OnePlus 10R - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 07 Jun 2023 16:25:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus Community Sale: రూ.28,999 ధరకే లభిస్తోన్న OnePlus 10R! https://www.91mobiles.com/telugu/oneplus-10r-price-cut-oneplus-community-sale/ Wed, 07 Jun 2023 16:25:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=6666 2022 ఏప్రిల్ నెలలో OnePlus 10R భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ప్రీమియమ్ మిడ్-రేంజ్ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో భారత్ లో లాంచైంది. రూ.38,999 ధరతో భారత మార్కెట్ లోకి OnePlus 10R ప్రవేశించింది. OnePlus 10R ఫోన్ కి ఎక్స్‌పర్ట్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. కెమెరా పనితీరు అంత గొప్పగా లేకపోవడం, గేమింగ్ పెర్ఫామెన్స్ కూడా మెరుగ్గా లేకపోవడమే అందుకు కారణం. అయితే […]

The post OnePlus Community Sale: రూ.28,999 ధరకే లభిస్తోన్న OnePlus 10R! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.38,999 ధరతో 2022 ఏప్రిల్ లో లాంచైన OnePlus 10R
  • వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ లో భాగంగా రూ.28,999 కే లభిస్తోన్న డివైజ్
  • డైమెన్సిటీ 8100 చిప్, 150W ఫాస్ట్ చార్జింగ్‌తో వచ్చిన OnePlus 10R

2022 ఏప్రిల్ నెలలో OnePlus 10R భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ప్రీమియమ్ మిడ్-రేంజ్ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో భారత్ లో లాంచైంది. రూ.38,999 ధరతో భారత మార్కెట్ లోకి OnePlus 10R ప్రవేశించింది. OnePlus 10R ఫోన్ కి ఎక్స్‌పర్ట్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. కెమెరా పనితీరు అంత గొప్పగా లేకపోవడం, గేమింగ్ పెర్ఫామెన్స్ కూడా మెరుగ్గా లేకపోవడమే అందుకు కారణం. అయితే వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ లో భాగంగా OnePlus 10R డివైజ్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో మరోసారి ఈ డివైజ్ ఫోకస్ లోకి వచ్చింది.

OnePlus 10R డీల్

  • OnePlus 10R డివైజ్ 8జిబి+128జిబి మోడల్ రూ.38,999 ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది. 12జిబి+256జిబి వేరియంట్ రూ.42,999 ధరతో ఎంట్రీ ఇచ్చింది. OnePlus 10R Endurance Edition 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. దీని ధర రూ.43,999 గా ఉంది.
  • వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ లో భాగంగా OnePlus 10R బేస్ మోడల్ రూ.34,999 కే లభిస్తోంది. 12జిబి+256జిబి మోడల్ ధర రూ.38,999 గా ఉంది.
  • అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్స్ కూపన్ ద్వారా రూ.4,000 డిస్కౌంట్ అందిస్తున్నాయి. దీంతో పాటు, ఐసీఐసీఐ కార్డ్, వన్ మెటల్ కార్డ్ లపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.
  • దీంతో OnePlus 10R ధర రూ.32,999 నుంచి రూ.28,999 కి తగ్గనుంది.

OnePlus 10R స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 10R లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20.1:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఎస్ఆజీబీ, డిస్ప్లే పీ3 10-బిట్ కలర్ ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 10R హ్యాండ్సెట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 10R లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus 10R డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus 10R లో 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: OnePlus 10R లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ సోని ఐఎంఎక్స్355 సెన్సర్, 119-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. 16ఎంపి ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.
  • బ్యాటరీ: OnePlus 10R లో రెండు బ్యాటరీ వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్ మరియు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మోడల్ ఉన్నాయి.

The post OnePlus Community Sale: రూ.28,999 ధరకే లభిస్తోన్న OnePlus 10R! first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus దీపావళి సేల్: OnePlus 10 Pro, 10R, 10T ఇతర ఫోన్లపై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/oneplus-diwali-sale-offers-discounts/ Thu, 22 Sep 2022 09:44:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=2500 హైలైట్స్: దీపావళి 2022 సేల్ ని ప్రకటించిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ OnePlus సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 వరకు కొనసాగనున్న సేల్, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వేరబుల్స్ తదితర ఉపకరణాలపై డిస్కౌంట్లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోన్న OnePlus అన్ని ప్రముఖ బ్రాండ్స్, అలాగే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకునేందుకు భారీ డిస్కౌంట్స్ తో జనాల ముందుకు వచ్చాయి. నేడు వన్‌ప్లస్ కూడా […]

