Okaya Faast F2F - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:02:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 80 కిలోమీటర్ల రేంజ్, 6 కలర్ ఆప్షన్స్ తో భారత్‌లో లాంచైన Okaya Faast F2F https://www.91mobiles.com/telugu/okaya-faast-f2f-electric-scooter-launched-india-price-specs-availability/ Wed, 22 Feb 2023 10:13:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=5054 ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు Okaya EV భారత్ లో Faast F2F ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటు ధరలో మార్కెట్ లోకి వచ్చింది. Ola S1 Air, Bajaj Chetak లకు ఈ బండి ప్రత్యామ్నాయంగా నిలవనుంది. రూ.1 లక్ష ధరలో కస్టమర్లకు Faast F2F రూపంలో మరొక ఆప్షన్ దొరికినట్లైంది. భారత్ లో Okaya Faast F2F ధర, లభ్యత భారత్ లో Okaya Faast F2F […]

The post 80 కిలోమీటర్ల రేంజ్, 6 కలర్ ఆప్షన్స్ తో భారత్‌లో లాంచైన Okaya Faast F2F first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Okaya Faast F2F ఎలక్ట్రిక్ స్కూటర్
  • రూ.83,999 ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్ లోకి వచ్చిన Okaya Faast F2F
  • సింగిల్ చార్జ్ పై 80 కిలోమీటర్ల దూరం వెళ్ళనున్న Okaya Faast F2F ఎలక్ట్రిక్ స్కూటర్

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు Okaya EV భారత్ లో Faast F2F ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటు ధరలో మార్కెట్ లోకి వచ్చింది. Ola S1 Air, Bajaj Chetak లకు ఈ బండి ప్రత్యామ్నాయంగా నిలవనుంది. రూ.1 లక్ష ధరలో కస్టమర్లకు Faast F2F రూపంలో మరొక ఆప్షన్ దొరికినట్లైంది.

భారత్ లో Okaya Faast F2F ధర, లభ్యత

భారత్ లో Okaya Faast F2F ఎక్స్-షోరూమ్ ధర రూ.83,999 గా ఉంది. ఈ స్కూటర్ రెండేళ్ళు లేదా 20,000 కిలోమీటర్ల వ్యారంటీ కవరేజీ తో వస్తోంది. Okaya Faast F2F బండి మొత్తం 6 కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. అవి: మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సైయన్, మ్యాట్ గ్రీన్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ వైట్. Okaya Faast F2F స్కూటర్ ని ఏదైనా ఒకాయా ఈవీ డీలర్షిప్ వద్ద కొనుగోలు చేయవచ్చు.

Okaya Faast F2F స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Okaya Faast F2F ఎలక్ట్రిక్ స్కూటర్ 80 కిలోమీటర్ల రేంజ్ తో మార్కెట్ లోకి వచ్చింది. సింగిల్ చార్జ్ పై 80 కిలోమీటర్ల దూరం ఈ బండి వెళ్తుంది. అంటే రోజూ ఆఫీస్ కి వెళ్ళి వచ్చేందుకు, బజారుకి వెళ్ళి సరుకులు తెచ్చుకునేందుకు, పిల్లలను స్కూలు వద్ద దిగబెట్టేందుకు, తీసుకొచ్చేందుకు ఈ రేంజ్ సరిపోతుంది.

Okaya Faast F2F స్కూటర్ లో అమర్చబడిన 800వాట్ బీఎల్‌డీసీ హబ్ మోటర్ తో ఈ బండి 55 కేఎంపీహెచ్ తో దూసుకెళ్తుంది. ఈ బండిలో ఇకో, సిటీ మరియు స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. చార్జింగ్ విషయానికి వస్తే, కంపెనీ ప్రొవైడ్ చేసిన చార్జర్ తో ఈ బండి 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. వేరే చార్జర్స్ ద్వారా ఫాస్ట్ చార్జింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.

Okaya Faast F2F ఎలక్ట్రిక్ స్కూటర్ టెలీస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, స్ప్రింగ్-లోడెడ్ హైడ్రాలిక్ రియర్ సస్పెన్షన్ తో వచ్చింది. రిమోట్ కీ, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10-ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ వంటి ఫీచర్లతో వచ్చింది.

Okaya Faast F2F ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటు ధరలో అన్ని రకాల ఫీచర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. అన్ని మోడర్న్ ఫీచర్లు ఈ బండిలో అందించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఒకాయ డీలర్షిప్స్ నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ బండి వివరాలను మరొక్కసారి చదివి తెలుసుకుని, మీకు నచ్చితే గనుక సమీపంలోని డీలర్షిప్ కి వెళ్ళి కొనుగోలు చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 80 కిలోమీటర్ల రేంజ్, 6 కలర్ ఆప్షన్స్ తో భారత్‌లో లాంచైన Okaya Faast F2F first appeared on 91Mobiles Telugu.

]]>