Nokia C12 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 13 Mar 2023 10:36:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.5,999 ధరతో భారత్‌లో లాంచైన Nokia C12 స్మార్ట్‌ఫోన్ https://www.91mobiles.com/telugu/nokia-c12-launched-india-price-specs-availability/ Mon, 13 Mar 2023 10:36:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=5474 నోకియా సంస్థ తక్కువ బడ్జెట్ లో Nokia C12 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కొన్ని రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైంది. ఒకసారి ఈ ఫోన్ ప్రత్యేకతలు చూస్తే, 6.3-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 5 ఎంపి సెల్ఫీ కెమెరా, 3డీ ప్యాటర్న్ డిజైన్ ఇందులో ఉన్నాయి. చాలా తక్కువ ధరకి రూ.5,999 తో మార్కెట్ లోకి ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Nokia C12 యొక్క ఇతర […]

The post రూ.5,999 ధరతో భారత్‌లో లాంచైన Nokia C12 స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన లో-బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Nokia C12
  • ఇండియన్ మార్కెట్ లో Nokia C12 స్మార్ట్ ఫోన్ ధర రూ.5,999
  • యూనిఎస్ఓసీ 9863ఏ1 ప్రాసెసర్ తో వచ్చిన Nokia C12

నోకియా సంస్థ తక్కువ బడ్జెట్ లో Nokia C12 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కొన్ని రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైంది. ఒకసారి ఈ ఫోన్ ప్రత్యేకతలు చూస్తే, 6.3-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 5 ఎంపి సెల్ఫీ కెమెరా, 3డీ ప్యాటర్న్ డిజైన్ ఇందులో ఉన్నాయి. చాలా తక్కువ ధరకి రూ.5,999 తో మార్కెట్ లోకి ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Nokia C12 యొక్క ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia C12 ధర, సేల్ వివరాలు

Nokia C12 ఫోన్ 2జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో మార్కెట్ లోకి వచ్చింది. ఈ డివైజ్ ధరను రూ.5,999 గా నిర్ణయించారు. అమెజాన్ ఇండియా ద్వారా మార్చి 17 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి. డార్క్ సైయన్, చార్కోల్ మరియు లైట్ మింట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Nokia C12 స్పెసిఫికేషన్స్

  • 6.3-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 2జిబి ర్యామ్ (2జిబి వర్చువల్ ర్యామ్) + 64జిబి స్టోరేజీ
  • యూనిఎస్ఓసీ 9863ఏ1 ప్రాసెసర్
  • 8ఎంపి మెయిన్ కెమెరా + 5ఎంపి సెల్ఫీ కెమెరా
  • 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Nokia C12 ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 1600 x 720 పిక్సెల్ రెజుల్యూషన్, 6.3-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. 1.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన యూనిఎస్ఓసీ 9863ఏ1 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. 2జిబి ర్యామ్, 2జి వర్చువల్ ర్యామ్, 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు.

ఇప్పుడు కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. Nokia C12 డివైజ్ లో 8ఎంపి మెయిన్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఇది రిమూవబుల్ బ్యాటరీ.

Nokia C12 ఆండ్రాయిడ్ గో ఎడిషన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో గూగుల్ గో యాప్స్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవి చాలా తక్కువ స్టోరేజీని తీసుకుంటాయి. Nokia C12 లో ఐపీ52 రేటింగ్ ఉంది. దీని వల్లన నీరు మరియు ధూళి నుంచి కొంతమేరకు రక్షణ లభిస్తుంది. ఈ డివైజ్ లో బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఈ ఫోన్ 177.4 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.5,999 ధరతో భారత్‌లో లాంచైన Nokia C12 స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
UniSoc ప్రాసెసర్, 3000mAh బ్యాటరీతో లాంచైన Nokia C12 https://www.91mobiles.com/telugu/nokia-c12-launched-price-specs-color-options-availability/ Thu, 19 Jan 2023 09:45:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=4561 నోకియా కంపెనీ సీ-సిరీస్ లో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దాని పేరు: Nokia C12. ఈ ఫోన్ యూరోపియన్ మార్కెట్ లో యూనిసాక్ ప్రాసెసర్ తో లాంచైంది. Nokia C12 లో భారీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 5ఎంపి కెమెరా ఉన్నాయి. Nokia C12 లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి. […]

The post UniSoc ప్రాసెసర్, 3000mAh బ్యాటరీతో లాంచైన Nokia C12 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 6.3-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే తో లాంచైన Nokia C12 స్మార్ట్ ఫోన్
  • 8ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చిన Nokia C12
  • లైట్ మింట్, డార్క్ సైయన్, చార్‌కోల్ కలార్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్

నోకియా కంపెనీ సీ-సిరీస్ లో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దాని పేరు: Nokia C12. ఈ ఫోన్ యూరోపియన్ మార్కెట్ లో యూనిసాక్ ప్రాసెసర్ తో లాంచైంది. Nokia C12 లో భారీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 5ఎంపి కెమెరా ఉన్నాయి.

Nokia C12 లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి. Nokia C12 యొక్క ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia C12 ధర, లభ్యత

Nokia C12 స్మార్ట్ ఫోన్ 2జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 110 యూరోలు (సుమారు రూ.10,500) గా ఉంది. త్వరలోనే ఈ ఫోన్ జర్మనీ, ఆస్ట్రియా దేశాల్లో అందుబాటులోకి వస్తుంది. తర్వాత ఇతర యూరోపియన్ దేశాల్లోకి కూడా ప్రవేశించనుంది. Nokia C12 ఇండియా లాంచ్ గురించి కంపెనీ నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

Nokia C12 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • 6.3-inch hd+ డిస్ప్లే
  • 60Hz రిఫ్రెష్ రేట్
  • 20:9 యాస్పెక్ట్ రేషియో
  • UniSoc SC9863A చిప్
  • 2జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ
  • ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్

Nokia C12 స్మార్ట్ ఫోన్ లో 6.3-ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ (1600*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

Nokia C12 స్మార్ట్ ఫోన్ లో యూనిసాక్ ఎస్‌సీ9863ఏ ఆక్టాకోర్ ప్రాసెసర్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ8322 జీపీయూ వినియోగించారు. 2జిబి ర్యామ్, 64జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఇందులో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా యూజర్లు మెమొరీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై పని చేస్తుంది. Nokia C12 ఫోన్ కి రెండేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి.

Nokia C12 లో 8ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.

Nokia C12 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ. 5 వాట్ చార్జింగ్ సపోర్ట్, మైక్రో యూఎస్బీ పోర్ట్ అందించారు. Nokia C12 లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

Nokia C12 ఫోన్ డార్క్ సైయన్, లైట్ మింట్, చార్‌కోల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 160.6 మిల్లీ మీటర్ల పొడవు, 74.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.75 మిల్లీ మీటర్ల మందం, 177.4 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే ఇందులో డ్యూయల్-సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లొనాస్ వంటివి ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post UniSoc ప్రాసెసర్, 3000mAh బ్యాటరీతో లాంచైన Nokia C12 first appeared on 91Mobiles Telugu.

]]>