The post OnePlus దీపావళి సేల్: OnePlus 10 Pro, 10R, 10T ఇతర ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • దీపావళి 2022 సేల్ ని ప్రకటించిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ OnePlus
  • సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 వరకు కొనసాగనున్న సేల్, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వేరబుల్స్ తదితర ఉపకరణాలపై డిస్కౌంట్లు
  • యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోన్న OnePlus

అన్ని ప్రముఖ బ్రాండ్స్, అలాగే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకునేందుకు భారీ డిస్కౌంట్స్ తో జనాల ముందుకు వచ్చాయి. నేడు వన్‌ప్లస్ కూడా తన దీపావళి సేల్ ని ప్రకటించింది. సెప్టెంబర్ 22 న మొదలై సెప్టెంబర్ 23 న ఈ సేల్ ముగుస్తుంది. ఈ సేల్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, వేరబుల్స్, ఇతర యాక్ససరీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ యూజర్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సేల్ సమయంలో ఏయే OnePlus స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus 10 Pro డీల్

OnePlus 10 Pro ఫ్లాగ్షిప్ డివైజ్ సాధారణ రోజుల్లో ధర రూ.66,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా వన్ ప్లస్ వెబ్ సైట్ లో దీని ధర రూ.61,999 కి తగ్గింది. కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ లేదా ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.6000 డిస్కౌంట్ పొందుతారు. దీంతో OnePlus 10 Pro ధర రూ.55,999 కి తగ్గుతుంది.

OnePlus 10 Pro స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ ఎల్టీపీవో డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్
  • 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
  • 48ఎంపి+50ఎంపి+8ఎంపి ట్రిపుల్ కెమెరాలు
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus 10R సేల్ ధర

సాధారణ రోజుల్లో OnePlus 10R ధర రూ.38,999 గా ఉంది. అయితే దీపావళి సేల్ సందర్భంగా దీని ధర రూ.32,999 కి తగ్గింది. ఇతర డిస్కౌంట్స్ కూడా కలిపితే కొనుగోలుదారులకు మరో రూ.3000 అదనపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.29,999 కి తగ్గుతుంది.

OnePlus 10R స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8100మ్యాక్స్ చిప్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాలు
  • 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus 10T 5G ఆఫర్ ధర

OnePlus 10T 5G ఫోన్ రీసెంట్ గా లాంచ్ అయ్యింది. భారత్ లో దీని ప్రారంభ ధర రూ.49,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్, ఈఎంఐ ద్వారా OnePlus 10T 5G ఫోన్ కొంటే రూ.5000 డిస్కౌంట్ లభిస్తోంది.

OnePlus 10T 5G స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ డిస్ప్లే,120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాస్
  • 4800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord 2T 5G

ఈ ఏడాది జులై నెలలో OnePlus Nord 2T 5G ఫోన్ లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.28,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ కొంటే రూ.4000 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఫోన్ ధర రూ.24,999 కి తగ్గుతుంది.

OnePlus Nord 2T 5G స్పెసిఫికేషన్స్

  • 6.43-ఇంచ్ డిస్ప్లే, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
  • 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 2 5G

భారత్ లో OnePlus Nord CE 2 5G ధర రూ.23,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా కొనుగోలుదారులు రూ.22,499 కి ఈ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా OnePlus Nord CE 2 5G ఫోన్ ని కొంటే రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది.

OnePlus Nord CE 2 5G స్పెసిఫికేషన్స్

  • 6.43-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్
  • 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
  • 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 2 Lite 5G పై డిస్కౌంట్

భారత్ లో లభిస్తోన్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లో కెల్లా తక్కువ ధర కలిగిన ఫోన్ OnePlus Nord CE 2 5G. సాధారణ రోజుల్లో దీని ధర రూ.19,999 గా ఉంది. అయితే దీపావళి సేల్ సందర్భంగా దీనిపై రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా OnePlus Nord CE 2 Lite 5G ఫోన్ ని కొంటే అదనంగా రూ.1500 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ ఫోన్ ని రూ.17,499 కే సొంతం చేసుకోవచ్చు.

