Nothing - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Aug 2023 11:56:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 CMF అనే సబ్-బ్రాండ్ ని ప్రకటించిన Nothing సీఈవో కార్ల్ పే https://www.91mobiles.com/telugu/nothing-introduced-its-sub-brand-cmf/ Fri, 04 Aug 2023 11:56:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=7468 Nothing కంపెనీ తాజాగా 2023 రెండో త్రైమాసికానికి సంబంధించిన కమ్యూనిటీ అప్డేట్ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా బ్రాండ్ యొక్క అప్డేట్స్ బయటకు వచ్చాయి. సీఈవో కార్ల్ పే తమ కొత్త సబ్-బ్రాండ్ CMF ని ప్రకటించారు. ఈ బ్రాండ్ ద్వారా వినూత్నమైన డిజైన్లతో కొత్త శ్రేణి ఉత్పత్తులు రానున్నట్లు సమాచారం. ఇక CMF అంటే కలర్, మెటీరియల్, ఫినిష్ అని అర్థం. ఈ కొత్త బ్రాండ్ విశేషాలేంటో తెలుసుకుందాం. చూస్తుంటే, వన్‌ప్లస్ సబ్-బ్రాండ్ […]

The post CMF అనే సబ్-బ్రాండ్ ని ప్రకటించిన Nothing సీఈవో కార్ల్ పే first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నథింగ్ నుంచి వస్తోన్న కొత్త సబ్-బ్రాండ్
  • తక్కువ ధరలో రానున్న CMF ప్రొడక్ట్స్
  • 2023 ఆఖర్లో లాంచ్ కానున్న సీఎమ్ఎఫ్ ఉత్పత్తులు

Nothing కంపెనీ తాజాగా 2023 రెండో త్రైమాసికానికి సంబంధించిన కమ్యూనిటీ అప్డేట్ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా బ్రాండ్ యొక్క అప్డేట్స్ బయటకు వచ్చాయి. సీఈవో కార్ల్ పే తమ కొత్త సబ్-బ్రాండ్ CMF ని ప్రకటించారు. ఈ బ్రాండ్ ద్వారా వినూత్నమైన డిజైన్లతో కొత్త శ్రేణి ఉత్పత్తులు రానున్నట్లు సమాచారం. ఇక CMF అంటే కలర్, మెటీరియల్, ఫినిష్ అని అర్థం. ఈ కొత్త బ్రాండ్ విశేషాలేంటో తెలుసుకుందాం.

చూస్తుంటే, వన్‌ప్లస్ సబ్-బ్రాండ్ Nord స్ట్రేటజీని Nothing సంస్థ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో మార్కెట్ లోకి అడుగుపెట్టనున్న CMF బ్రాండ్ నుంచి ఏ తరహా ప్రొడక్ట్స్ రానున్నాయోనన్న ఆసక్తి టెక్ వర్గాల్లో నెలకొంది. ఇకపోతే నథింగ్ సంస్థ తొలుత Nothing Ear (1) ని జులై 2021 లో లాంచ్ చేసింది. తర్వాత తన మొదటి ఫోన్ Nothing Phone (1) ని లాంచ్ చేసింది. తర్వాత Nothing Ear (2), Nothing (Stick), Nothing Phone (2) లను లాంచ్ చేసింది.

CMF by Nothing నుంచి ఏమి ఆశించవచ్చు?

నథింగ్ కంపెనీ సీఈవో కార్ల్ పే మాట్లాడుతూ, Nothing మరియు CMF రెండు కూడా వేర్వేరు బ్రాండ్స్ అని, అయితే ఒకే డీఎన్ఏని కలిగి ఉన్నాయని అన్నారు. CMF ఉత్పత్తుల్లో కూడా ఒకే స్థాయి డిజైన్, క్వాలిటీని మెంటైన్ చేస్తామని నథింగ్ సీఈవో అన్నారు. ఇకపోతే, నథింగ్ నుంచి రాబోవు ప్రొడక్ట్స్ ప్రీమియమ్ గా, సరికొత్త డిజైన్లతో, టెక్నాలజీతో వస్తాయని కార్ల్ పే అన్నారు.

