Nothing Phone (1) Lite - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 03 Aug 2022 15:50:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (1) Lite https://www.91mobiles.com/telugu/nothing-phone-1-lite-in-development-reports/ Wed, 03 Aug 2022 15:50:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=1470 హైలైట్స్: అక్టోబర్ లో భారత్ లో లాంచ్ కానున్న నథింగ్ ఫోన్ (1) లైట్ గ్లైఫ్ ఇంటర్ఫేస్, వైర్లెస్ చార్జింగ్ లేకుండా వస్తోన్న నథింగ్ ఫోన్ (1) లైట్, 6జిబి ర్యామ్ ఉండే అవకాశం నథింగ్ ఫోన్ (1) మాదిరి కన్ఫూగరేషన్ ని కలిగి ఉండనున్న నథింగ్ ఫోన్ (1) లైట్ గత నెలలో నథింగ్ బ్రాండ్ నుంచి నథింగ్ ఫోన్ (1) లాంచ్ అయ్యింది. తన యూనిక్ డిజైన్ తో ఈ ఫోన్ చూపరులను ఆకట్టుకుంది. […]

The post త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (1) Lite first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అక్టోబర్ లో భారత్ లో లాంచ్ కానున్న నథింగ్ ఫోన్ (1) లైట్
  • గ్లైఫ్ ఇంటర్ఫేస్, వైర్లెస్ చార్జింగ్ లేకుండా వస్తోన్న నథింగ్ ఫోన్ (1) లైట్, 6జిబి ర్యామ్ ఉండే అవకాశం
  • నథింగ్ ఫోన్ (1) మాదిరి కన్ఫూగరేషన్ ని కలిగి ఉండనున్న నథింగ్ ఫోన్ (1) లైట్

గత నెలలో నథింగ్ బ్రాండ్ నుంచి నథింగ్ ఫోన్ (1) లాంచ్ అయ్యింది. తన యూనిక్ డిజైన్ తో ఈ ఫోన్ చూపరులను ఆకట్టుకుంది. బ్రాకెట్ లో నంబర్ ఉండటాన్ని బట్టి, రాబోవు ఫోన్ నథింగ్ ఫోన్ (2) అని అంతా అనుకున్నారు. కానీ ఇది అలా వర్తించదని తెలిసింది. ద మొబైల్ ఇండియన్ కథనాన్ని బట్టి అక్టోబర్ లో నథింగ్ ఫోన్ (1) లైట్ వేరియంట్ భారత్ లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే లాంచ్ చేసి ఏ కంపెనీ సైలెంట్ గా ఉండదు. వరుసబెట్టి ఎన్నో ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ద మొబైల్ ఇండియన్, నథింగ్ కంపెనీని సంప్రదించగా, లైట్ వర్షన్ ఏదీ రావడం లేదని తెలిపినట్లు సమాచారం. మేం కూడా నథింగ్ స్పందనకై వేచి చూస్తున్నాం. అయితే వారి నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు.

నథింగ్ ఫోన్ (1) లైట్ (Nothing Phone (1) Lite)

లైట్ వర్షన్ కూడా నథింగ్ ఫోన్ (1) లైట్ మాదిరే ఉండనుందని, ఫీచర్లు కూడా అదే విధంగా ఉంటాయని తెలుస్తోంది. మరి తేడా ఎక్కడ ఉండనుందంటే, గ్లైఫ్ ఇంటర్ఫేస్, వైర్లెస్ చార్జింగ్ లైట్ మోడల్ లో ఉండవు. కాస్ట్ కట్టింగ్ లో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. అసలు నథింగ్ ఫోన్ (1) కి అందమేంటంటే, బ్యాక్ ప్యానెల్ పై కనిపించే ఎల్ఈడీ లైటింగే. మరి అది లేకుండా సేల్ కి వెళ్లడమంటే, కొనేవాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించక మానరు.

నథింగ్ ఫోన్ (1) లైట్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. నథింగ్ ఫోన్ (1) విషయానికి వస్తే, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు, బయ్యర్లకు 42 వాట్ ఛార్జర్ బాక్స్ లో రానుందని సమాచారం. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో రాబోవు నథింగ్ ఫోన్ (1) లైట్ ధర రూ.24,999 ఉంటుందని అంచనా. ఇక నథింగ్ ఫోన్ (1) 8జిబి+128జిబి బేస్ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది.

నథింగ్ ఫోన్ (1) లైట్ ఫోన్ యొక్క ర్యామ్, బ్యాటరీ పక్కనబెడితే, బాక్స్ లో 42 వాట్ చార్జర్ తో వస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇకపోతే ఇతర ఫీచర్లు ఈ విధంగా ఉండనున్నాయి. నథింగ్ ఫోన్ (1) లైట్ లో స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి రియర్ కెమెరాస్, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశముంది.

గ్లైఫ్ ఇంటర్ఫేస్, వైర్లెస్ చార్జింగ్ లైట్ మోడల్ లో ఉండవు. కాస్ట్ కట్టింగ్ లో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. అసలు నథింగ్ ఫోన్ (1) కి అందమేంటంటే, బ్యాక్ ప్యానెల్ పై కనిపించే ఎల్ఈడీ లైటింగే. మరి అది లేకుండా సేల్ కి వెళ్లడమంటే, నథింగ్ కంపెనీ సాహసం చేస్తున్నట్లే. నథింగ్ ఫోన్ (1) లైట్ ఫోన్ లాంచ్ తర్వాత ఏం జరగనుందో చూడాలి.

The post త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (1) Lite first appeared on 91Mobiles Telugu.

]]>