OnePlus Nord CE 2 5G స్పెసిఫికేషన్స్

  • 6.59-ఇంచ్ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • 64ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్

The post OnePlus దీపావళి సేల్: OnePlus 10 Pro, 10R, 10T ఇతర ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
డిస్కౌంట్ ధరకు లభిస్తోన్న OnePlus 10R https://www.91mobiles.com/telugu/oneplus-10r-discount-sale-in-india-via-amazon/ Mon, 18 Jul 2022 11:55:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=1042 హైలైట్స్: ఇప్పుడు రూ.34,999, రూ.38,999, రూ.39,999 కి లభిస్తున్న వన్ ప్లస్ 10ఆర్ కూపన్ ద్వారా రూ.3,000 డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా మరో రూ.1,000 డిస్కౌంట్ 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు భారత్ లో వన్ ప్లస్ 10ఆర్ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ లో లాంచ్ అయ్యింది. 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, […]

The post డిస్కౌంట్ ధరకు లభిస్తోన్న OnePlus 10R first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఇప్పుడు రూ.34,999, రూ.38,999, రూ.39,999 కి లభిస్తున్న వన్ ప్లస్ 10ఆర్
  • కూపన్ ద్వారా రూ.3,000 డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా మరో రూ.1,000 డిస్కౌంట్
  • 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు

భారత్ లో వన్ ప్లస్ 10ఆర్ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ లో లాంచ్ అయ్యింది. 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు. మంచి పెర్ఫామెన్స్, వేగవంతమైన ఛార్జింగ్ స్పీడ్ ఉండటం చేత, ఈ ఫోన్ కి చక్కటి రివ్యూలు వచ్చాయి. రూ.38,999 ధరకి వన్ ప్లస్ 10ఆర్ మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది. అయితే ఇప్పుడు అంతకంటే తక్కువ ధరకే అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ముందుందనగా, ఈ ఆఫర్ వచ్చింది.

భారత్ లో OnePlus 10R ధర

వన్ ప్లస్ 10ఆర్ మూడు వేరియంట్లు 8జిబి+128జిబి, 12జిబి+256జిబి, 12జిబి+256జిబి 150వాట్ లపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. 8జిబి+128జిబి లాంచ్ ప్రైస్ రూ.38,999 కాగా, డిస్కౌంట్ తో రూ.34,999 కి లభించనుంది. 12జిబి+256జిబి లాంచ్ ప్రైస్ రూ.42,999 కాగా, డిస్కౌంట్ తో రూ.38,999 కి లభించనుంది. 12జిబి+256జిబి 150వాట్ లాంచ్ ప్రైస్ రూ.43,999 కాగా, డిస్కౌంట్ తో రూ.39,999 కి లభించనుంది.

ఇప్పుడు డీల్ లో బాగంగా వన్ ప్లస్ 10ఆర్ ని రూ.34,999 కి కొనుగోలు చేయవచ్చు. కూపన్ పై అమెజాన్ రూ.3000 డిస్కౌంట్ ను అందిస్తోంది. అలాగే ఐసీఐసీఐ కార్డు ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే, అదనంగా రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. డిస్కౌంట్ తో వన్ ప్లస్ 10ఆర్ ధర వేరియంట్ ని బట్టి రూ.34,999, రూ.38,999, రూ.39,999 గా ఉండనుంది.

OnePlus 10R స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ ఈ4 అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్సెట్
  • 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
  • 50ఎంపి+8ఎంపి+2ఎంపి ట్రిపుల్ కెమెరాలు
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్

వన్ ప్లస్ 10ఆర్ ఫోన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2,412*1,080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:1:9 ఆస్పెక్ట్ రేషియో, 93.4 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఎస్ఆర్జీబీ, డిస్ప్లే పీ3 10-బిట్ కలర్ ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్సెట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే, వన్ ప్లస్ 10ఆర్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. వీటిలో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ (6పి లెన్స్, ఓఐఎస్, f/1.8), 8ఎంపి అల్ట్రావైడ్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సర్ (119 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ), 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

వన్ ప్లస్ 10ఆర్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. 4,100 ఎంఎం స్క్వేర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇకపోతే ఈ ఫోన్ బరువు 186 గ్రాములు.

వన్ ప్లస్ 10ఆర్ రెండు బ్యాటరీ మోడల్స్ లో లభ్యమవుతోంది. వీటిలో ఒకటి 4,500ఎంఏహెచ్, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 12జిబి+256జిబి సియారా బ్లాక్ మోడల్ కాగా, మరొకటి 5,000ఎంఏహెచ్, 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ మోడల్.

The post డిస్కౌంట్ ధరకు లభిస్తోన్న OnePlus 10R first appeared on 91Mobiles Telugu.

]]>