Offline sales - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 03 Jul 2024 06:12:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y28s 5G: ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో వివో వై28ఎస్ అమ్మకాలు ప్రారంభం, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-sales-started-in-offline-retail-stores-india-know-the-price-and-specs/ https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-sales-started-in-offline-retail-stores-india-know-the-price-and-specs/#respond Wed, 03 Jul 2024 06:11:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=12344 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ముందుగా ఈ ఫోన్ ఆఫ్‌లైన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే రిటైల్స్ స్టోర్స్ లో అమ్మకాలు కూడా మొదలయ్యాయి. అయితే అధికారికంగా వివో నుంచి ఫోన్‌కి సంబంధించిన ప్రకటన ఏదీ రాలేదు. కానీ, Vivo Y28s 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన సమాచారం 91mobiles కి ఇండస్ట్రీ వర్గాల నుంచి లభించింది. ఓసారి […]

The post Vivo Y28s 5G: ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో వివో వై28ఎస్ అమ్మకాలు ప్రారంభం, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y28s 5G సేల్ ప్రారంభం
  • రిటైల్ స్టోర్స్ లో అమ్మకాలు
  • ప్రారంభ ధర రూ.13,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ముందుగా ఈ ఫోన్ ఆఫ్‌లైన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే రిటైల్స్ స్టోర్స్ లో అమ్మకాలు కూడా మొదలయ్యాయి. అయితే అధికారికంగా వివో నుంచి ఫోన్‌కి సంబంధించిన ప్రకటన ఏదీ రాలేదు. కానీ, Vivo Y28s 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన సమాచారం 91mobiles కి ఇండస్ట్రీ వర్గాల నుంచి లభించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందామా?

Vivo Y28s 5G ధర

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

Vivo Y28s 5G యొక్క 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.13,999 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.15,499 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది.

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జులై ప్రారంభం నుంచి మొదలయ్యాయి. గత మోడల్ Vivo Y28 కి సక్సెసర్‌గా Vivo Y28s 5G డివైజ్‌ని వివో మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

రిటైల్స్ వర్గాల ప్రకారం, కొన్ని రోజుల్లో Vivo Y28s 5G 8జిబి ర్యామ్ వేరియంట్ మార్కెట్ లోకి రానుందని తెలుస్తోంది. దీని ధర రూ.16,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కలర్ ఆప్షన్స్ వివరాలు తెలుసుకుందాం. పర్పుల్ మరియు బ్లూ కలర్స్ లో వివో వై28ఎస్ 5జీ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Vivo Y28s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28s 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ బ్రైట్నెస్, లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28s 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ 3 మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y28s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo Y28s 5G: ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో వివో వై28ఎస్ అమ్మకాలు ప్రారంభం, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-sales-started-in-offline-retail-stores-india-know-the-price-and-specs/feed/ 0
మే 1 నుంచి OnePlus ఆఫ్‌లైన్ అమ్మకాలు నిలిపివేత, ఎందుకో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-offline-sales-might-discontinue-from-may-1/ Thu, 11 Apr 2024 14:55:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=11044 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీదారు OnePlus కి ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. స్మార్ట్‌ఫోన్ లవర్స్ కి OnePlus ఎంతగానో చేరువైంది. ఈ సంస్థ ఫోన్లకు చాలా గిరాకీ ఉంది. అయితే ఇప్పుడు వన్‌ప్లస్ ని కష్టాలు చుట్టుముట్టాయి. ఆఫ్‌లైన్ మార్కెట్ లో ఇకపై OnePlus విక్రయాలు జరగబోవని తెలుస్తోంది. 2024 మే 1 నుంచి రిటైల్ స్టోర్స్ మరియు మొబైల్ షాపుల్లో OnePlus అమ్మకాలు నిలిచిపోనున్నాయి. కారణాలేంటో తెలుసుకుందాం పదండి. మే 1 నుంచి […]

