Nokia G400 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 25 Aug 2022 12:42:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 తక్కువ ధరతో లాంచ్ అయిన Nokia G400 5G https://www.91mobiles.com/telugu/nokia-g400-5g-launch-america-price-specs/ Thu, 25 Aug 2022 12:42:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=1914 హైలైట్స్: Nokia G400 5G ఫోన్ ని లాంచ్ చేసిన హెచ్ఎండీ గ్లోబల్ నోకియా ఫోన్లలో ఇదే తక్కువ ధర కలిగిన 5జీ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, 48ఎంపి రియర్ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు Nokia స్మార్ట్ ఫోన్ లాంచ్: ప్రముఖ టెక్ కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్ కొత్త 5జీ నోకియా ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. Nokia G400 5G అనే పేరుతో […]

The post తక్కువ ధరతో లాంచ్ అయిన Nokia G400 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • Nokia G400 5G ఫోన్ ని లాంచ్ చేసిన హెచ్ఎండీ గ్లోబల్
  • నోకియా ఫోన్లలో ఇదే తక్కువ ధర కలిగిన 5జీ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, 48ఎంపి రియర్ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

Nokia స్మార్ట్ ఫోన్ లాంచ్: ప్రముఖ టెక్ కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్ కొత్త 5జీ నోకియా ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. Nokia G400 5G అనే పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ తొలుత అమెరికన్ మార్కెట్ ని పలకరించింది. Nokia G400 5G ఫోన్ 4జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, 48ఎంపి రియర్ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని ధరను రూ.20,000 గా నిర్ణయించారు.

Nokia G400 5G

Nokia G400 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ పోన్లో 20:9 యాస్పెక్ట్ రేషియో కలిగిన 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. డిస్ప్లే 1080*2408 రెజుల్యూషన్ ని కలిగి ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో స్క్రీన్ కి భద్రత కల్పించారు.

Nokia G400 5G ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్ ను ఇందులో అమర్చారు. ఈ ఫోన్లో 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. నోకియా జీ400 5జీ లో వెనుకాల 48ఎంపి ప్రైమరీ లెన్స్, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16 ఎంపి కెమెరాను అందించారు.

Nokia G400 5G లో బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. 3.5ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ ఈ ఫోన్లో ఉన్నాయి. భద్రత కొరకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇందులో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో అమర్చారు. ఈ బ్యాటరీ 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అమెరికాలో నోకియా జీ400 5జీ ఫోన్ ని మిటియోర్ గ్రే రంగులో లాంచ్ చేశారు. ఈ ఫోన్ ధర అక్కడ 239 డాలర్లు గా ఉంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.19,000.

Nokia G400 5G Specs

  • 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ ప్రాసెసర్
  • 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ
  • 48ఎంపి + 5ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post తక్కువ ధరతో లాంచ్ అయిన Nokia G400 5G first appeared on 91Mobiles Telugu.

]]>