One Year Validity Plans - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 11 Aug 2023 07:42:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Airtel: ఏడాది వ్యాలిడిటీ అందించే ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/airtel-yedadhi-validity-andhinche-airtel-best-plans/ Fri, 11 Aug 2023 06:25:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=7561 భారతదేశంలో ఉన్న ప్రముఖ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి. ఇండియన్ టెలీకామ్ మార్కెట్లో అత్యంత విజయవంతమైన సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది. జియో ఎంట్రీ తర్వాత ఎయిర్టెల్ కి గట్టి పోటీ ఎదురైంది. కానీ, ఎయిర్టెల్ కూడా ధీటుగానే తన టెలీకామ్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ప్రతీ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ కూడా వినియోగదారునికి మంచే చేస్తుంది. టెలీకామ్ ఆపరేటర్ల మధ్య పోటీ వాతావరణమే వినియోగదారులకు మంచి రీచార్జ్ ప్లాన్స్, ఆఫర్లను అందిస్తుంది. ఇక ఎయిర్టెల్ వద్ద తన […]

The post Airtel: ఏడాది వ్యాలిడిటీ అందించే ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • దేశంలో టాప్ 2 టెలీకామ్ సంస్థగా కొనసాగుతోన్న Airtel
  • వివిధ బడ్జెట్స్ లో అందుబాటులో ఉన్న రీచార్జ్ ప్లాన్స్
  • ఏడాది వ్యాలిడిటీ ప్లాన్స్ అందిస్తోన్న ఎయిర్టెల్

భారతదేశంలో ఉన్న ప్రముఖ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి. ఇండియన్ టెలీకామ్ మార్కెట్లో అత్యంత విజయవంతమైన సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది. జియో ఎంట్రీ తర్వాత ఎయిర్టెల్ కి గట్టి పోటీ ఎదురైంది. కానీ, ఎయిర్టెల్ కూడా ధీటుగానే తన టెలీకామ్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ప్రతీ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ కూడా వినియోగదారునికి మంచే చేస్తుంది. టెలీకామ్ ఆపరేటర్ల మధ్య పోటీ వాతావరణమే వినియోగదారులకు మంచి రీచార్జ్ ప్లాన్స్, ఆఫర్లను అందిస్తుంది.

ఇక ఎయిర్టెల్ వద్ద తన వినియోగదారుల కోసం ఎన్నో రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల బడ్జెట్స్ లో ఈ ప్లాన్స్ లభిస్తాయి. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా ఏడాది వ్యాలిడిటీ అందించే ఎయిర్టెల్ రీచార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.

Airtel వన్ ఇయర్ వ్యాలిడిటీ ప్లాన్స్

  • రూ.3359
  • రూ.1799
  • రూ.2999

Airtel రూ.3359 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.3359 రీచార్జ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ఇంకా డెయిలీ 2.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

ఎయిర్టెల్ రూ.3359 అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.3359 ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఏడాది సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ లభిస్తాయి. ఇంకా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.

Airtel రూ.2999 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.2999 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, డెయిలీ 2జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.2,999 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.2,999 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ లభిస్తాయి. ఇంకా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.

రూ.1,799 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.1799 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, 3600 ఎస్ఎంఎస్, 24జిబి డేటా లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

రూ.1799 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.1799 రీచార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

ఎయిర్టెల్ అందిస్తోన్న ఏడాది వ్యాలిడిటీ గల ప్లాన్స్ వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ ప్లాన్స్ నుంచి మీకు సరిపడేదదో ఎంచుకుని రీచార్జ్ చేసుకోండి.

The post Airtel: ఏడాది వ్యాలిడిటీ అందించే ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>