The post CMF అనే సబ్-బ్రాండ్ ని ప్రకటించిన Nothing సీఈవో కార్ల్ పే first appeared on 91Mobiles Telugu.

]]>
నేడు భారత్ లో మొదలైన Nothing Phone (1) ఓపెన్ సేల్ https://www.91mobiles.com/telugu/nothing-phone-1-open-sale-begins-from-today-check-price-specifications/ Thu, 21 Jul 2022 15:02:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=1158 హైలైట్స్: నేడు భారత్ లో మొదలైన నథింగ్ ఫోన్ (1) ఓపెన్ సేల్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సాగనున్న అమ్మకాలు, ఫోన్ ధర రూ.32,999 నుంచి ప్రారంభం జులై 27 న ప్రీ-ఆర్డర్ కస్టమర్ల కోసం స్పెషల్ సేల్ నిర్వహించనున్న నథింగ్ 2022 లో లాంచ్ అయిన మోస్ట్ అవెయిటెడ్ ఫోన్స్ లో ఒకటి నథింగ్ ఫోన్ (1). నేడు ఓపెన్ సేల్ కి వచ్చింది. ఆసక్తిగల కొనుగోలుదారులు నథింగ్ ఫోన్ (1) ని ఫ్లిప్ కార్ట్ […]

The post నేడు భారత్ లో మొదలైన Nothing Phone (1) ఓపెన్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నేడు భారత్ లో మొదలైన నథింగ్ ఫోన్ (1) ఓపెన్ సేల్
  • ఫ్లిప్ కార్ట్ ద్వారా సాగనున్న అమ్మకాలు, ఫోన్ ధర రూ.32,999 నుంచి ప్రారంభం
  • జులై 27 న ప్రీ-ఆర్డర్ కస్టమర్ల కోసం స్పెషల్ సేల్ నిర్వహించనున్న నథింగ్

2022 లో లాంచ్ అయిన మోస్ట్ అవెయిటెడ్ ఫోన్స్ లో ఒకటి నథింగ్ ఫోన్ (1). నేడు ఓపెన్ సేల్ కి వచ్చింది. ఆసక్తిగల కొనుగోలుదారులు నథింగ్ ఫోన్ (1) ని ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్ నేటి నుంచి ఫోన్ ని కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్న వేళ, ప్రీ-ఆర్డర్ కస్టమర్లు మాత్రం ఫోన్ షార్టేజీ వల్లన ఇంకా తమ ఆర్డర్ ను ప్లేస్ చేయలేకపోతున్నారు. దీంతో నథింగ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ మను శర్మ, ప్రీ-ఆర్డర్ కస్టమర్ల కోసం స్పెషల్ సేల్ ను నిర్వహించబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా
ప్రకటించారు.

ప్రీ-ఆర్డర్ పాస్ డబ్బులను ప్రీ-ఆర్డర్ కస్టమర్లకు జులై 23 న ఇవ్వబోతున్నట్లు లేఖ ద్వారా స్పష్టమవుతోంది. అలాగే నేటి నుంచే ప్రీ-ఆర్డర్ కస్టమర్ తమకు నచ్చిన వేరియంట్ ను ఆర్డర్ పెట్టుకోవచ్చని, జులై 27 మధ్యాహ్నం 12 తర్వాత పూర్తి పేమెంట్ చేయొచ్చని లేఖలో పేర్కొన్నారు. ప్రీ-ఆర్డర్ కస్టమర్లకు అన్ని రకాల ఆఫర్లు, బెనిఫిట్స్ అందుతాయని కంపెనీ భరోసా ఇచ్చింది.

పాస్ లేకుండా భారత్ లో Nothing Phone (1) ధర

నథింగ్ ఫోన్ (1) మూడు వేరియంట్లలో లభిస్తుంది:

  • 8జిబి/128జిబి: రూ.32,999
  • 8జిబి/256జిబి: రూ.35,999
  • 12జిబి/256జిబి: రూ.38,999

నథింగ్ ఫోన్ (1) తెలుపు మరియు నలుపు రంగు ఆప్షన్స్ లో లభిస్తుంది. నథింగ్ ఫోన్ (1) ఓపెన్ సేల్ నేడు ఫ్లిప్ కార్ట్ లో 7 గంటలకు మొదలైంది. ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద, కంపెనీ నుంచి రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ కార్డ్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

నథింగ్ ఫోన్ (1) బ్యాక్ ప్యానెల్ పై 900 ఎల్ఈడీ లతో గ్లైఫ్ ఇంటర్ఫేస్ ఉంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ కలిగి ఉంది. ఇందులో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. అయితే స్టోరేజీని పెంచుకునే అవకాశం లేదు.

