OnePlus 11 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 18 Oct 2022 05:42:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus 11 గా పిలవబడనున్న నెక్ట్స్ జనరేషన్ వన్‌ప్లస్ ‘ప్రో’ మోడల్ https://www.91mobiles.com/telugu/oneplus-next-generation-flagship-to-be-called-as-one-plus-11-not-11-pro/ Tue, 18 Oct 2022 05:42:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=2935 హైలైట్స్ ప్రో స్పెసిఫికేషన్స్ తో కూడిన వన్ ప్లస్ నెక్ట్స్ ఫ్లాగ్షిప్ పేరు ‘OnePlus 11’ ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన వన్ ప్లస్ 10 ప్రో మాదిరిగా టాప్ ఎండ్ స్పెసిఫికేషన్స్ కలిగి ఉండనున్న OnePlus 11 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ OnePlus 11 లో ఉండే అవకాశం ఈ ఏడాది వన్ […]

The post OnePlus 11 గా పిలవబడనున్న నెక్ట్స్ జనరేషన్ వన్‌ప్లస్ ‘ప్రో’ మోడల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ప్రో స్పెసిఫికేషన్స్ తో కూడిన వన్ ప్లస్ నెక్ట్స్ ఫ్లాగ్షిప్ పేరు ‘OnePlus 11’
  • ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన వన్ ప్లస్ 10 ప్రో మాదిరిగా టాప్ ఎండ్ స్పెసిఫికేషన్స్ కలిగి ఉండనున్న OnePlus 11
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ OnePlus 11 లో ఉండే అవకాశం

ఈ ఏడాది వన్ ప్లస్ కి బిజీగా గడిచిపోయింది. ఈలోపు వన్ ప్లస్ తదుపరి ఫ్లాగ్షిప్ OnePlus 11 Pro గురించి రూమర్లు వస్తూనే ఉన్నాయి. 2023 ఆరంభంలో వన్ ప్లస్ నెక్ట్స్ ఫ్లాగ్షిప్ లాంచ్ కానుందని సమాచారం. ప్రముఖ లీక్‌స్టర్ మ్యాక్స్ జాంబర్ చెబుతున్న దాన్ని బట్టి, ప్రో-స్పెసిఫికేషన్స్ కలిగిన నెక్ట్స్ వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 గా అంతర్జాతీయంగా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఇందుకు గల కారణం ఏంటో ప్రస్తుతానికి తెలియదు.

దీనర్థం ఏంటంటే, డివైజ్ లో ప్రో-గ్రేడ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కానీ, ప్రో అని పిలవబడదన్న మాట. వన్‌ప్లస్ 10 ప్రో లాగే OnePlus 11 లో కూడా టాప్-ఎండ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కానీ, OnePlus 11 Pro అని పిలవబడదంతే.

అది OnePlus 11, OnePlus 11 Pro కాదు

వన్ ప్లస్ 10 ప్రో లాంచ్ అయిన టైమ్‌లైన్ లోనే OnePlus 11 కూడా లాంచ్ అవ్వనుంది. ప్రో-స్పెసిఫికేషన్స్ కలిగినప్పటికీ వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 అనే పిలవబడుతుందని, ఎందుకంటే తర్వాత మరికొన్ని మోడల్స్ ని లాంచ్ చేసే ఆలోచనలో వన్ ప్లస్ ఉందని, టిప్‌స్టర్ మ్యాక్స్ జాంబర్ తెలిపాడు.

OnePlus 11 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రానుంది. మరి ప్రో వర్షన్ ని స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్ తో తీసుకురావడానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. ఇప్పటికే లీకైన OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ నిజానికి OnePlus 11 కి సంబంధించినవి. OnePlus 11 స్మార్ట్ ఫోన్ 2023 జనవరి లో లాంచ్ అవుతుంది.

OnePlus 11 స్పెసిఫికేషన్స్

ఇదివరకు 91మొబైల్స్ ఎక్స్‌క్లూజివ్ గా వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ యొక్క స్పెసిఫికేషన్స్ ని షేర్ చేసింది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ తో రానుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉండనుంది. ఇకపోతే ఈ ఫోన్ లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ సౌకర్యం ఉంటుంది. OnePlus 11 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OnePlus 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి 2x టెలీఫోటో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంటుంది. OnePlus 11 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని అంచనా.

