OnePlus 10 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 21 Nov 2022 05:49:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Price drop: OnePlus 10 Pro పై రూ.5,000 తగ్గింపు https://www.91mobiles.com/telugu/oneplus-10-pro-price-cut-rs-5000-india/ Mon, 21 Nov 2022 05:49:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=3550 హైలైట్స్ భారత్ లో OnePlus 10 Pro ధర తగ్గింపు, అధికార వెబ్‌సైట్, ఈ-కామర్స్ సైట్స్ లో దర్శనమిస్తోన్న కొత్త ధర తగ్గింపు తర్వాత 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.61,999. 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.66,999 6.7-ఇంచ్ 2కే ఫ్లూయిడ్ అమోలెడ్ ఎల్టీపీవో 2.0 డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ OnePlus 9 Pro […]

The post Price drop: OnePlus 10 Pro పై రూ.5,000 తగ్గింపు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో OnePlus 10 Pro ధర తగ్గింపు, అధికార వెబ్‌సైట్, ఈ-కామర్స్ సైట్స్ లో దర్శనమిస్తోన్న కొత్త ధర
  • తగ్గింపు తర్వాత 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.61,999. 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.66,999
  • 6.7-ఇంచ్ 2కే ఫ్లూయిడ్ అమోలెడ్ ఎల్టీపీవో 2.0 డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

OnePlus 9 Pro కి సక్సెసర్ గా వచ్చిన OnePlus 10 Pro 2022 మార్చిలో భారత్ లో లాంచ్ అయ్యింది. 8జిబి + 128జిబి ధర రూ.66,999 ఉండగా, 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.71,999 గా ఉంది. ఇప్పుడు వన్‌ప్లస్ ఈ రెండు వేరియంట్స్ పై ధర ను తగ్గించింది. తగ్గించిన ధర వన్ ప్లస్ అధికార వెబ్ సైట్ తో పాటు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా దర్శనమిస్తోంది. ఓసారి తగ్గిన ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

OnePlus 10 Pro ధర, లభ్యత

OnePlus 10 Pro పై రూ.5,000 తగ్గింది. తగ్గిన తర్వాత OnePlus 10 Pro 8జిబి + 128జిబి వేరియంట్ రూ.61,999 కి లభిస్తుండగా, 12జిబి + 256జిబి యూనిట్ ధర రూ.66,999 కి లభిస్తోంది. OnePlus 10 Pro స్మార్ట్ ఫోన్ ని వన్‌ప్లస్ అధికార వెబ్ సైట్ తో పాటు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొనవచ్చు. వొల్కానిక్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ ఫారెస్ట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తోంది.

అలాగే వన్ ప్లస్ కంపెనీ Buds Z2, Buds Pro పై డిస్కౌంట్ ఆఫర్ కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఇవి వరుసగా రూ.2,229 మరియు రూ.5,499 కి లభిస్తున్నాయి. Buds Z2 లాంచ్ ధర రూ.4,999 కాగా, Buds Pro లాంచ్ ప్రైస్ రూ.9,990. అంతేకాదండోయ్, OnePlus తన కస్టమర్ల కోసం ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా తీసుకొచ్చింది. పాత డివైజ్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. 9 నెలల కాలపరిమితితో వడ్డీలేని ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

OnePlus 10 Pro స్పెసిఫికేషన్స్

OnePlus 10 Pro లో 6.7-ఇంచ్ 2కే డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ ని ఈ ఫోన్ లో అమర్చారు. OnePlus 10 Pro ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus 10 Pro 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి వేరియంట్స్ లో లభించనుంది. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ ఎయిర్‌వూక్ వైర్లెస్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ OnePlus 10 Pro లో ఉన్నాయి.

OnePlus 10 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 సెన్సర్ ని అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Price drop: OnePlus 10 Pro పై రూ.5,000 తగ్గింపు first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus దీపావళి సేల్: OnePlus 10 Pro, 10R, 10T ఇతర ఫోన్లపై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/oneplus-diwali-sale-offers-discounts/ Thu, 22 Sep 2022 09:44:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=2500 హైలైట్స్: దీపావళి 2022 సేల్ ని ప్రకటించిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ OnePlus సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 వరకు కొనసాగనున్న సేల్, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వేరబుల్స్ తదితర ఉపకరణాలపై డిస్కౌంట్లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోన్న OnePlus అన్ని ప్రముఖ బ్రాండ్స్, అలాగే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకునేందుకు భారీ డిస్కౌంట్స్ తో జనాల ముందుకు వచ్చాయి. నేడు వన్‌ప్లస్ కూడా […]