6.55 అంగుళాల 10-బిట్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 402పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, హెచ్డీఆర్10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక కెమెరా విభాగానికి వస్తే, నథింగ్ ఫోన్ (1) లో డ్యూయర్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 50ఎంపి మెయిన్ కెమెరా (సోనీ సెన్సర్) కాగా, రెండోది 50ఎంపి (శాంసంగ్ సెన్సర్) అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందువైపున 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 సెన్సర్ ను అమర్చారు. ఇంకా ఈ ఫోన్లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. బ్లూటూత్, వై-ఫై 6, ఎన్ఎఫ్సీ, 5జీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేసియల్ రికగ్నిషన్, ఐపీ53 రేటింగ్, ఆండ్రాయిడ్ 12, నథింగ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లున్నాయి. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే, నథింగ్ కంపెనీ ఈ ఫోన్ కి నాలుగేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్, మూడేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇవ్వనుంది.

The post నేడు భారత్ లో మొదలైన Nothing Phone (1) ఓపెన్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing Phone (1) డిస్ప్లే ఇష్యూస్ https://www.91mobiles.com/telugu/nothing-phone-1-users-reported-several-hardware-level-issues-greentint-display-punch-hole-camera-issue/ Tue, 19 Jul 2022 13:59:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=1072 హైలైట్స్: తన తొలి స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) ని రీసెంట్ గా లాంచ్ చేసిన నథింగ్ కంపెనీ నథింగ్ ఫోన్ (1) తో ఇబ్బందులు ఎదుర్కుంటోన్న పలువురు యూజర్లు వెలుగులోకి గ్రీన్ టింట్ డిస్ప్లే, డిఫెక్టెడ్ పంచ్-హోల్ కెమెరా వంటి సమస్యలు నథింగ్ కంపెనీ నుంచి మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) లాంచ్ అయి ఎన్నో రోజులు కాలేదు. ఇటీవల అందరూ ఈ ఫోన్ గురించే మాట్లాడుతున్నారు. అయితే నథింగ్ […]

The post Nothing Phone (1) డిస్ప్లే ఇష్యూస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • తన తొలి స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) ని రీసెంట్ గా లాంచ్ చేసిన నథింగ్ కంపెనీ
  • నథింగ్ ఫోన్ (1) తో ఇబ్బందులు ఎదుర్కుంటోన్న పలువురు యూజర్లు
  • వెలుగులోకి గ్రీన్ టింట్ డిస్ప్లే, డిఫెక్టెడ్ పంచ్-హోల్ కెమెరా వంటి సమస్యలు

నథింగ్ కంపెనీ నుంచి మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (1) లాంచ్ అయి ఎన్నో రోజులు కాలేదు. ఇటీవల అందరూ ఈ ఫోన్ గురించే మాట్లాడుతున్నారు. అయితే నథింగ్ ఫోన్ (1) అప్పుడే పలు సమస్యలను ఎదుర్కుంటోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్లు ఫోన్ ని రిసీవ్ చేసుకుంటున్నారు. వీరిలో పలువురు ఫోన్ లో సమస్యలున్నాయని చెబుతున్నారు. కొన్ని ఫోన్లు హార్డ్ వేర్-లెవెల్ సమస్యలను కలిగి ఉన్నట్లు సమాచారం.