OnePlus 11 ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో రానుంది. అలాగే ఇందులో హాజెల్‌బ్లడ్ కెమెరా సెన్సర్స్, డాల్బి అట్మాస్ ఉంటాయి. 5జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ OnePlus 11 లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OnePlus 11 గా పిలవబడనున్న నెక్ట్స్ జనరేషన్ వన్‌ప్లస్ ‘ప్రో’ మోడల్ first appeared on 91Mobiles Telugu.

]]>
రివీల్ అయిన OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-11-pro-specs-revealed-by-a-tipster/ Wed, 21 Sep 2022 13:01:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=2485 హైలైట్స్: OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసిన టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్, 120హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న OnePlus 11 Pro OnePlus 11 Pro 2023 ప్రథమార్థంలో లాంచ్ అవుతుందని అంచనా టిప్ స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్ ద్వారా OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. వన్ ప్లస్ నుంచి రాబోవు ఈ ఫ్లాగ్షిప్, స్మార్ట్‌ప్రిక్స్ […]

The post రివీల్ అయిన OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసిన టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్, 120హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న OnePlus 11 Pro
  • OnePlus 11 Pro 2023 ప్రథమార్థంలో లాంచ్ అవుతుందని అంచనా

టిప్ స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్ ద్వారా OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. వన్ ప్లస్ నుంచి రాబోవు ఈ ఫ్లాగ్షిప్, స్మార్ట్‌ప్రిక్స్ షేర్ చేసిన రెండర్స్ వల్లన కొన్ని రోజుల క్రితం వార్తల్లో నిలిచింది. రెండర్స్ ద్వారా OnePlus 11 Pro లో అలర్ట్ స్లైడర్ ఉంటుందని స్పష్టమైంది. ఇప్పుడు స్టీవ్, 91మొబైల్స్ తో OnePlus 11 Pro యొక్క చిప్సెట్, ఫాస్ట్ చార్జింగ్, అలర్ట్ స్లైడర్ తదితర స్పెసిఫికేషన్స్ ని పంచుకున్నాడు.

వన్ ప్లస్ సంస్థ ఈ ఏడాది, OnePlus 10 Pro, OnePlus 10T, OnePlus 10R మోడల్స్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు OnePlus 11 సిరీస్ ని వచ్చే ఏడాది లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు OnePlus 11 Pro గురించి మాకు తెలిసిన వివరాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఓసారి వాటిపై కన్నేయండి.

OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్
  • 16జిబి వరకు ర్యామ్
  • 50ఎంపి + 48ఎంపి + 32ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus 11 Pro లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయని టిప్ స్టర్ 91మొబైల్స్ తో తెలిపాడు. అలాగే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానుంది. ఈ ఏడాది నవంబర్ లో క్వాల్కమ్ కంపెనీ తన నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ని లాంచ్ చేయబోతోంది. ఇక OnePlus 11 Pro టాప్ వేరియంట్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ కలిగి ఉండగా, బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుందని సమాచారం.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే, OnePlus 11 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్లో కచ్చితంగా ఉంటుందని సమాచారం. గతంలో నెట్టింట్లో ప్రత్యక్షమైన OnePlus 11 Pro రెండర్స్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

OnePlus 11 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, హాజల్‌బ్లడ్ కెమెరాలు, డాల్బి అట్మాస్, 5జీ కనెక్టివిటీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉండనున్నాయి. OnePlus 11 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.

OnePlus 11 Pro లాంచ్ తేదీ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే 2023 ప్రథమార్థం లో ఫోన్ లాంచ్ అవుతుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post రివీల్ అయిన OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus 11 Pro ఇమేజెస్: కెమెరా మాడ్యూల్ లో మార్పులు https://www.91mobiles.com/telugu/oneplus-11-pro-renders-leaked-camera-module-redesigned/ Mon, 12 Sep 2022 14:39:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=2282 హైలైట్స్: లీకైన OnePlus 11 Pro ఫ్లాగ్షిప్ ఫోన్ రెండర్స్ హాజెల్‌బ్లడ్ లెన్స్, కొత్త కెమెరా మాడ్యూల్ తో రానున్న OnePlus 11 Pro OnePlus 11 Pro 2023 లో లాంచ్ అవుతుందని అంచనా వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తూ ఈ ఏడాది అంతా వన్ ప్లస్ బిజీగా మారిపోయింది. OnePlus 10 Pro ఫ్లాగ్షిప్ తో పాటు OnePlus 10R, OnePlus 10T, Nord డివైజెస్ ని వన్ ప్లస్ లాంచ్ చేసింది. వన్ […]

