OnePlus Ace Pro Genshin Impact - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 26 Oct 2022 12:30:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచ్ అయిన OnePlus Ace Pro Genshin Impact ఎడిషన్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-pro-genshin-impact-edition-launched-price-specs/ Wed, 26 Oct 2022 12:30:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=3078 హైలైట్స్ ఆగస్టులో లాంచ్ అయిన OnePlus Ace Pro (గ్లోబల్ గా OnePlus 10T) OnePlus Ace Pro Genshin Impact అనే కొత్త వేరియంట్ ని లాంచ్ చేసిన వన్‌ప్లస్ అక్టోబర్ 31 నుంచి చైనాలో సేల్ కి వస్తున్న OnePlus Ace Pro Genshin Impact OnePlus Ace Pro Genshin Impact ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఆగస్టులో OnePlus Ace Pro (గ్లోబల్ గా OnePlus 10T) స్మార్ట్ ఫోన్ లాంచ్ […]

The post లాంచ్ అయిన OnePlus Ace Pro Genshin Impact ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఆగస్టులో లాంచ్ అయిన OnePlus Ace Pro (గ్లోబల్ గా OnePlus 10T)
  • OnePlus Ace Pro Genshin Impact అనే కొత్త వేరియంట్ ని లాంచ్ చేసిన వన్‌ప్లస్
  • అక్టోబర్ 31 నుంచి చైనాలో సేల్ కి వస్తున్న OnePlus Ace Pro Genshin Impact

OnePlus Ace Pro Genshin Impact ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఆగస్టులో OnePlus Ace Pro (గ్లోబల్ గా OnePlus 10T) స్మార్ట్ ఫోన్ లాంచ్ కాగా, తాజాగా కొత్త ఎడిషన్ జెన్షిన్ ఇంపాక్ట్ ని వన్ ప్లస్ కంపెనీ చైనా మార్కెట్ లోకి వదిలింది. OnePlus Ace Pro మాదిరి స్పెసిఫికేషన్స్ ఇందులో ఉంటాయి. ప్రముఖ Genshin Impact యాక్షన్ గేమ్ నుంచి ఇన్-డెప్త్ కస్టమైజేషన్ తో ఈ ఫోన్ వస్తోంది.

కస్టమ్ యానిమేషన్స్, న్యూ వాల్‌పేపర్స్, కలర్స్ తో కూడిన కొత్త థీమ్ తో OnePlus Ace Pro Genshin Impact లిమిటెడ్ ఎడిషన్ వస్తోంది. రెగ్యులర్ బ్లాక్/గ్రీన్ బ్యాక్ ప్యానెల్ తో కాకుండా, జెన్షిన్ థీమ్డ్ క్యారెక్టర్స్ ప్రింట్ అయిన ప్యానెల్ తో ఫోన్ వస్తోంది.

OnePlus Ace Pro Genshin Impact లిమిటెడ్ ఎడిషన్ ధర

అక్టోబర్ 31 నుంచి చైనాలో OnePlus Ace Pro Genshin Impact లిమిటెడ్ ఎడిషన్ సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ధర 4299 యువాన్లు (సుమారు రూ.48,665) గా నిర్ణయించారు. OnePlus Ace Pro యొక్క 16జిబి + 512జిబి వేరియంట్ ధర కూడా ఇంతే ఉంది.

OnePlus Ace Pro Genshin Impact లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ డార్క్ బ్రౌన్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. ప్రధాన చైనీస్ రిటైలర్స్, ఒప్పో స్టోర్స్ ఇప్పటికే రిజిస్ట్రేషన్, ప్రీ-ఆర్డర్స్ కి సిద్ధమయ్యాయి.

OnePlus Ace Pro Genshin Impact లిమిటెడ్ ఎడిషన్ డిజైన్, స్పెసిఫికేషన్స్

OnePlus Ace Pro Genshin Impact లిమిటెడ్ ఎడిషన్ డార్క్ బ్రౌన్ కలర్ లో వస్తోంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై జెన్షిన్ గేమ్ లోని క్యారెక్టర్స్ ని ప్రింట్ చేశారు. కస్టమైజేషన్ లో భాగంగా ఫోన్ లో ఫింగర్ ప్రింట్ అన్‌లాకింగ్ యానిమేషన్, బూట్ యానిమేషన్, లైవ్ వాల్ పేపర్, ఆఫ్-స్క్రీన్ లాక్, 60 జెన్షిన్ ఇంపాక్ట్ యాప్ ఐకన్స్, వాల్‌నట్ ఒరిజనల్ వాయిస్ ని యాడ్ చేయడం జరిగింది.

డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన గిఫ్ట్ ప్యాక్ లో ఈ ఫోన్ వస్తుంది. బాక్స్ లో ప్రొటెక్టివ్ కేస్, కస్టమ్ చార్జర్, కొన్ని వోచర్లు, షాపింగ్ పాయింట్స్, వాల్‌నట్-లియూ గ్యాంగ్ ఆర్కిలిక్ ఆర్నమెంట్, వాల్‌నట్ కస్టమ్ ఎమోజీ స్టిక్కర్స్, పోస్టర్స్ వంటివి ఉన్నాయి.

OnePlus Ace Pro Genshin Impact లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్ లో ఏ మార్పు లేదు. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 4800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ సూపర్ ఫ్లాష్ చార్జింగ్ ఉన్నాయి.

OnePlus Ace Pro Genshin Impact కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరాను అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ అయిన OnePlus Ace Pro Genshin Impact ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>