Nothing Phone (1) లో ఇప్పటి వరకు ఎదురైన సమస్యలు

అమోలెడ్ ప్యానెల్ తో ఫోన్లను లాంచ్ చేసే దాదాపు అన్ని కంపెనీలు కూడా ఈ గ్రీన్ టింట్ సమస్యను ఎదుర్కుంటూ ఉండటం సహజమే. ఇందులో కొత్త విషయమేం లేదు. కొన్నాళ్ళుగా ఇటువంటి ఇష్యూస్ ని స్మార్ట్ ఫోన్స్ లో గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు నథింగ్ ఫోన్ (1) కూడా ఈ జాబితాలో చేరిపోయింది. మరి ఈ గ్రీన్ టింట్ సమస్య ఏంటంటే, డిస్ప్లే లోని డార్క్ సెగ్మెంట్స్ అన్నీ గ్రీన్ టింట్ తో కనిపిస్తాయి.

ఫ్లిప్ కార్ట్ ద్వారా నథింగ్ ఫోన్ (1) ని కొనుగోలు చేసిన ఒక యూజర్ తనకు వచ్చిన డివైజ్ ను రిటర్న్ చేసి, సమస్యలు లేని డివైజ్ వస్తుందని అనుకున్నాడు. కానీ, అతనికి చేదు అనుభవమే ఎదురైంది. మరలా వచ్చిన డివైజ్ కూడా అదే సమస్యను కలిగి ఉంది. దీంతో షాకవ్వడం యూజర్ వంతైంది.

గ్రీన్ టింట్ సమస్యకు తోడు, డిఫెక్టివ్ సెల్ఫీ కెమెరా సమస్య పలు డివైజ్ లను వేధిస్తోంది. పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కొన్ని డివైజ్ లలో మరింతగా ఎక్స్ టెండ్ అయినట్ల కనిపిస్తోంది. అది చూడటానికి ఏమాత్రం బాగోలేదు.

మరోవైపు నథింగ్ టీమ్ ఇప్పటికే సమస్యలను గుర్తించి, వాటిపై పని చేస్తోంది. ఇక డిఫెక్టెడ్ డివైజ్ ల స్థానంలో మరో యూనిట్ ని యూజర్లకు అందించడం జరుగుతుంది.అయితే కొత్త బ్రాండ్ యొక్క మొదటి ఫోనే ఇలా సమస్యల వలలో చిక్కుకుపోవడం బాధాకరం. ఇంకో విషయం ఏంటంటే, ఫోన్లో సమస్యలు తలెత్తితే ఏం చేయాలనే దానిపై నథింగ్ కంపెనీ ఎటువంటి అధికార సూచనలు జారీ చేయలేదు. మరో విడత తయారై రానున్న నథింగ్ ఫోన్ (1) బ్యాచ్, ఇలా లోపాలు లేకుండా వస్తుందని ఆశిద్దాం.

ఏ విధంగా చూసినా, మార్కెట్ లోకి అడుగు పెట్టిన కొత్త బ్రాండ్ నథింగ్ కు ఇది చేదు అనుభవమేనని చెప్పాలి. ఇక ఈ ఫోన్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్ బేస్ కూడా ఉసూరుమన్నట్లైంది. లోపాలు తలెత్తడం సహజమే అయినా, తొలి ఫోన్ లోనే ఇలాంటి సమస్యలు రావడం మింగుడు పడని విషయం. ఎందుకంటే, నథింగ్ ఫోన్ ఇంకా మార్కెట్ లో నిలదొక్కుకోవాల్సి ఉంది. నథింగ్ ఫోన్ (1) సదరు కంపెనీకి శుభారంభం ఇస్తుందని అందరూ భావించారు. కానీ, ఊహించని విధంగా లోపాలు వెలుగు చూడటం నథింగ్ కంపెనీకి జీర్ణించుకోలేని విషయం. నథింగ్ కంపెనీ దీనిపై ఎంతో దృష్టి పెట్టాల్సి ఉంది. భవిష్యత్తులో రాబోవు ఫోన్లే కాకుండా, ప్రస్తుతం విడుదలైన ఫోన్ కి ఏ లోపాలు లేకుండా చేయడం నథింగ్ కంపెనీ యొక్క ప్రథమ కర్తవ్యం. మరి ఈ సవాల్ ను నథింగ్ కంపెనీ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

The post Nothing Phone (1) డిస్ప్లే ఇష్యూస్ first appeared on 91Mobiles Telugu.

]]>