The post మే 1 నుంచి OnePlus ఆఫ్‌లైన్ అమ్మకాలు నిలిపివేత, ఎందుకో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీదారు OnePlus కి ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. స్మార్ట్‌ఫోన్ లవర్స్ కి OnePlus ఎంతగానో చేరువైంది. ఈ సంస్థ ఫోన్లకు చాలా గిరాకీ ఉంది. అయితే ఇప్పుడు వన్‌ప్లస్ ని కష్టాలు చుట్టుముట్టాయి. ఆఫ్‌లైన్ మార్కెట్ లో ఇకపై OnePlus విక్రయాలు జరగబోవని తెలుస్తోంది. 2024 మే 1 నుంచి రిటైల్ స్టోర్స్ మరియు మొబైల్ షాపుల్లో OnePlus అమ్మకాలు నిలిచిపోనున్నాయి. కారణాలేంటో తెలుసుకుందాం పదండి.

మే 1 నుంచి OnePlus అమ్మకాల నిలిపివేత

రిటైల్ స్టోర్స్ లో OnePlus అమ్మకాలు నిలిచిపోనున్నాయి. సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ఇకపై OnePlus ఉత్పత్తులను విక్రయించబోమని సదరు సంఘం తెలిపింది. ఓఆర్ఏ అసోషియేషన్ దీనిపై, వన్‌ప్లస్ ఇండియా సేల్స్ డైరెక్టర్ రజనీశ్ సింగ్ కి ఒక లేఖ రాశారు. మే 1 నుంచి వన్‌ప్లస్ ఫోన్లను విక్రయించమని లేఖలో పేర్కొన్నారు.

ఆఫ్‌లైన్ మార్కెట్ లో OnePlus అమ్మకాలు ఎందుకు నిలిచిపోనున్నాయి?

మీడియా రిపోర్ట్ ప్రకారం, రజనీశ్ సింగ్ కి రాసిన లేఖలో ఓఆర్ఏ అసోషియేషన్ తాము ఎదుర్కుంటోన్న సమస్యలను గురించి ప్రస్తావించింది. అవేంటో ఇక్కడ చూడండి.

లో-ప్రాఫిట్ మార్జిన్స్ వల్లన షాపు యజమానులు నష్టపోతున్నట్లు అసోసియేషన్ చెబుతోంది. వన్‌ప్లస్ ఉత్పత్తులపై తక్కువ లాభం ఉంటోందని రిటైలర్స్ సంఘం వాదిస్తోంది.

OnePlus పాలసీపై కూడా అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యారంటీ మరియు సేవల జాప్యంతో షాపు యజమానులు మరియు రిటైలర్స్ కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తోందని తెలిపింది.

వన్‌ప్లస్ రవాణా నిర్వహణ విధానంపై కూడా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

OnePlus ఫోన్లు ఎక్కడ అమ్మబడవు?

దేశంలోని సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) పరిధిలో ఉన్న దాదాపు 4500 స్టోర్లలో OnePlus ఫోన్ల అమ్మకాలు నిలిచిపోనున్నాయి.

పూర్వికా మొబైల్స్, సంగీత మొబైల్స్, బిగ్ సీ మరియు పూజ వంటి దిగ్గజ రిటైల్ స్టోర్స్ లో వన్‌ప్లస్ సేల్స్ మే 1 నుంచి జరగబోవు.

అసోసియేషన్ విధించిన వన్‌ప్లస్ అమ్మకాల నిషేధం ప్రధానంగా.. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులతో పాటు మహారాష్ట్ర మరియు గుజరాత్ లపై ప్రభావం చూపనుంది. ఈ రాష్ట్రాల్లో OnePlus సేల్స్ నిలిచిపోనున్నాయి. ఆఫ్‌లైన్‌లో వన్‌ప్లస్ ఫోన్లను కొనాలని భావిస్తోన్న వినియోగదారులు నిరాశ చెందక తప్పదు.

సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఇప్పటివరకు OnePlus నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడం శోచనీయం. వన్‌ప్లస్ ఏ విధంగా స్పందించనుందో చూడాలి.

The post మే 1 నుంచి OnePlus ఆఫ్‌లైన్ అమ్మకాలు నిలిపివేత, ఎందుకో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>