The post లీకైన OnePlus 11 Pro ఇమేజెస్: కెమెరా మాడ్యూల్ లో మార్పులు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లీకైన OnePlus 11 Pro ఫ్లాగ్షిప్ ఫోన్ రెండర్స్
  • హాజెల్‌బ్లడ్ లెన్స్, కొత్త కెమెరా మాడ్యూల్ తో రానున్న OnePlus 11 Pro
  • OnePlus 11 Pro 2023 లో లాంచ్ అవుతుందని అంచనా

వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తూ ఈ ఏడాది అంతా వన్ ప్లస్ బిజీగా మారిపోయింది. OnePlus 10 Pro ఫ్లాగ్షిప్ తో పాటు OnePlus 10R, OnePlus 10T, Nord డివైజెస్ ని వన్ ప్లస్ లాంచ్ చేసింది. వన్ ప్లస్ 10టీ ఈ కంపెనీ నుంచి 2022 లో చివరిదని రూమర్లు వినిపించాయి. అయితే తాజాగా OnePlus 11 Pro రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. స్మార్ట్‌ప్రిక్స్, స్టీవ్ హెమ్మర్స్టాఫర్ ఈ రెండర్స్ ని లీక్ చేశారు. OnePlus 11 Pro రెండర్స్ ఇంకా రివీల్ కావాల్సి ఉంది. అయితే ఈ ఫ్లాగ్షిప్ 2023 లో లాంచ్ అవుతుందని సమాచారం.

తాజాగా రివీల్ అయిన OnePlus 11 Pro రెండర్స్ ని బట్టి, కెమెరా మాడ్యూల్ కొత్త డిజైన్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. అలాగే హాజల్‌బ్లడ్ బ్రాండింగ్ కూడా రియర్ ప్యానెల్ పై కనిపిస్తోంది. అలర్ట్ స్లైడర్ రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 10 ప్రో తప్పించి వన్‌ప్లస్ 10 డివైజెస్ లో అలర్ట్ స్లైడర్ కనిపించలేదు.

లీక్డ్ రెండర్స్ ద్వారా రివీల్ అయిన OnePlus 11 Pro డిజైన్

ముందస్తుగా బయటకు వచ్చిన రెండర్స్ ద్వారా OnePlus 11 Pro డిజైన్ ఎలా ఉండనుందో తెలుస్తోంది. ఇంకా లాంచ్ కి కొన్ని నెలల సమయం ఉంది కాబట్టి, అప్పుడే డిజైన్ పై ఏమీ చెప్పలేం. ఈ డిజైన్ కి మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు.

ఫోన్ కి టాప్-లెఫ్ట్ కార్నర్ లో పంచ్ హోల్ కటౌట్ కనిపిస్తోంది. అలాగే ఇందులో సన్నని బెజెల్స్ ఉన్నాయి. ఫోన్ కాస్త కర్వ్డ్ ఎడ్జెస్ కలిగి ఉంది. ఇది పాతదైన డిజైన్ కావున వన్ ప్లస్ ఈ డిజైన్ ని ఎలా ఎంచుకుందో చూడాలి. ఇకపోతే అలర్ట్ స్లైడర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. వాల్యూమ్ రాకర్ ఎడమ వైపున ఉంది. స్పీకర్ గ్రిల్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ బాటమ్ లో కనిపిస్తోంది.

బ్యాక్ ప్యానెల్ ఆకట్టుకునేలా ఉంది. భారీ మాడ్యూల్ బంప్ ని మనం చూడవచ్చు. ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఇందులో ఉన్నాయి. సర్‌క్యులర్ మాడ్యూల్ లో హాజెల్‌‌బ్లడ్ అని రాసి ఉంది. ఫోన్ నలుపు రంగులో కనిపిస్తోంది కానీ, ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశముంది. ఇక బ్యాక్ ప్యానెల్ పై మధ్యలో వన్‌ప్లస్ లోగో కనిపిస్తోంది.

ప్రస్తుతానికి OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్ రహస్యంగానే ఉన్నాయి. అయితే ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 చిప్సెట్ తో వస్తోందని సమాచారం. త్వరలోనే OnePlus 11 Pro కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లీకైన OnePlus 11 Pro ఇమేజెస్: కెమెరా మాడ్యూల్ లో మార్పులు first appeared on 91Mobiles Telugu.

]]>