Okaya Faast-F2T - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 20 Oct 2022 15:48:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రెండు శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన OKAYA https://www.91mobiles.com/telugu/okaya-launched-faast-f2b-faast-f2t-e-scooters-india-price-specs/ Thu, 20 Oct 2022 15:48:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=3006 హైలైట్స్ భారత్ లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన Okaya ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ల పేర్లు: Faast-F2B, Faast-F2T Okaya Faast-F2B ధర రూ.89,999, Okaya Faast-F2T ధర రూ.84,999 ఈ పండుగ సీజన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనాలని ప్లాన్ చేసే వారి కోసం ప్రముఖ కంపెనీ Okaya EV రెండు శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్ లో లాంచ్ చేసింది. Okaya Faast-F2B మరియు Okaya Faast-F2B అనే మోడల్స్ ని […]

The post రెండు శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన OKAYA first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన Okaya
  • ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ల పేర్లు: Faast-F2B, Faast-F2T
  • Okaya Faast-F2B ధర రూ.89,999, Okaya Faast-F2T ధర రూ.84,999

ఈ పండుగ సీజన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనాలని ప్లాన్ చేసే వారి కోసం ప్రముఖ కంపెనీ Okaya EV రెండు శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్ లో లాంచ్ చేసింది. Okaya Faast-F2B మరియు Okaya Faast-F2B అనే మోడల్స్ ని ఒకాయ కంపెనీ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు ఇలా ఉన్నాయి. Okaya Faast-F2B ధర రూ.89,999 కాగా, Okaya Faast-F2T ధర రూ.84,999 గా ఉంది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ధర, రేంజ్ ఇతర ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం పదండి.

Okaya Faast F2B, Fasst F2T ధరలు

భారతదేశంలో ఒకాయ కంపెనీకి 500 కి పైగా షోరూమ్స్ ఉన్నాయి. ఈ పండుగ సీజన్ లో అత్యధిక సంఖ్యలో స్కూటర్లను అమ్మాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరుణంలో కొత్తగా ఫాస్ట్ సిరీస్ లో రెండు స్కూటర్లను లాంచ్ చేసింది. ఈ బండ్ల ఎక్స్-షోరూమ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. Okaya Faast-F2B ధర రూ.89,999 కాగా, Okaya Faast-F2B ధర రూ.84,999 గా ఉంది.

కారు గెలవండి

ఒకాయ ఈ-స్కూటర్ ని 31 అక్టోబర్ 2022 లోపు కొనుగోలు చేసే కస్టమర్లు కారు, ల్యాప్‌టాప్, టీవీ, క్యాష్ ప్రైజ్ ఇంకా మరెన్నింటినో గిఫ్టుగా గెలుచుకునే అవకాశం ఉంది. మరింకెందుకు ఆలస్యం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచన ఉంటే వెంటనే రంగంలోకి దిగండి. రెండు మోడల్స్ లో ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోండి.

Okaya Fast F2B, F2T రేంజ్, టాప్ స్పీడ్

Okaya Fast F2B, F2T ఈ-స్కూటర్లు 70 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ వెళ్తాయని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్లలో 2000 వాట్ మోటర్ ని వినియోగించారు. F2T బండి సింగిల్ చార్జ్ పై 85 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. మరోవైపు F2B స్కూటర్ ఫుల్ చార్జ్ పై 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం వెళ్తుందని కంపెనీ చెబుతోంది. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో 2.2 కిలోవాట్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్స్ ని ఇవ్వడం జరిగింది.

OKAYA FREEDUM

ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, గతేడాది సెప్టెంబర్ లో ఒకాయ కంపెనీ FEEDUM LI-2, FREEDUM LA-2 ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ రెండు స్కూటర్లు కూడా 250వాట్ బీఎల్డీసీ హబ్ మోటర్ ని కలిగి ఉన్నాయి. LI-2 మోడల్ సింగిల్ చార్జ్ పై 70 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉండగా, LA-2 మోడల్ 50 నుంచి 60 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. ఈ రెండు వెహికిల్స్ 25 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ ని కలిగి ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రెండు శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన OKAYA first appeared on 91Mobiles Telugu.

]]>