Nothing Ear (Stick) TWS - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Oct 2022 05:36:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో లాంచ్ అయిన Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ https://www.91mobiles.com/telugu/nothing-ear-stick-tws-launched-india-price-specs-availability/ Thu, 27 Oct 2022 05:36:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=3091 హైలైట్స్ భారత్ లో లాంచ్ అయిన Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఫ్లిప్ కార్ట్ మరియు మింత్రా వెబ్ సైట్స్ ద్వారా అందుబాటులోకి Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ 29 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కలిగిన Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. Nothing […]

The post భారత్ లో లాంచ్ అయిన Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచ్ అయిన Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్
  • ఫ్లిప్ కార్ట్ మరియు మింత్రా వెబ్ సైట్స్ ద్వారా అందుబాటులోకి Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్
  • 29 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కలిగిన Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్

Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. Nothing Phone (1) తర్వాత నతింగ్ నుంచి ఈ ఏడాది వచ్చిన రెండో ప్రోడక్ట్ Nothing Ear (Stick). గత కొన్ని వారాలుగా నతింగ్ ఇయర్ స్టిక్ ని సదరు సంస్థ టీజ్ చేస్తూ వస్తోంది. దీంతో జనాల్లో ఈ ఇయర్ స్టిక్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఆ బజ్ కి తెరదించుతూ తాజాగా నతింగ్ ఇయర్ స్టిక్ మార్కెట్ లో అడుగు పెట్టింది.

నతింగ్ కంపెనీ నుంచి వచ్చిన సరికొత్త TWS హెడ్‌సెట్ గత మోడల్ నతింగ్ ఇయర్ (1) తో పోల్చితే తక్కువ ధరకే లాంచ్ అయ్యింది. అయితే ఈ కొత్త ప్రోడక్ట్ లో యాక్టివ్ నాయిస్ క్యాన్సెలేషన్, వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లు మిస్ అయ్యాయి. అయితేనేం, ఈసారి కొత్త కేస్ డిజైన్ తో వచ్చేసి చూపరులను ఆకట్టుకుంటోంది. ఓసారి Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Nothing Ear (Stick) ధర, లభ్యత

Nothing Ear (Stick) TWS ధరను రూ.8,499 గా నిర్ణయించారు. నవంబర్ 17 నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు మింత్రా ద్వారా భారత్ లో దీని అమ్మకాలు మొదలవుతాయి. ఇకపోతే యూకే, యూఎస్ఏ, యూరోప్ తో పాటు 40 దేశాల్లో నవంబర్ 4 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి. ఈ కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కేవలం తెలుపు రంగు ఆప్షన్ లో మాత్రమే లభిస్తాయి.

Nothing Ear (Stick) TWS ఫీచర్స్

గత మోడల్ ఇయర్ (1) తో కంపేర్ చేస్తే, Nothing Ear (Stick) TWS half-in-ear స్టైల్ డిజైన్ తో వస్తోంది. ఇది ఇయర్ (1) కి పూర్తిగా భిన్నం. ఇక ఈ డిజైన్ వల్లన చెవిలో బడ్ (Bud) సౌకర్యవంతంగా ఫిట్ కాదు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక, ప్రతి బడ్ (Bud) 4.4 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ 12.6 ఎంఎం డైనమిక్ డ్రైవర్ సెటప్ తో వస్తున్నాయి. ఏఏసీ, ఎస్బీసీ కోడ్స్ కి ఇవి సపోర్ట్ చేస్తాయి. సౌండ్ లీకేజీని నిరోధించేందుకు ఇందులో బేస్ లాక్ ఫీచర్ ఉంది.

Nothing Ear (Stick) TWS మూడు మైకులను కలిగి ఉంటుంది. ఈ ఇయర్ స్టిక్ బిగ్గరగా వచ్చే బ్యాగ్రౌండ్ నాయిస్ ని ఫిల్టర్ చేయగలదు. ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే, Nothing Ear (Stick) TWS 7 గంటల లిసెనింగ్ టైమ్, చార్జింగ్ కేస్ తో 29 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. కేవలం 10 నిమిషాల పాటు చార్జ్ చేస్తే, కేస్ మరియు టీడబ్ల్యూఎస్ కలిపి 9 గంటల బ్యాటరీ లైఫ్ ని ఆఫర్ చేస్తాయి. కేస్ టైప్-సీ పోర్ట్ తో వస్తోంది. దీని ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ లేదు.

Nothing Ear (Stick) TWS యొక్క కేస్ ట్రాన్స్‌పరెంట్ గా మరియు సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది. కంట్రోల్స్ విషయానికి వస్తే, Nothing Ear (Stick) లో ట్యాప్, ప్రెస్ మరియు హోల్డ్ కంట్రోల్స్ రెండు బడ్స్ పై ఉంటాయి. ఇతర ఫీచర్లను చూస్తే, బ్లూటూత్ 5.2, ఐపీ54 రేటింగ్, ఇన్-ఇయర్ డిటెక్షన్, గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ సిఫ్ట్ పెయిర్, నతింగ్ ఎక్స్ యాప్, కస్టమైజ్ ఈక్యూ మరియు జెశ్చర్స్, లో ల్యాగ్ మోడ్ వంటివి ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో లాంచ్ అయిన Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ first appeared on 91Mobiles Telugu.

]]>