The post OnePlus దీపావళి సేల్: OnePlus 10 Pro, 10R, 10T ఇతర ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • దీపావళి 2022 సేల్ ని ప్రకటించిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ OnePlus
  • సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 వరకు కొనసాగనున్న సేల్, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వేరబుల్స్ తదితర ఉపకరణాలపై డిస్కౌంట్లు
  • యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోన్న OnePlus

అన్ని ప్రముఖ బ్రాండ్స్, అలాగే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకునేందుకు భారీ డిస్కౌంట్స్ తో జనాల ముందుకు వచ్చాయి. నేడు వన్‌ప్లస్ కూడా తన దీపావళి సేల్ ని ప్రకటించింది. సెప్టెంబర్ 22 న మొదలై సెప్టెంబర్ 23 న ఈ సేల్ ముగుస్తుంది. ఈ సేల్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, వేరబుల్స్, ఇతర యాక్ససరీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ యూజర్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సేల్ సమయంలో ఏయే OnePlus స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus 10 Pro డీల్

OnePlus 10 Pro ఫ్లాగ్షిప్ డివైజ్ సాధారణ రోజుల్లో ధర రూ.66,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా వన్ ప్లస్ వెబ్ సైట్ లో దీని ధర రూ.61,999 కి తగ్గింది. కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ లేదా ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.6000 డిస్కౌంట్ పొందుతారు. దీంతో OnePlus 10 Pro ధర రూ.55,999 కి తగ్గుతుంది.

OnePlus 10 Pro స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ ఎల్టీపీవో డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్
  • 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
  • 48ఎంపి+50ఎంపి+8ఎంపి ట్రిపుల్ కెమెరాలు
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus 10R సేల్ ధర

సాధారణ రోజుల్లో OnePlus 10R ధర రూ.38,999 గా ఉంది. అయితే దీపావళి సేల్ సందర్భంగా దీని ధర రూ.32,999 కి తగ్గింది. ఇతర డిస్కౌంట్స్ కూడా కలిపితే కొనుగోలుదారులకు మరో రూ.3000 అదనపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.29,999 కి తగ్గుతుంది.

OnePlus 10R స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8100మ్యాక్స్ చిప్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాలు
  • 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus 10T 5G ఆఫర్ ధర

OnePlus 10T 5G ఫోన్ రీసెంట్ గా లాంచ్ అయ్యింది. భారత్ లో దీని ప్రారంభ ధర రూ.49,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్, ఈఎంఐ ద్వారా OnePlus 10T 5G ఫోన్ కొంటే రూ.5000 డిస్కౌంట్ లభిస్తోంది.

OnePlus 10T 5G స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ డిస్ప్లే,120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాస్
  • 4800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord 2T 5G

ఈ ఏడాది జులై నెలలో OnePlus Nord 2T 5G ఫోన్ లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.28,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ కొంటే రూ.4000 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఫోన్ ధర రూ.24,999 కి తగ్గుతుంది.

OnePlus Nord 2T 5G స్పెసిఫికేషన్స్

  • 6.43-ఇంచ్ డిస్ప్లే, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
  • 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 2 5G

భారత్ లో OnePlus Nord CE 2 5G ధర రూ.23,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా కొనుగోలుదారులు రూ.22,499 కి ఈ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా OnePlus Nord CE 2 5G ఫోన్ ని కొంటే రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది.

OnePlus Nord CE 2 5G స్పెసిఫికేషన్స్

  • 6.43-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్
  • 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
  • 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 2 Lite 5G పై డిస్కౌంట్

భారత్ లో లభిస్తోన్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లో కెల్లా తక్కువ ధర కలిగిన ఫోన్ OnePlus Nord CE 2 5G. సాధారణ రోజుల్లో దీని ధర రూ.19,999 గా ఉంది. అయితే దీపావళి సేల్ సందర్భంగా దీనిపై రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా OnePlus Nord CE 2 Lite 5G ఫోన్ ని కొంటే అదనంగా రూ.1500 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ ఫోన్ ని రూ.17,499 కే సొంతం చేసుకోవచ్చు.

OnePlus Nord CE 2 5G స్పెసిఫికేషన్స్

  • 6.59-ఇంచ్ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • 64ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్

The post OnePlus దీపావళి సేల్: OnePlus 10 Pro, 10R, 10T ఇతర ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>