Nokia T10 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 28 Sep 2022 08:41:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.11,799 ధరతో లాంచ్ అయిన Nokia T10 Tablet https://www.91mobiles.com/telugu/nokia-t10-tablet-wifi-launched-india-price-specs-availability/ Wed, 28 Sep 2022 08:41:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=2616 హైలైట్స్: భారత మార్కెట్ లో నేడు లాంచ్ అయిన Nokia T10 Tablet రూ.11,799 ధరతో ఎంట్రీ ఇచ్చిన Nokia T10 Tablet 8-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఈ ట్యాబ్ ప్రధాన ఫీచర్లు HMD Global కంపెనీ Nokia T10 (Wi-Fi) Tablet ని భారత్ లో లాంచ్ చేసింది. లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసి ఈ టాబ్లెట్ ని తీసుకొచ్చారు. 8-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, యూనిసాక్ టీ606 చిప్సెట్, […]

The post రూ.11,799 ధరతో లాంచ్ అయిన Nokia T10 Tablet first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత మార్కెట్ లో నేడు లాంచ్ అయిన Nokia T10 Tablet
  • రూ.11,799 ధరతో ఎంట్రీ ఇచ్చిన Nokia T10 Tablet
  • 8-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఈ ట్యాబ్ ప్రధాన ఫీచర్లు

HMD Global కంపెనీ Nokia T10 (Wi-Fi) Tablet ని భారత్ లో లాంచ్ చేసింది. లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసి ఈ టాబ్లెట్ ని తీసుకొచ్చారు. 8-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, యూనిసాక్ టీ606 చిప్సెట్, 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ టాబ్లెట్ లాంచ్ అయ్యింది. రెండేళ్ళ వరకు మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 3 ఏళ్ళ వరకు నెలవారీ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

Nokia T10 Tablet ధర, లభ్యత

Nokia T10 Tablet రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.11,799 గా ఉంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.12,799. హెచ్ఎండీ గ్లోబల్ త్వరలోనే Nokia T10 (LTE + Wi-Fi) టాబ్లెట్ ను కూడా మార్కెట్ లోకి తీసుకు రానుంది. ఇకపోతే Nokia T10 Tablet అమెజాన్, నోకియా వెబ్‌సైట్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Nokia T10 Tablet స్పెసిఫికేషన్స్

Nokia T10 Tablet లో యూనిసాక్ టీ606 చిప్సెట్ ని అమర్చారు. ఈ ట్యాబ్లెట్ లో 800*1280 రెజుల్యూషన్ గల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఇది 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్ కలిగి ఉంది. Nokia T10 Tablet లో 5250 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. Nokia T10 Tablet ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఓజో ప్లేబ్యాక్ ఫీచర్ ఇందులో ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు.

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, ఆంబియెంట్ లైట్ సెన్సర్, యాక్సలరోమీటర్, ఇన్‌బిల్ట్ జీపీఎస్ ఉన్నాయి. Nokia T10 Tablet లో 8ఎంపి రియర్ కెమెరా, 2ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బడ్జెట్ శ్రేణి ట్యాబ్లెట్ కోసం చూస్తున్నవారికి నోకియా టీ10 వై-ఫై ట్యాబ్లెట్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

గతేడాది Nokia T20 ట్యాబ్లెట్ తో నోకియా సంస్థ ట్యాబ్లెట్ కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓసారి ఈ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం. నోకియా టీ20 ట్యాబ్లెట్ లో యూనిసాక్ టీ610 ప్రాసెసర్, 8200ఎంఏహెచ్ బ్యాటరీ, 10.4-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1200*2000 రెజుల్యూషన్, 3జిబి/4జిబి ర్యామ్, 32జిబి/64జిబి స్టోరేజీ, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీని ధర రూ.15,499 నుంచి మొదలవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post రూ.11,799 ధరతో లాంచ్ అయిన Nokia T10 Tablet first appeared on 91Mobiles Telugu.

]]>