OnePlus 10R Prime Blue Edition - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 19 Sep 2022 15:04:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 సెప్టెంబర్ 22 న భారత్ లో లాంచ్ అవుతోన్న OnePlus 10R Prime Blue Edition https://www.91mobiles.com/telugu/oneplus-10r-prime-blue-edition-india-launch-date-price-specs/ Mon, 19 Sep 2022 15:04:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=2439 హైలైట్స్: సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి రానున్న OnePlus 10R Prime Blue Edition అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న 150వాట్, 80వాట్ వేరియంట్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు OnePlus 10R ఏప్రిల్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. వన్ ప్లస్ 9ఆర్ కి ఇది సక్సెసర్ గా వచ్చింది. 150వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, […]

The post సెప్టెంబర్ 22 న భారత్ లో లాంచ్ అవుతోన్న OnePlus 10R Prime Blue Edition first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి రానున్న OnePlus 10R Prime Blue Edition
  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న 150వాట్, 80వాట్ వేరియంట్స్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

OnePlus 10R ఏప్రిల్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. వన్ ప్లస్ 9ఆర్ కి ఇది సక్సెసర్ గా వచ్చింది. 150వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్సెట్ తో వచ్చిన తొలి ఫోన్ OnePlus 10R కావడం విశేషం. లాంచ్ నాటి నుంచి ఈ ఫోన్ సియెర్రా బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. రీసెంట్ గా వన్ ప్లస్ కంపెనీ మూడో కలర్ ప్రైమ్ బ్లూ ఎడిషన్ ని కన్ఫర్మ్ చేసింది. భారత్ లో OnePlus 10R Prime Blue Edition యొక్క సేల్ డేట్ ని కంపెనీ ప్రకటించింది.

సెప్టెంబర్ 22 నుంచి భారత్ లో OnePlus 10R Prime Blue Edition అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ మాదిరి కెమెరా మాడ్యూల్ క్రింద పొడవాటి గీతలు, మరొక సగం ప్యానెల్ గ్రేడియంట్ ఫినిష్, బాటమ్ లో వన్ ప్లస్ లోగోని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. OnePlus 10R Prime Blue కలర్ వేరియంట్ రెండు చార్జింగ్ వేరియంట్స్ తో వస్తోంది.

భారత్ లో OnePlus 10R Prime Blue Edition ధర, విక్రయ తేదీ

సెప్టెంబర్ 22 నుంచి అంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కి ఒక రోజు ముందు నుంచి OnePlus 10R Prime Blue Edition సేల్ కి రానుంది. రెండు చార్జింగ్ వేరియంట్స్ లో బ్లూ కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. OnePlus 10R 80 వాట్, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్స్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

OnePlus 10R 8జిబి + 128జిబి మోడల్ ధర భారత్ లో రూ.38,999 గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధర రూ.42,999 గా ఉంది. 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన OnePlus 10R Endurance Edition 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.43,999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంది.

OnePlus 10R Prime Blue Edition స్పెసిఫికేషన్స్

OnePlus 10R లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:1:9 యాస్పెక్ట్ రేషియో, 93.4 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఎస్ఆర్జీబీ, డిస్ప్లే పీ3 10-బిట్ కలర్ ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్, 4100 ఎంఎం2 వేపర్ చాంబర్, కూలింగ్ ఫిల్మ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

OnePlus 10R లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రా-వైడ్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 16ఎంపి కెమెరా అమర్చారు. 4500ఎంఏహెచ్, 150వాట్ ఫాస్ట్ చార్జింగ్ మరియు 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

The post సెప్టెంబర్ 22 న భారత్ లో లాంచ్ అవుతోన్న OnePlus 10R Prime Blue Edition first appeared on 91Mobiles Telugu.

]]>