Nokia 2780 Flip - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Nov 2022 12:48:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 215 చిప్, డ్యూయల్ డిస్ప్లేతో లాంచ్ అయిన Nokia 2780 Flip ఫీచర్ ఫోన్ https://www.91mobiles.com/telugu/nokia-2780-flip-feature-phone-launched-usa-price-specs/ Fri, 04 Nov 2022 12:48:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=3249 హైలైట్స్ యూఎస్ లో లాంచ్ అయిన Nokia 2780 Flip ఫీచర్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 215 చిప్సెట్ తో వచ్చిన Nokia 2780 Flip డ్యూయల్ డిస్ప్లే, ఎఫ్ఎం రేడియో, 4జిబి ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు Nokia 2780 Flip ఫోన్ అధికారికంగా లాంచ్ అయ్యింది. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ఈ కొత్త నోకియా ఫీచర్ ఫోన్ ని యూఎస్ లో లాంచ్ చేసింది. Nokia 2780 Flip ఫీచర్ ఫోన్ గతంలో […]

The post Snapdragon 215 చిప్, డ్యూయల్ డిస్ప్లేతో లాంచ్ అయిన Nokia 2780 Flip ఫీచర్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • యూఎస్ లో లాంచ్ అయిన Nokia 2780 Flip ఫీచర్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 215 చిప్సెట్ తో వచ్చిన Nokia 2780 Flip
  • డ్యూయల్ డిస్ప్లే, ఎఫ్ఎం రేడియో, 4జిబి ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

Nokia 2780 Flip ఫోన్ అధికారికంగా లాంచ్ అయ్యింది. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ఈ కొత్త నోకియా ఫీచర్ ఫోన్ ని యూఎస్ లో లాంచ్ చేసింది. Nokia 2780 Flip ఫీచర్ ఫోన్ గతంలో వచ్చిన నోకియా 2760 కి అప్‌గ్రేడెడ్ వర్షన్. Nokia 2780 Flip లో రెండు స్క్రీన్స్ ఉండటం విశేషం. ఈ ఫ్లిప్ ఫోన్ లో ఎఫ్ఎం రేడియో ఫీచర్ ఉంది. ఈ డివైజ్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయితే ఇది ఫోల్డబుల్ స్క్రీన్ తో రావడం లేదు. సంప్రదాయ హాఫ్-స్క్రీన్-హాఫ్-కీబోర్డ్ డిజైన్ తో వస్తోంది. అయితే ఈ ఫోన్ లో రెండు డిస్ప్లేస్ ఉన్నాయి. ఒక డిస్ప్లే బయటవైపు, మరొకటి లోపల వైపు ఉంటుంది.

Nokia 2780 Flip ఫీచర్ ఫోన్ ఇంకా భారత్ కి రావాల్సి ఉంది. హెచ్ఎండీ గ్లోబల్ ఇంకా ఇండియా లాంచ్ వివరాలను ప్రకటించలేదు. ఈలోపు Nokia 2780 Flip యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia 2780 Flip ధర మరియు స్పెసిఫికేషన్స్

Nokia 2780 Flip యూఎస్ లో 89.99 డాలర్ల ధరతో లాంచ్ అయ్యింది. అంటే సుమారు రూ.7,400. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 512ఎంబి స్టోరేజీని కలిగి ఉంది. ఈ డివైజ్ రెడ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. నవంబర్ 15 నుంచి యూఎస్ లో Nokia 2780 Flip ఫోన్ సేల్ కి వస్తోంది.

Nokia 2780 Flip లో 2.7-ఇంచ్ టీఎఫ్‌టీ డిస్ప్లే లోపల వైపు ఉంది. ప్యానెల్ పైన 1.77-ఇంచ్ డిస్ప్లే ఉంది. కవర్ డిస్ప్లే పైన 5 మెగా పిక్సెల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Nokia 2780 Flip లో స్నాప్ డ్రాగన్ 215 చిప్సెట్ వాడారు. ఇదే చిప్సెట్ జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ లో కూడా వినియోగించారు. ఇదొక క్వాడ్ కోర్ సీపీయూ. ఈ చిప్ 1.3 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. Nokia 2780 Flip లో 5జీ సపోర్ట్ లేదు. అయితే వోల్టీ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ లో రియల్ టైమ్ టెక్ట్సింగ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా యూజర్లు కాల్ లో ఉన్నప్పుడే మెసేజెస్ పంపుకునే అవకాశం ఉంటుంది.

Nokia 2780 Flip లో 512ఎంబి స్టోరేజీ అందించారు. మెమొరీ కార్డ్ ద్వారా 32జిబి వరకు స్టోరేజీని పెంచుకునే అవకాశం ఉంది. Nokia 2780 Flip ఫోన్ లో 1450 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ అందించారు. 4జీ కనెక్షన్ పై ఫోన్ 18 రోజుల స్టాండ్ బై టైమ్ ని అందిస్తుందని నోకియా చెబుతోంది. Nokia 2780 Flip లో బ్లూటూత్ 4.2, వైఫై, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 215 చిప్, డ్యూయల్ డిస్ప్లేతో లాంచ్ అయిన Nokia 2780 Flip ఫీచర్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>