ కవర్ ప్యానెల్ టచ్ స్క్రీన్ కాదు, కానీ దీని ద్వారా టైమ్, డేట్, మిగతా అలర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఫోన్లో యూనిసాక్ టీ107 చిప్సెట్, 1450ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ 20 రోజుల స్టాండ్ బై టైమ్ కలిగి ఉంటుందని నోకియా చెబుతోంది. నోకియా 2660 ఫ్లిప్ లో 48ఎంబి ర్యామ్, 128ఎంబి స్టోరేజీ, 32జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ ఉన్నాయి.

నోకియా 2660 ఫ్లిప్ లో వీజీఏ 0.3 ఎంపి సింగిల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్, మైక్రో యూఎబీ 2.0 పోర్ట్, బ్లూటూత్ 4.2, 2.75వాట్ చార్జింగ్ సపోర్ట్, ఎస్30+ ఓఎస్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఈ నోకియా ఫీచర్ ఫోన్ సీనియర్ సిటిజన్లకు ఎంతో ఉత్తమమైనది. ఎందుకంటే ఇందులో హియరింగ్ ఎయిడ్ కంపాటిబిలిటీ, నేవిగేషన్ కొరకు టాక్టైల్ బటన్స్, స్క్రీన్ ని తేలికగా చదివేందుకు జూమ్-ఇన్ ఇంటర్ఫేస్, టీ9 కీబోర్డ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ పై ఎవరైనా టైప్ చేస్తే, క్రిస్టల్ క్లియర్ సౌండ్ వినిపిస్తోంది. ఇక ఈ ఫోన్ వినోదం కొరకు ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్ లను కలిగి ఉంది.

లేటెస్ట్ మొబైల్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post డ్యూయల్ స్క్రీన్స్ తో లాంచ్ అయిన Nokia ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
రెండు డిస్ప్లేలతో లాంచ్ అయిన Nokia 2660 Flip https://www.91mobiles.com/telugu/nokia-2660-flip-launched-china-price-specs/ Wed, 10 Aug 2022 07:16:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=1600 హైలైట్స్: నోకియా 2660 ఫ్లిప్ ని లాంచ్ చేసిన నోకియా కంపెనీ నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ ధర 429 యువాన్లు (దాదాపు రూ.5876) భారత్ లో ఫోన్ లభ్యతపై ఇంకా రాని స్పష్టత నోకియా 2660 ఫ్లిప్ చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను 499 యువాన్లు గా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.5876. అయితే ప్రస్తుతం ఆఫర్ తో ఈ ఫోన్ 429 యువాన్లు (రూ.5052) కి లభిస్తోంది. […]

The post రెండు డిస్ప్లేలతో లాంచ్ అయిన Nokia 2660 Flip first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నోకియా 2660 ఫ్లిప్ ని లాంచ్ చేసిన నోకియా కంపెనీ
  • నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ ధర 429 యువాన్లు (దాదాపు రూ.5876)
  • భారత్ లో ఫోన్ లభ్యతపై ఇంకా రాని స్పష్టత

నోకియా 2660 ఫ్లిప్ చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను 499 యువాన్లు గా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.5876. అయితే ప్రస్తుతం ఆఫర్ తో ఈ ఫోన్ 429 యువాన్లు (రూ.5052) కి లభిస్తోంది. ఇక ఈ ఫోన్ భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా స్పష్టత లేదు. చాలా రోజుల తర్వాత నోకియా కంపెనీ నుంచి ఫ్లిప్ ఫోన్ రావడం విశేషం. ఈ ఫోన్ నోకియా ఏలిన మునుపటి రోజులను గుర్తు తెస్తోంది.

Nokia 2660 Flip స్పెసిఫికేషన్స్

నోకియా 2660 ఫ్లిప్ యొక్క ఫీచర్లను గురించి తెలుసుకుందాం. 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే ను కలిగి ఉంది. 240*320 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఇందులో ఉంది. ఈ ఫోన్లో 1.77 అంగుళాల సెకండరీ క్యూవీజీఏ డిస్ప్లే ఉండటం విశేషం. దీని రెజుల్యూషన్ 120*160 పిక్సెల్స్. యూనిసాక్ టీ107 ప్రాసెసర్ ను ఈ ఫోన్ లో ఉపయోగించారు.

ఇప్పుడు ర్యామ్, స్టోరేజీ వివరాలు చూద్దాం. ఈ ఫోన్లో 48ఎంబి ర్యామ్, 128ఎంబి స్టోరేజీని అందించారు. ఈ ఫోన్లో 0.3 మెగాపిక్సెల్/వీజీఏ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ అందించారు. బ్లూటూత్ 4.2, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రో యూఎస్‌బి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. నోకియా 2660 ఫ్లిప్ లో 2.75 వాట్-అవర్ రిమూవబుల్ బ్యాటరీ ఉన్నాయి. 20 గంటల వరకు బ్యాటరీ లైఫ్, 26.6 రోజుల స్టాండ్ బై టైమ్ ని ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు కంపెనీ చెబుతోంది.

ఇప్పుడు సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకుందాం. ఐసీఈ ఎమర్జెన్సీ కాల్ సిస్టమ్ ఈ ఫోన్లో ఉంది. ఈ ఫోన్ పొడవు 18.9ఎంఎం, వెడల్పు 108ఎంఎం, మందం 55ఎంఎం, బరువు 123 గ్రాములు.

నోకియా ఇటీవలె భారత్ లో Nokia 8210 4G ఫీచర్ ఫోన్ ని లాంచ్ చేసింది. 27 రోజుల బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. దృఢమైన బాడీ, ఎక్కువ రోజులు నడిచే బ్యాటరీ తో వచ్చిన ఈ ఫీచర్ ఫోన్ 1999 లో నోకియా నుంచి వచ్చిన నోకియా 8210 మోడల్ కి ఇది లేటెస్ట్ వర్షన్. పాత మోడల్ లో 2జీ నెట్వర్క్ మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, లేటెస్ట్ మోడల్ లో 4జీ కనెక్టివిటీ ఉంది. ఇక ఫోన్ యొక్క ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఫోన్ లో యూనిసాక్ టీ107 చిప్సెట్ ను అమర్చారు. 48ఎంబి ర్యామ్ ఉంటుంది. దీంతో పాటు, ఫోన్లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది.

ఈ ఫోన్ ని మీరు రూ.3,999 కి కొనుగోలు చేయవచ్చు. డార్క్ బ్లూ, రెడ్ షేడ్స్ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ కాకుండా, నోకియా స్టోర్ నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ పై కంపెనీ, ఒక సంవత్సరం రీప్లేస్మెంట్ గ్యారంటీని ఇస్తోంది.

The post రెండు డిస్ప్లేలతో లాంచ్ అయిన Nokia 2660 Flip first appeared on 91Mobiles Telugu.

]]>